కళాశాల భవనంపై నుంచి పడిన విద్యార్థి
హైదరాబాద్: ఓ విద్యార్థి కళాశాల భవనంపైనుంచి పడి తీవ్రంగా గాయపడగా.. విషయం తెలిసిన అతని తల్లి కోమాలోకి వెళ్లింది. ఈ ఘటన సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక చెరుకుతోట కాలనీలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థి మనోహర్కుమార్(17) శుక్రవారం మధ్యాహ్నం కళాశాల భవనం పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే కొత్తపల్లిలోని ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అతడి తల్లి కోమాలోకి వెళ్లింది. ఆమెను కూడా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.