వైభవ్‌ను అభినందిస్తున్న హార్దిక్ (PC: IPL/BCCI)
ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ జోరు కొనసాగుతోంది. తొలుత చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 18 బంతుల్లో 31 పరుగులతో మెరిశాడు.
విధ్వంసకర బ్యాటింగ్
తాజాగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. ఇందులో ఓ ఫోర్, ఐదు సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్.. ముంబై స్టార్, టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదడం హైలైట్‌గా నిలిచింది.
The sheer audacity of Vaibhav Sooryavanshi 🫡
🎥 The 1️⃣5️⃣ year old welcomes Jasprit Bumrah with a maximum! 👏#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/cI0zqCXz0X— IndianPremierLeague (@IPL) April 7, 2026
ప్రపంచస్థాయి బౌలర్ అయిన బుమ్రాను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడోనని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూడగా.. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తనదైన శైలిలో దుమ్మురేపాడు. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ముంబైపై గెలిచి హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది.
ఈ గుండె గట్టిదిరా బుడ్డోడా
ఈ క్రమంలో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో ముంబై కెప్టెన్, టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా వైభవ్‌ను ప్రత్యేకంగా అభినందించాడు. అతడి భుజం తడుతూ.. గుండెపై చేయి వేసి.. ‘ఈ గుండె గట్టిదిరా బుడ్డోడా’ అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A hat-trick of wins and yet to be beaten! 🩷#RR light up Guwahati with a phenomenal 2️⃣7️⃣ run win over #MI to take the top spot on the points table 👏
Scorecard ▶️ https://t.co/BCCaxRwjYg#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/lLoKuuOZV4— IndianPremierLeague (@IPL) April 7, 2026
ఏ బౌలర్ బౌలింగ్‌లోనైనా
ఇక మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. ‘‘పదహారు, పదిహేడేళ్ల పిల్లాడు ఇలా ఆడుతూ ఉంటే చూడటానికి ఎంతో బాగుంది. రాజస్తాన్‌తో మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో మేము వైభవ్ గురించి చాలా సేపు చర్చించాము.
అతడు అత్యద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి అసలు భయమే లేదు. అందుకే ఏ బౌలర్ బౌలింగ్‌లోనైనా అలాంటి షాట్లు ఆడగలుగుతున్నాడు. అతడి భవిష్యత్తు బంగారం కావాలని నేను కోరుకుంటున్నాను’’ అని హార్దిక్ పాండ్యా వైభవ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
చదవండి: Yashasvi Jaiswal: ‘టార్గెట్ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’
𝙂𝙖𝙢𝙚 𝙧𝙚𝙘𝙤𝙜𝙣𝙞𝙨𝙚𝙨 𝙜𝙖𝙢𝙚! 🤝
🎥 #MI captain Hardik Pandya with some very kind words for the young Vaibhav Sooryavanshi 🩷#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/t5Wg9LCtoV— IndianPremierLeague (@IPL) April 7, 2026


