మహారాష్ట్రలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. థానే జిల్లాలోని బీ క్యాబిన్ ప్రాంతంలోని నౌపాడలో మూడు అంతస్తుల భవనం మంగళవారం తెల్లవారుజామున 2.45 సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.