breaking news
Masayoshi Son
-
రాబోయే భవిష్యత్తు భారతదేశానిదే!
సన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(ఐఎఫ్ఎస్సిఎ) & బ్లూమ్ బెర్గ్ కలిసి నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరంలో ప్రముఖ జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ చీఫ్ మసయొషి మాట్లాడుతూ.. భారత ఆర్థిక భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు మెరుగైన భవిష్యత్తు ఉందని, ఇక్కడి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బాగా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ ఇప్పటివరకు భారతదేశంలో 14 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది అని అన్నారు. సాఫ్ట్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారు అని, ఈ గ్రూప్ భారతదేశంలోని యూనికార్న్‌లకు కనీసం 10శాతం నిధులను సమకూర్చినట్లు తెలిపారు. సాఫ్ట్ బ్యాంక్ పోర్ట్ ఫోలియో గల సంస్థలు భారతదేశంలో ఒక మిలియన్ కొత్త ఉద్యోగాలను సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. "నేను రాబోయే భవిష్యత్తు భారతదేశానిదే అని నమ్ముతున్నాను. భారతదేశంలోని యువ వ్యవస్థాపకుల అభిరుచిని నేను విశ్వసిస్తాను. భారతదేశం గొప్ప ఉజ్వల భవిష్యత్తు ఉంది. భారత్‌లో ఉన్న యువ ఆవిష్కర్తలంతా ముందుకు రావాలని కోరుకుంటున్నాను, అందుకు తమ మద్దతు ఉంటుంది" అని ఆయన అన్నారు. ఈ ఏడాది భారతీయ స్టార్ట్-అప్ కంపెనీలలో 3 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. గత నెలలో సాఫ్ట్ బ్యాంక్ ఇన్వెస్ట్ మెంట్ ఎడ్వైజర్స్ సీఈఓ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ.. సరైన వాల్యుయేషన్ వద్ద సరైన అవకాశాలు వస్తే వచ్చే ఏడాది భారతదేశంలో 10 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీ సిద్ధంగా ఉందని తెలిపారు. పేటీఎం, ఓలా, డెలివరీ, ఫ్లిప్‌కార్ట్, మీషో సహా పలు ప్రముఖ కంపెనీల్లో సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు పెట్టింది. (చదవండి: దేశంలో భారీగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈ కంపెనీవే!) -
వెయ్యి కోట్ల డాలర్ల పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుతాం
సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ ధీమా న్యూఢిల్లీ: భారత్‌లో 1,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్న లక్ష్యాన్ని చేరుకోగలమని జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ధీమా వ్యక్తం చేసింది. భారత్‌లో అత్యుత్తమ, అపార అవకాశాలున్నాయని సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్, సీఈఓ మసయోషి సన్ పేర్కొన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ఉందని, జనాభా అధికంగా ఉందని, కొత్త టెక్నాలజీలను వేగంగా అందుకోగలదని, చాలా మంది ఇంగ్లిష్ మాట్లాడగలరని పేర్కొన్నారు. ఇలాంటి దేశంలో పెట్టుబడులు పెట్టడానికే ఆసక్తి చూపుతానని వివరించారు. ఇక్కడ జరిగిన హెచ్‌టీ లీడర్షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రెండేళ్లలో 200 కోట్ల డాలర్లు భారత్‌లో పదేళ్లలో వెరుు్య కోట్ల డాలర్లు పెట్టాలని 2014లో ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రెండేళ్లలో 200 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టామని మసయోషి చెప్పారు. ఇంకా ఎనిమిదేళ్లు ఉన్నాయని, లక్ష్యాన్ని అవలీలగా సాధిస్తామని వివరించారు. భారత్‌లో ఇంటర్నెట్ సంబంధిత సంస్థల్లో పెట్టుబడులు పెట్టామని, వీటిని ఇంకా విస్తరిస్తామని పేర్కొన్నారు. సౌర విద్యుదుత్పత్తి రంగంలో కూడా పెట్టుబడులు పెడతామని వివరించారు. ఈ సంస్థ ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ స్నాప్‌డీల్, ఓలా క్యాబ్స్, ప్రోపర్టీ సైట్ హౌసింగ్‌డాట్‌కామ్, భారత మొబైల్ ఆడ్వర్టైజింగ్ నెట్వర్క్ ఇన్మోబి, హైక్ మెసేంజర్ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. భారతీ గ్రూప్‌తో కలిసి భారతీ సాఫ్ట్‌బ్యాంక్ జారుుంట్వెంచర్ను ఏర్పాటు చేసింది. 21 వ శతాబ్దం భారత్‌దేనని మసయోషి సన్ ఈ ఏడాది జనవరిలో పేర్కొన్నారు. భారత్‌లో అపార అవకాశాలున్నాయని, కానీ ప్రభుత్వం మొబైల్ ఫోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయాలని, ఇంటర్నెట్ వేగంగా లేదని, ఈ సమస్యలను పరిష్కరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.