breaking news
Mamata Hospital
-
మమత ఆస్పత్రిలో న్యూఇయర్ వేడుకలు
ఖమ్మం అర్బన్: మమత ఆస్పత్రిలో సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు. మమత విద్యాసంస్థల ఫౌండర్ పువ్వాడ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్పత్రిలో అనేకమందికి ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. సేవల్లో మరింత వేగం పెంచి వైద్యశాల పురోగాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మమత విద్యాసంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ, డైరెక్టర్ కాటా సత్యనారాయణ బాబ్జీ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మౌలీసా, డిప్యూటీ సూపరింటెండెంట్ భాగం కిషన్‌రావు, మెడికల్ డైరెక్టరు కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, రత్నకుమారి ఫీలిపి, డీన్ లాహేట్ నందకిషోర్, ఏఓ టీవి బాబు, సిబ్బంది యుగంధర్, పెద్దిన్ని నాగేశ్వరరావు, ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
లాకప్‌లో పుంజు!
ఖమ్మం అర్బన్ : ఓ పందెంకోడి కటకటాల పాలైంది! పందెంరాయుళ్లు పారిపోవడంతో అక్కడ దొరికిన ఓ పందెం కోడిని పోలీసులు సెల్ లో వేశారు. ఖమ్మం నగరంలోని మమత వైద్యశాల రోడ్డులో ఆదివా రం కోడిపందేలు జరుగుతుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఓ కోడిపుంజును వదిలి పందెంరాయుళ్లు పరారయ్యూరు. దీంతో పోలీసులు కోడిని తీసుకొచ్చి సెల్లో పెట్టారు. విషయం మీడియూకు తెలియడం తో దానిని బయట కట్టి వేశారు.