బుమ్రాపై వైభవ్‌ సూర్యవంశీ కామెంట్ వైరల్‌ | Didnt feel like much: Vaibhav Sooryavanshi on Smash Sixes In Bumrah Over | Sakshi
Sakshi News home page

బుమ్రాపై వైభవ్‌ సూర్యవంశీ కామెంట్ వైరల్‌

Apr 9 2026 12:32 PM | Updated on Apr 9 2026 1:37 PM

Didnt feel like much: Vaibhav Sooryavanshi on Smash Sixes In Bumrah Over

టీమిండియా ప్రధాన పేసర్‌, ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన శైలితో రాణిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందాడు బుమ్రా. అతడు బంతితో రంగంలోకి దిగాడంటే దిగ్గజ బ్యాటర్లు సైతం వణికిపోవాల్సిందే.

అయితే, రాజస్తాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు, పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీ మాత్రం బుమ్రాను సునాయాసంగా ఎదుర్కొన్నాడు. అతడికి ఏకంగా సిక్సర్‌తో స్వాగతం పలికి ఔరా అనిపించాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ మంగళవారం తలపడ్డాయి.

తొలి బంతికే సిక్సర్‌ 
ఈ మ్యాచ్‌లో వైభవ్‌- బుమ్రా ఫైట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. బుమ్రా బౌలింగ్లో తొలి బంతికే సిక్సర్‌ బాదిన వైభవ్‌.. అతడి ఓవర్లో మరో సిక్స్‌ కూడా రాబట్టాడు. ఈ నేపథ్యంలో అతడి బ్యాటింగ్‌ తీరుపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ బుమ్రాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ముంబైపై విజయానంతరం రాయల్స్‌ సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేసింది. ఇందులో బుమ్రాను ఎదుర్కొన్న అనుభవం ఎలా ఉందన్న ప్రశ్నకు బదులిస్తూ..

గొప్పగా ఫీలవ్వడానికి ఏమీ లేదు
‘‘ఇందులో నేనేమీ గొప్పగా ఫీలవ్వడానికి ఏమీ లేదు. బౌలర్‌ కంటే కూడా బంతిపైనే ఎక్కువగా దృష్టి పెట్టేందుకు నేను ఎల్లవేళలా ప్రయత్నిస్తాను. అయితే, బుమ్రా వంటి దిగ్గజ బౌలర్‌ ఎదురుగా ఉండటం వల్ల కాస్త గాబరాగానే అనిపించింది.

అయితే, నా అలవాటుకు తగ్గట్లే బంతిపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టడం వల్ల అనుకున్న ఫలితం రాబట్టగలిగాను’’ అని వైభవ్‌ సూర్యవంశీ తెలిపాడు. కాగా ముంబైతో మ్యాచ్‌లో వైభవ్‌ 14 బంతుల్లో ఒక ఫోర్‌, ఐదు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇవ్వడంతో పెవిలియన్‌ చేరాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ ముంబైపై 27 పరుగుల తేడాతో గెలిచింది.

చదవండి: ఢిల్లీ కొంపముంచిన మిల్లర్‌.. అక్షర్‌ పటేల్‌ రియాక్షన్‌ ఇదే!

Advertisement
 
Advertisement
Advertisement