సీఎంఏ ఫలితాల్లో మాస్టర్‌మైండ్స్ హవా!
హైదరాబాద్: సీఎంఏ-2015 ఇంటర్, ఫైనల్ పరీక్ష ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని ఆ విద్యాసంస్థల డెరైక్టర్ మట్టుపల్లి మోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీడబ్ల్యూఏ) విడుదల చేసిన సీఎంఏ ఇంటర్(2012 సిలబస్) ఫలితాలలో తమ విద్యార్థులు 31 ఆలిండియా ర్యాంకులు, సీఎంఏ ఫైనల్ (2012 సిలబస్) ఫలితాలలో 5 ఆలిండియా ర్యాంకులు సాధించారని అన్నారు. అలాగే 2008 సిలబస్‌తో సీఎంఏ ఇంటర్ ఫలితాలలో ఆలిండియాలో 14 ర్యాంకులు, 2008 సిలబస్‌తో సీఎంఏ ఫైనల్ ఫలితాలలో 1 ఆలిండియా ర్యాంకు పొందారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, అధ్యాపకులను డెరైక్టర్ అభినందించారు.