breaking news
materiology
-
రెండ్రోజుల్లో కోస్తాంధ్రలో చిరుజల్లులు
హైదరాబాద్: మరో రెండు, మూడు రోజుల్లో కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కదలనుందని తెలిపింది. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతం, తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఈనెల (మే) 30 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ విభాగం వెల్లడించింది. -
పెరగనున్న ఉష్ణోగ్రతలు
రెండ్రోజుల్లో వడగాలులు విశాఖపట్నం : రెండు రోజుల్లో ఉష్ణోగ్రత లు పెరగనున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వడగాలులు వీయనున్నాయి. కొద్దిరోజుల నుంచి అల్పపీడన, ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి తీవ్రత అంతగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు ఊపందుకుంటాయని భారత వాతావరణ విభాగం (ఐఎండి) సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. దీంతో రెండు రాష్ట్రాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. కోస్తాంధ్ర నుంచి మధ్య బంగాళాఖాతం వర కూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులుగాని, తేలికపాటి వర్షం గాని కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల క్యుములోనింబస్ మేఘాలు కూడా ఏర్పడి అకాల వర్షాలకు కూడా ఆస్కారం ఉం దని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.