వెయ్యి కోట్ల డాలర్ల పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుతాం | SoftBank CEO Masayoshi Son says $100 billion tech fund | Sakshi
Sakshi News home page

వెయ్యి కోట్ల డాలర్ల పెట్టుబడుల లక్ష్యాన్ని చేరుతాం

Dec 3 2016 1:03 AM | Updated on Sep 4 2017 9:44 PM

ప్రధాని మోదీతో సమావేశంలో సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్, సీఈఓ మసయోషి సన్

ప్రధాని మోదీతో సమావేశంలో సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్, సీఈఓ మసయోషి సన్

భారత్‌లో 1,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్న లక్ష్యాన్ని చేరుకోగలమని జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ధీమా వ్యక్తం చేసింది.

సాఫ్ట్ బ్యాంక్ చైర్మన్ మసయోషి సన్ ధీమా

న్యూఢిల్లీ: భారత్‌లో 1,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్న లక్ష్యాన్ని చేరుకోగలమని జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ధీమా వ్యక్తం చేసింది. భారత్‌లో అత్యుత్తమ, అపార అవకాశాలున్నాయని సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్, సీఈఓ మసయోషి సన్ పేర్కొన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ఉందని,  జనాభా అధికంగా ఉందని, కొత్త టెక్నాలజీలను వేగంగా అందుకోగలదని, చాలా మంది ఇంగ్లిష్ మాట్లాడగలరని పేర్కొన్నారు. ఇలాంటి దేశంలో పెట్టుబడులు పెట్టడానికే ఆసక్తి చూపుతానని  వివరించారు. ఇక్కడ జరిగిన హెచ్‌టీ లీడర్షిప్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు.  గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

 రెండేళ్లలో 200 కోట్ల డాలర్లు
భారత్‌లో  పదేళ్లలో వెరుు్య కోట్ల డాలర్లు పెట్టాలని 2014లో ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రెండేళ్లలో   200 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టామని మసయోషి చెప్పారు. ఇంకా ఎనిమిదేళ్లు ఉన్నాయని, లక్ష్యాన్ని అవలీలగా సాధిస్తామని వివరించారు. భారత్‌లో ఇంటర్నెట్ సంబంధిత సంస్థల్లో పెట్టుబడులు పెట్టామని, వీటిని ఇంకా విస్తరిస్తామని పేర్కొన్నారు. సౌర విద్యుదుత్పత్తి రంగంలో కూడా పెట్టుబడులు పెడతామని వివరించారు.

ఈ సంస్థ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ స్నాప్‌డీల్, ఓలా క్యాబ్స్, ప్రోపర్టీ సైట్ హౌసింగ్‌డాట్‌కామ్, భారత మొబైల్ ఆడ్వర్టైజింగ్ నెట్‌వర్క్ ఇన్‌మోబి, హైక్ మెసేంజర్ తదితర సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. భారతీ గ్రూప్‌తో కలిసి భారతీ సాఫ్ట్‌బ్యాంక్ జారుుంట్‌వెంచర్‌ను ఏర్పాటు చేసింది.

21 వ శతాబ్దం భారత్‌దేనని మసయోషి సన్ ఈ ఏడాది జనవరిలో పేర్కొన్నారు. భారత్‌లో అపార అవకాశాలున్నాయని, కానీ ప్రభుత్వం మొబైల్ ఫోన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయాలని, ఇంటర్నెట్ వేగంగా లేదని, ఈ సమస్యలను పరిష్కరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement