breaking news
Majumdar
-
ఆరోజు ఆ అర్ధరాత్రి ఏం జరిగిందో తెలుసా?!
హేమాంగిని దత్ మజుందార్ పుస్తకాలలో స్త్రీ పాత్రలు బలంగా ఉంటాయి. పిల్లలు ఎంతో ఆసక్తిగా చదివేలా చేస్తాయి. ఆమె తాజా పుస్తకం స్క్రాచ్ అండ్ స్నిఫ్ క్రానికల్స్... బెంగాలీ అయిన హేమాంగిని మజుందార్ కోల్‌కతాతో పాటు ముంబై, న్యూయార్క్, ఆస్టిన్, బహ్రెయిన్లలో నివసించింది. ప్రస్తుతం సింగపూర్‌లో ఉంటుంది. బెంగాలీ వంటకాలతో పాటు ఎన్నో వంటకాలపై ఆమెకు అవగాహన ఉంది.‘నాకు ఒక ప్రదేశంలో ఆహారం సౌకర్యవంతంగా ఉంటే, ఆ ప్రదేశంలో నేను నిజంగా స్థిరపడ్డానని అనుకుంటాను. బెంగాలీ సంచారిగా ఆహారం అనేది నా మూలాలను, ఇంటిని గుర్తు తెస్తుంది. నేను ఏదైనా నగరాన్ని విడిచి వెళుతున్నప్పుడు ఇంట్లో కొంత భాగాన్ని వదిలి వెళుతున్నట్లు అనిపిస్తుంది’ అంటుంది మజుందార్. ఆహారం అనేది ఆమె రచనాప్రక్రియలో భాగం అయింది. ఆహారపదార్థాలతో భావోద్వేగ బంధం ఆమెను పుస్తక రచనకు పురికొల్పింది. హేమాంగిని పుస్తకం చదివిన వాళ్లు... ‘పుస్తకం చదివినట్లుగా లేదు. విందు ఆరగించినట్లుగా ఉంది’ అంటారు చమత్కారంగా. వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లి ఆ కాలాన్ని తన రచనల్లోకి తీసుకురావడం అంటే మజుందార్‌కు ఇష్టం. ‘ది స్క్రాచ్ అండ్ స్నిఫ్ క్రానికల్స్’ అలాంటి రచనే. చారిత్రాత్మక పట్టణం నేపథ్యంగా సాగే నవల. చందానగర్ అనేది ఒకప్పుడు కోల్‌కతా వెలుపల ఫ్రెంచ్ కాలనీగా ఉండేది. వోలీ ఛటర్జీ అనే మహిళ చందానగర్‌లో తన పూర్వీకులకు చెందిన ఎస్టేట్‌లో నివసించడానికి వెళుతుంది. అక్కడ ఒక అర్ధరాత్రి ఆమెకు వింత అనుభవాలు ఎదురవుతాయి.వోలి తనకు ఉన్న ప్రత్యేక శక్తులతో ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. ‘మహిళలు ఎదుర్కొంటున్న అదృశ్య యుద్ధాలు’ అంశంపై ‘ది స్క్రాచ్ అండ్ స్నిఫ్ క్రానికల్స్’ రాసింది హేమాంగిని మజుందార్. -
అమోల్ శిక్షణ అమూల్యం
సాక్షి క్రీడా విభాగం : అమోల్ మజుందార్‌కు క్రికెట్ మైదానంలో ఆటగాడిగా ఘనమైన రికార్డులు ఉన్నాయి... దేశవాళీ క్రికెట్లో ముంబై, అస్సాం, ఆంధ్ర జట్లకు ఆడి టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు... కానీ అందరూ కలలుగనే అంతర్జాతీయ క్రికెటర్ స్థాయి మాత్రం అతనికి దక్కలేదు. వేర్వేరు కారణాలతో ఒక్కసారి కూడా భారత జట్టు తరఫున ఆడే అవకాశం రాలేదు. కెరీర్లో చెలరేగుతున్న అతని అత్యుత్తమ దశలో భారత జట్టు దిగ్గజాలతో నిండిపోవడంతో పాటు కాసింత కలిసి రావాల్సిన చోట అదృష్టం మొహం చాటేసింది. అయితే ఆటగాడిగా ప్రస్థానాన్ని ముగించి తన అనుభవాన్ని మరో రూపంలో ప్రదర్శించుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో కోచ్‌గా మారిన మజుందార్ దశాబ్ద కాలం తర్వాత తన కెరీర్లో అత్యుత్తమ క్షణాలను అనుభవిస్తున్నాడు. భారత మహిళల క్రికెట్ జట్టును తొలిసారి విశ్వవిజేతగా నిలిపిన శిక్షకుడిగా అతను తన పేరును లిఖించుకున్నాడు. గత రెండేళ్ల ఈ ప్రయాణంలో అతను ఎన్నో ప్రతికూలతలను దాటి టీమ్‌ను శిఖరానికి చేర్చాడు. వచ్చే మంగళవారం తన 51వ పుట్టిన రోజును జరుపుకోనున్న అమోల్ ఇప్పుడు మహిళల క్రికెట్ జట్టు కొత్త ప్రస్థానానికి దిక్సూచిలా నిలిచాడు. మారిన ఆటశైలి... ‘మా లక్ష్యాలు ఏమిటో స్పష్టంగా నిర్దేశించుకున్నాం. మన ప్లేయర్లు ఆటలో దూకుడు పెంచాల్సి ఉంది. నిర్భీతిగా ఆడే ఆటను నేను ఎప్పుడైనా ప్రోత్సహిస్తాను. అదే మన శైలి కావాలి. ఫీల్డింగ్, ఫిట్‌నెస్‌కు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఈ విషయంలో ఎలాంటి సడలింపులు ఉండవు. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ప్రమాణాలను పాటిస్తూ ఏడాదిలో మూడుసార్లు ఫిట్నెస్ పరీక్షలు జరుగుతాయి. మ్యాచ్‌లు లేని సమయంలో నిరంతరాయంగా ప్రత్యేక క్యాంప్‌లతో సాధన కొనసాగుతుంది. కొత్తగా జట్టులోకి వచ్చేవారందరికీ మంచి అవకాశాలు కల్పిస్తాం’... భారత మహిళల జట్టు కోచ్‌గా ఎంపికైన తర్వాత అమోల్ మజుందార్ తన మొదటి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అంటూ పాత గణాంకాలను తాను పట్టించుకోనని, కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నట్లుగా భావిస్తానని కూడా మజుందార్ చెప్పాడు. వరల్డ్ కప్‌లో భారత ప్లేయర్ల ప్రదర్శనను చూస్తే తాను చెప్పిన ప్రతీ అంశంపై అతను పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడని అర్థమవుతుంది. మన ప్లేయర్ల ఫిట్నెస్ గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఉందనేది చూడగానే అర్థమవుతోంది. అన్నింటికి మించి బ్యాటింగ్‌లో దూకుడు పెరిగింది. భారీ స్కోర్లు నమోదు చేయడమే కాదు, ఛేదనలో కూడా మన టీమ్ ఎంత బాగా ఆడగలదో పలుమార్లు రుజువైంది. తమ శ్రమ వెనక కోచ్ ఉన్నాడని ప్లేయర్లు పదే పదే చెప్పడం విశేషం. ఓటమి తర్వాత ప్రణాళికలతో... అయితే కోచ్‌గా మజుందార్ బాధ్యతలు స్వీకరించగానే ఒక్కసారిగా ఫలితాలు రాలేదు. మజుందార్ కోచ్‌గా వచ్చి న తర్వాత మొదటి సవాల్ టి20 వరల్డ్ కప్ రూపంలో వచ్చి ంది. ఇందులో మన జట్టు కనీసం సెమీఫైనల్‌కు కూడా అర్హత సాధించలేదు. జట్టులో దూకుడు రాకపోగా కీలక క్షణాల్లో పాత తడబాటు పోలేదని కోచ్‌కు అర్థమైంది. అయితే అతను ఒక్కసారిగా టీమ్‌లో భారీ మార్పులు కోరుకొని గందరగోళంగా మార్చలేదు. ముందుగా 25 మందితో తన కోర్ టీమ్‌ను ఎంచుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‌కు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో పక్కాగా ప్రణాళికలు రూపొందించాడు. నాటి టీమ్ లో ఉన్నవారిలో 9 మంది ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో కూడా ఉన్నారు. గాయాలతో మిగతా ఆటగాళ్లు దూరమయ్యారు తప్ప.. లేదంటే అమోల్ ప్రణాళికల్లో అందరికీ వరల్డ్ కప్ బాధ్యతలు ప్రత్యేకంగా ఉన్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడేలా బోర్డును ఒప్పించడంతో పాటు మిగతా సమయమంతా ప్లేయర్లు జాతీయ క్రికెట్ అకాడమీలోనే రాటుదేలారు. దాని ఫలితం ఇప్పుడు కనిపించింది. జాగ్రత్తగా నడిపిస్తూనే... ‘జెమీమాను తుది జట్టు నుంచి తప్పించడం మేం తీసుకున్న కఠిన నిర్ణయం. జట్టు సమతూకం కోసం అలా చేయక తప్పలేదు’... ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ తో మ్యాచ్‌కు జెమీమాను దూరం పెట్టిన తర్వాత జట్టు కోచ్ మజుందార్ ఇచ్చి న వివరణ ఇది. ఆ సమయంలో అతను చాలా ఇబ్బంది పడినట్లు, అబద్ధం చెబుతున్నట్లు అతని మాటల్లోనే కనిపించింది. నిజానికి జెమీమా తొలి 4 మ్యాచ్‌లలో 2 డకౌట్లు సహా 65 పరుగులే చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆమెకు ఒక హెచ్చరికలా ఇది సహేతుక నిర్ణయమే. కానీ దానికీ అతను జాగ్రత్తగా వివరణ ఇవ్వాల్సి వచ్చి ంది. ఒక మహిళల టీమ్‌ను పురుష కోచ్ నడిపించడంలో ఉండే ప్రతికూలతల్లో ఇది కూడా ఒకటని విశ్లేషకుల అభిప్రాయం. వారినుంచి అత్యుత్తమ ఆటతీరును రాబట్టడంతో పాటు ప్రోత్సహిస్తూ, ఎక్కడా మానసికంగా కుంగిపోకుండా జట్టును నడిపించడం కూడా కోచ్ బాధ్యతే అవుతుంది. ఈ విషయం మజుందార్‌కు బాగా తెలుసు. తుది జట్టులో స్థానం విషయంలో తనకంటే ముందు భారత మహిళల జట్టుకు కోచ్‌గా ఉన్న తన మాజీ సహచరుడు, మరో ముంబైకర్ రమేశ్ పొవార్, సీనియర్ మిథాలీ రాజ్ మధ్య ఎంత పెద్ద వివాదం రేగిందో ప్రపంచం చూసింది. ఇలాంటి అంశాలను జాగ్రత్తగా చూసుకుంటూనే మజుందార్ తన బాధ్యతను నెరవేర్చాడు. సాధారణంగా ఆటగాడిగా సాధించని ఘనతలు కోచ్‌గా అందుకోవాలని చాలా మంది కోరుకుంటారు. తమ పట్టుదలతో వాటిని నిజం చేసుకొనే కొద్ది మంది జాబితాలో ఇప్పుడు అమోల్ చేరాడు. -
హ్యాట్సాఫ్ మజుందార్
దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఆటలో రికార్డు స్థాయిలో పరుగులు సాధించిన తర్వాత కూడా దేశానికి ప్రాతినిధ్యం వహించని దురదృష్టవంతుల్లో అమోల్ మజుందార్ పేరు ఉంటుంది. ముంబైకి చెందిన 51 ఏళ్ల మజుందార్ 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 30 సెంచరీలు సహా 11,167 పరుగులు సాధించాడు. అయితే ఏనాడూ భారత్‌కు ఆడే అవకాశం రాలేదు. ఈ దేశవాళీ దిగ్గజం కోచ్‌గా తన రెండో ఇన్నింగ్స్‌లో మర్చిపోలేని ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.రెండేళ్ల క్రితం మహిళల టీమ్‌కు కోచ్‌గా వచ్చిన తర్వాత ఆయన నేతృత్వంలో జట్టు ఎంతో రాటుదేలింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ బలంగా నిలబడిన మజుందార్ జట్టుకు మద్దతుగా నిలుస్తూ తన ప్లేయర్లపై నమ్మకం ఉంచాడు. ఆయన నమ్మిన ప్లేయర్లు ఇప్పుడు దానిని నిలబెట్టారు. చాంపియన్‌గా నిలిచి కోచ్‌కు కానుక అందించారు. ఫైనల్‌కు ముందు వేడుకలతో వేదికొక్కటే మెరిసింది. స్టేడియం వెలుగుజిలుగుల సవ్వడి చేసింది. పోరు మొదలయ్యాక భారత మహిళల హోరు కొనసాగింది. మ్యాచ్ గెలిచాక... ప్రపంచకప్ చేతికందాక... యావత్ భారతావని పండగ చేసుకుంది. నడిరాతిరంతా సంతోషాల జాతర చేసుకుంది. తెల్లవారేదాకా ఊరు వాడ తేడానే లేకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా గెలుపు మురిపెంగా... మూడు రంగుల పతాకాలు, జయజయధ్వానాలే వినిపించాయి. కనిపించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా అతిరథమహారథులంతా మహిళల విజయాన్ని వేనోళ్ల ప్రశంసలతో ముంచెత్తారు. హర్మన్ సేన పోరాటాన్ని ఆకాశానికెత్తారు. -
ఆంధ్రతో మ్యాచ్.. సెంచరీతో చెలరేగిన బెంగాల్ ఓపెనర్
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర జట్టుతో శుక్రవారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో మొదలైన రంజీ ట్రోఫీ ఎలైట్ డివిజన్ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో బెంగాల్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగాల్ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 289 పరుగులు సాధించింది. అనుస్తుప్ మజుందార్ (125; 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా... ఓపెనర్ సౌరవ్ పాల్ (96; 10 ఫోర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనుస్తుప్, సౌరవ్ మూడో వికెట్‌కు 189 పరుగులు జోడించడం విశేషం. ప్రస్తుతం కెప్టెన్ మనోజ్ తివారీ (15 బ్యాటింగ్), భారత జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ తమ్ముడు మొహమ్మద్ కైఫ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో లలిత్ మోహన్ రెండు వికెట్లు తీయగా... నితీశ్ కుమార్ రెడ్డి, షోయబ్ ఖాన్లకు ఒక్కో వికెట్ లభించింది. చదవండి: భారత మహిళల విజయగర్జన -
తడి ఆరని వర్ణాలు
ఎనభై ఏళ్ల క్రితం బెంగాల్‌లోని విక్టోరియన్ కాలపు నిర్జీవ చిత్ర సంప్రదాయాన్ని బ్రేక్ చేసి, చిత్రకళకు కొత్తపుంతలు అద్దిన ఓ చిత్రకారుడి వర్ణ ఖండాలను సింగపూర్లోనిఓ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శించడం అంటే.. ఆయనకే కాదు, భారతీయ కళా నైపుణ్యానికే అదొక పురస్కారం. హేమేంద్రనాథ్ మజుందార్ (1898–1948) బెంగాలీ చిత్రకారుడు. తాను మంచి మంచి బొమ్మలు వేయాలనుకుంటే తండ్రి మాత్రం అందుకు వ్యతిరేకించాడు. ఆయనను ఎదిరించి కలకత్తా ఆర్ట్ స్కూల్లో చేరిపోయారు. అక్కడ నుంచి జూబిలీ అకాడమీకి వెళ్లి మరింత నేర్చుకున్నారు. ఇంగ్లండు నుంచి చిత్రకళకు సంబంధించిన ఎన్నో పుస్తకాలు తెప్పించుకున్నారు. ఎంత నేర్చుకున్నా ఇంకా ఏదో వెలితి అనిపించేది. మనుషుల బొమ్మలను సహజంగా ఉండేలా చిత్రీకరించాలనే కోరిక బలంగా నాటుకుంది ఆయనలో. 1920లో అతుల్ బోస్ అనే సాటి కళాకారుడితో సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ కలకత్తా గవర్నమెంట్ ఆర్ట్ స్కూల్లో కలిశారు. చూసిన ప్రతి బొమ్మను, దృశ్యాన్ని... అన్నిటినీ కుంచెలో ముంచి చూపారు. బెంగాల్లో ప్రసిద్ధంగా ఉన్న విక్టోరియన్ ‘నిర్జీవ లేఖనాన్ని’ కూడా చిత్రీకరించారు. ఆ విధానాన్ని మార్చాలనే లక్ష్యంతో ఒక సొంత స్కూల్‌ని పెట్టారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్ అనే ఒక పత్రికనూ స్థాపించారు. దీని ద్వారా చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని భావించారు. విస్తృతమైన అంశాలను ఇందులో పాఠ్యాంశాలుగా పెట్టారు. కళలకు సంబంధించిన వార్తలు, గాసిప్స్, ట్రావెలాగ్, చిన్న కథలు, హాస్యం అన్నీ పరిచయం చేశారు. మజుందార్ వేసిన మొట్టమొదటి మేజర్ పెయింటింగ్.. పల్లి ప్రాణ్ (పల్లె ప్రాణం). ఆ వరుసలోనే వెట్ శారీ ఎఫెక్ట్.. అంటూ కొన్నిటిని చిత్రీకరించి, పబ్లిష్ చేశారు. ఆర్థిక కారణాల వల్ల వారి స్కూల్ కొన్నిరోజులకే మూత పడింది, ఆ తరువాత సొసైటీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని రెండో వెంచర్ ప్రారంభించారు. ఇంగ్లండ్‌లో కొంతకాలం ఉండి వచ్చారు. మజుందార్ మహిళల మీద వరుసగా రకరకాల అంశాలను చిత్రీకరించారు. మహిళల టాయిలెట్స్, పగటి కల కనడం.. ఇలాంటివి కూడా ఉండేవి. మరో చిత్రంలో అమ్మాయి వెనుకకు తిరిగి ఉన్న రూపాన్ని చూపారు. ఇందులో ఆమె యువతిగా ఉన్నప్పుడు ఆమె శరీరం ఎలా ఉన్నది, ఆమె కండరాలు, ఆమె ఎముకల నిర్మాణం కూడా చూపారు. ద వూండెడ్ వానిటీ, బ్లూ సారీ, హార్మొనీ, ఇమేజ్ అని ఆయన వేసిన పెయింటింగ్స్‌లో చాలావరకు అమ్మాయిలను దిగంబరంగానే చూపారు. వాటర్ కలర్స్ ఉపయోగించారు వాటికి. బోంబే ఆర్ట్ సొసైటీలో మజుందార్‌కి మూడు సంవత్సరాలు వరుసగా మూడు బహుమతులు వచ్చాయి. స్మృతి అనే పెయింటింగ్‌కి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఇలా మూడుసార్లు ఆయనకే రావడాన్ని కొందరు విమర్శకులు తప్పుపట్టారు. 1940లలో మజుందార్ అత్యధికంగా పేరు ప్రఖ్యాతులు గడించారు. జైపూర్, బికనీర్, కోటా, కశ్మీర్, మయూర్భంజ్, పటియాలా మహారాజులు తమ దగ్గర పనిచేయమని కోరుకున్నారు. పటియాలా మహారాజు భూపేంద్రనాథ్ సింగ్ ఆయనను తన ఆస్థాన చిత్రకారుడిగా ఐదు సంవత్సరాల పాటు నియమించుకున్నారు కూడా. సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ’æలో ఉన్న సాంటియో గ్యాలరీలో ఈ నెల 17 వరకు వారం పాటు ఆయన చిత్రాలను ప్రదర్శించారు. – జయంతి -
తేల్చుకోవాల్సింది మీరే..!
కోల్‌కత : వచ్చే ఎన్నికల్లో కారల్ మార్క్స్, మమతా బెనర్జీ, నరేంద్ర మోదీల్లో ఎవరి సిద్దాంతాలు కావాలో బెంగాల్ ప్రజలు తేల్చుకోవాలని పశ్చిమబెంగాల్ బీజేపీ వైస్-ప్రెసిడెంట్ జయప్రకాశ్ మజుందార్ అన్నారు. ఇండియా టుడే నిర్వహించిన కాన్క్లేవ్ ఈస్ట్ -2018 చర్చా కార్యక్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ విఫలమైందనిపై ఆయన విమర్శలు గుప్పించారు. మమత పాలనలో మత ఘర్షణలు తీవ్రమయ్యాయని ఆరోపించారు. మమతా..మోదీ సిద్ధాంతాలు..! ‘మార్క్స్ సిద్ధాతంతం ప్రకారం మతం అనేది ప్రజలకు మత్తులాంటిది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకారం మతం అనేది ఓటు బ్యాంకు మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకారం మతం అనేది సమజానికి వెన్నుముక, మతం అనేది ఒక పవిత్రమైన విధానం’అని ముజుందార్ వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం సీపీఎం కథ ముగిసిందని అన్నారు. బెంగాల్ భవిష్యత్తు బీజేపీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. మీరు ప్రభుత్వం నడపడం లేదా..! బెంగాల్లో అశాంతికి, మత ఘర్షణలకు మతతత్వ బీజేపీ కారణమని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కార్గా ఛటర్జీ ఆరోపించారు. రాష్ట్రేతర శక్తుల మూలంగానే బెంగాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తృణమూల్‌ను దెబ్బతీయడానికి బీజేపీ కుట్రలు పన్నుతోందని అన్నారు. ఛటర్జీ వ్యాఖ్యలను మజుందార్ ఖండించారు. బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్న టీఎంసీ బెంగాల్లో అధికారం లేదా అని ఎద్దేవా చేశారు. అసమర్థ పాలన సాగిస్తున్న మమత బెనర్జీ ప్రభుత్వ పాలనకు ప్రజలు చరమ గీతం పాడనున్నారని అన్నారు. కాగా, ఇటీవల బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
ముందస్తు నిర్బంధం
ఐకేపీ యానిమేటర్ల అరెస్టు సమస్యల పరిష్కారం కోరుతూ ఐకేపీ యానిమేటర్లు సోమవారం చేయతలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 120 మందికిపైగా యానిమేటర్లు, సీఐటీయూ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేశారు. ఒంగోలు సెంట్రల్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చేపట్టిన చలో హైదరాబాద్‌కు ఆదివారం జిల్లానుంచి వెళ్తున్న ఐకేపీ యానిమేటర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. జిల్లావ్యాప్తంగా వాహనాలు తనిఖీ చేసి యానిమేటర్లతో పాటు మద్దతుగా వెళ్తున్న సీఐటీయూ నేతలనూ అరెస్టు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 120 మందికిపైగా అరెస్టు చేసి నిర్బంధించారు. వంద రోజులుగా ఐకేపీ యానిమేటర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 22న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టారు. అయితే, జిల్లా నుంచి చలో హైదరాబాద్‌కు వెళ్తున్న వారిని రాష్ర్ట ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసరావును వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో ఉంచారు. మరో నాయకుడు చీకటి శ్రీనివాసరావును టూటౌన్లో ఉంచారు. అరెస్టులకు నిరసనగా నేడు ర్యాలీలు... చలో హైదరాబాద్‌కు వెళ్తున్న ఐకేపీ యానిమేటర్లను అడ్డుకుని అరెస్టు చేసినందుకు నిరసనగా సోమవారం జిల్లావ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మజుందార్ తెలిపారు. యానిమేటర్లంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షురాలు అరెస్టు, విడుదల... బేస్తవారిపేట : ఐకేపీ యానిమేటర్ల సంఘ జిల్లా అధ్యక్షురాలు డీ జరీనాను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులు.. జరీనా లేకపోవడంతో చిల్లర దుకాణంలో ఉన్న ఆమె భర్త ఫకీరయ్యను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కనీసం దుకాణం మూసేందుకు కూడా సమయం ఇవ్వకుండా లాక్కుని వచ్చారు. సమాచారం అందుకున్న జరీనా.. సీఐటీయూ నాయకులతో పోలీసుస్టేషన్‌కు చేరుకుని తన భర్త అరెస్టుపై ప్రశ్నించారు. తాను చలో హైదరాబాద్‌కు వెళ్లడం లేదని, ఆరోగ్యం బాగలేకపోవడంతో కంభం వైద్యశాలలో చికిత్స చేయించుకుంటున్నానని తెలిపారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకుని ఆమె భర్త ఫకీరయ్యను విడుదల చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో జరీనా, సీఐటీయూ నాయకులు మాట్లాడిన తర్వాత విడుదల చేశారు. అరెస్టు అప్రజాస్వామికం ఒంగోలు టౌన్ : ఐకేపీ యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో హైదరాబాద్‌కు సన్నద్ధమవుతున్న సీఐ టీయూ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జిల్లా అధ్యక్షుడు సీహెచ్ మజుందార్, నాయకుడు టీ మహేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, కార్యదర్శి జీ శ్రీనివాసరావు, నాయకులు సీహెచ్ గంగయ్య, డీఎంకే రఫీ, ఎన్.నాగేశ్వరరావులను పోలీసులు వారి ఇంటికి వెళ్లి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. అంతేగాకుండా సీఐటీయూ కార్యాలయంలో ముఠా కార్మికుల యూనియన్ సమావేశంలో ఉన్న నాయకులను కూడా అరెస్టు చేశారన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలను ప్రభుత్వం విడనాడకుంటే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.


