breaking news
many trapped
-
థానేలో భవనం కూలి ఆరుగురు మృతి
-
థానేలో భవనం కూలి 11మంది మృతి
థానే: మహారాష్ట్రలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 11మంది మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. థానే జిల్లాలోని బీ క్యాబిన్ ప్రాంతంలోని నౌపాడలో మూడు అంతస్తుల భవనం మంగళవారం తెల్లవారుజామున 2.45 సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిధిలాల్లో చిక్కుకున్న 15మందిని ఇప్పటివరకు రక్షించినట్టు తెలిసింది. గత మంళవారం థానే జిల్లాలోని థాకూర్లిలో 'మాతృఛాయ' పేరుతో గల రెండు అంతస్తుల భవనం కూలిన సంఘటనలో ఆరుగురు మృతిచెందిని విషయం తెలిసిందే. శిథిలావస్థకు చేరుకున్న భవనాలు, ఇటీవల కురిసిన భారీవర్షాల ప్రభావం వల్లే కూలిపోయాయని నిపుణులు చెబుతున్నారు.