-
మల్చింగ్.. ఇక సులభం!
ఎత్తు మడులపై మల్చింగ్ షీట్ పరిచి ఉద్యాన పంటలు పండించడానికి సాధారణంగా ట్రాక్టర్‌కు అనుసంధానం చేసే పరికరాన్ని ఉపయోగిస్తుంటారు. ఎకరానికి 6 నుంచి 8 మంది కూలీల అవసరం ఉంటుంది. ఒక రోజు నుంచి రోజున్నర సమయం పడుతుంది. అయితే, సులువుగా, తక్కువ ఖర్చుతో మల్చింగ్ షీట్‌ను పరిచే పరికరాన్ని మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన యువకుడు రూపొందించారు. కేవలం ఇద్దరు మనుషులతో, 8 గంటల్లోనే ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి ఉపయోగపడే మల్చింగ్ పరికరాన్ని యువ ఉపాధ్యాయుడు, రైతు నితిన్ ఘలే పాటిల్ రూపొందించారు. నాసిక్‌లోని శివాజీ నగర్లో గల అభినవ్ బాల్‌వికాస్ మందిర్ పాఠశాలలో నితిన్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే వ్యవసాయాన్ని మక్కువతో చేస్తుంటారు. గత ఏడాది మే నెలలో తన 7 ఎకరాల భూమిలో టమాటో, మిరప, బంతిపూలను సాగు చేయటం కోసం ఎత్తుమడులపై మల్చింగ్ షీట్ పరవాలని అనుకున్నాడు. అయితే, కూలీల కొరత వల్ల సాధ్యంకాలేదు. ఆ క్రమంలో మల్చింగ్ షీట్ పరిచే ప్రక్రియను సులభతరం చేసే పరికరాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న పాత ఇనుము వస్తువులను ఉపయోగించి, సొంత ఆలోచన ప్రకారం వెల్డింగ్ చేయించి ఒక పరికరాన్ని రూపొందించాడు. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసి దీన్ని ఉపయోగించే ప్రయత్నం చేశాడు. మల్చింగ్ షీట్ చిరిగిపోతుండటంతో.. ట్రాక్టర్ లేకుండా మనుషులు ఈడ్చుకుంటూ వెళ్తూ మల్చింగ్ షీట్ పరిచేలా మార్పులు చేశాడు. పరికరం అడుగున చక్రాలను అమర్చటంతోపాటు.. పరిచిన షీట్‌పై మట్టి ఎగదోయడానికి వీలుగా రెండు ఇనుప బ్లేడ్లను అమర్చడంతో ఈ పరికరం సిద్ధమైంది. 15 రోజులు కష్టపడి అనేక విధాలుగా మార్పులు చేస్తూ చివరికి విజయం సాధించారు. తన పొలంలో ఉపయోగించడంతోపాటు మరో ఇద్దరు రైతులకు కూడా ఈ పరికరాన్ని ఇచ్చి పరీక్షించానన్నారు నితిన్. ‘మా ప్రాంతంలో ఎకరంలో మల్చింగ్ షీట్ పరచడానికి 12 మంది కూలీలు అవసరం. వారి కూలి, తిండితో కలిపి రూ. 8 వేల వరకు రైతుకు ఖర్చవుతుంది. నేను ఈ పరికరాన్ని రూ. 10 వేలకే తయారుచేసి ఇస్తున్నాను. ఒక్కసారి కొనుక్కుంటే చాలు. ఇద్దరు మనుషులతో దీనితో మల్చింగ్ షీట్ పరచవచ్చు. ఎకరాన్ని 8 గంటల్లోనే పూర్తి చేయవచ్చు. చిన్న రైతులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతోంది. కూలీలతో కూడా పనిలేకుండా రైతు కుటుంబ సభ్యులే దీన్ని ఉపయోగించవచ్చు. సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని కొద్ది రోజుల్లోనే వంద మంది రైతులు ఇది కావాలన్నారు..’ అని నితిన్ (98909 82432) సంతోషంగా చెప్పారు. తన టొమాటో తోటలో నితిన్ పాటిల్ -
మల్చింగ్‌తో మేలెంతో..
బీర్కూర్ : వ్యవసాయంలో మెలకువలు తెలుసుకుంటూ, వాటిని క్షేత్రంలో అమలు చేస్తూ పురోగమిస్తున్నారు పలువురు రైతులు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు అవలంబిస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అధిక దిగుబడులూ సాధిస్తున్నారు. బిందు సేద్యం, మల్చింగ్ విధానంలో పంటలు పండిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మలచుకుంటున్నారు రైతునగర్‌కు చెందిన మద్దుకూరి గౌతమ్ కుమార్ అనే రైతు. ఆయన సాగు పద్ధతుల గురించి తెలుసుకుందామా మరి.. ‘‘పదేళ్ల క్రితం బిందు సేద్యం గురించి తెలుసుకున్నాను. అప్పట్లో ప్రభుత్వం 60 శాతం రాయితీపై పరికరాలను సరఫరా చేసింది. మూడెకరాల్లో పరికరాల ఏర్పాటుకు సుమారు రూ. 50 వేల వరకు ఖర్చయ్యాయి. గతేడాది రెండెకరాల్లో బిందు సేద్యం పరికరాలను(90 శాతం రాయితీ) ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కువగా క్యాబేజీ, కాలీఫ్లవర్, మిర్చి, టమాట, మొక్కజొన్న సాగు చేస్తున్నాను. బోధన్, వర్ని, బాన్సువాడ అంగడులలో విక్రయిస్తున్నాను. ఇటీవలి కాలంలో మల్చింగ్ విధానం గురించి తెలిసింది. ఆ పద్ధతిని కూడా అవలంబిస్తున్నాను. ఈసారి మూడెకరాల్లో టమాట, రెండెకరాల్లో మొక్కజొన్న వేశాను. బిందు సేద్యం, మల్చింగ్ విధానంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చు. ఈ విధానాలు అవలంబిస్తూ ఎకరానికి సరిపోయే నీటితోనే ఐదెకరాల్లో పంటలు సాగు చేస్తున్నాను’’ అని గౌతమ్ కుమార్ వివరించారు. ఈ విధానాల్లో పంటల సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గాయని, రాబడి కూడా పెరిగిందని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేంద్ర బలగాల అండ..
ఆడపడుచులకు అండగా ఉంటాం..
కాంగ్రెస్‌లోకి మధిర మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు
ఖమ్మం బస్టాండ్‌లో వడదెబ్బతో సొమ్మసిల్లిన మహిళ
తెలుగు అధ్యాపకుడికి డాక్టరేట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement