breaking news
Maja Chwalinska
-
ఆండ్రీవా అద్భుతం
పారిస్: రష్యా టీనేజ్ ప్లేయర్ మిరా ఆండ్రీవా అసాధారణ ఆటతో కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సొంతం చేసుకుంది. క్లే కోర్టుపై తన అద్భుత ప్రదర్శనతో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో వరల్డ్ నంబర్ 8 ఆండ్రీవా 6–3, 6–2 స్కోరుతో క్వాలిఫయర్ మాయ చావలిన్‌స్కా (పోలండ్)ను చిత్తు చేసింది. గంటా 22 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో 19 ఏళ్ల ఆండ్రీవా జోరు ముందు 114వ ర్యాంకర్ మాయ నిలవలేకపోయింది. కోర్టులో ప్రత్యర్థికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో పోలండ్ అభిమానులు అండగా నిలిచినా...ఒత్తిడిలో పడకుండా ఆండ్రీవా ఆట ముగించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో ప్రయత్నంలో చాంపియన్‌గా నిలిచిన ఆండ్రీవా 1992 (మోనికా సెలెస్ – 18 ఏళ్లు) తర్వాత ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయసు్కరాలిగా నిలిచింది. విజేతగా నిలిచిన ఆండ్రీవాకు ప్రైజ్‌మనీగా 28 లక్షల యూరోలు (సుమారు రూ. 31 కోట్లు)...రన్నరప్ చావలిన్స్కాకు 14 లక్షల యూరోలు (సుమారు రూ.15.30 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2023 మాడ్రిడ్ ఓపెన్‌లో సత్తా చాటి క్వార్టర్ ఫైనల్ వరకు దూసుకొచ్చినప్పుడే ఆండ్రీవా భవిష్యత్తులో పెద్ద స్థాయికి చేరుతుందని అంచనాలు మొదలయ్యాయి. రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ వరకు చేరడంతో క్లే కోర్టులో ఆండ్రీవా ఆట పదును ఏమిటో కనిపించింది. నాడు గెలుపు అవకాశం చేజార్చుకున్నా...ఇప్పుడు టీనేజర్‌గానే రోలండ్ గారోస్‌లో ఆమె విజయనాదం చేయడం విశేషం. రష్యాలోని సైబీరియా ప్రాంత నగరం క్రస్నోయార్క్లో పుట్టిన ఆండ్రీవా ఆరేళ్ల వయసులో టెన్నిస్ మొదలు పెట్టింది. ఆ తర్వాత సోచి నగరానికి వెళ్లి శిక్షణ పొందింది. అయితే అత్యుత్తమ సౌకర్యాలతో ఆటలో స్థాయిని పెంచుకునేందుకు ఆమె కుటుంబం ఫ్రాన్స్‌లోకి ‘కాన్స్’ సిటీకి వెళ్లి స్థిరపడింది. ఆమెకంటే రెండేళ్లు పెద్దదయిన ఎరికా ఆండ్రీవా కూడా ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయరే. సింగిల్స్‌లో 6 డబ్ల్యూటీఏ టైటిల్స్ గెలుచున్న ఆండ్రీవా గత ఏడాది జూలైలో తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ (5)ను అందుకుంది. మాజీ ప్లేయర్, 1994 వింబుల్డన్ చాంపియన్ కొంషితా మార్టినెజ్ వద్ద ఆమె శిక్షణ తీసుకుంటోంది. మరో వైపు గ్రాండ్‌స్లామ్ నెగ్గిన రెండో క్వాలిఫయర్‌గా గుర్తింపు పొందేందుకు బరిలోకి దిగిన చావలిన్‌స్కా అసలు పోరులో పూర్తిగా తడబడింది. ఫైనల్ చేరే క్రమంలో ఒక్క టాప్–20 ప్లేయర్‌తో కూడా తలపడకపోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. కెరీర్లో చాలెంజర్, ఐటీఎఫ్ టోర్నీలో మాత్రమే నెగ్గి ఆమె కెరీర్లో ఎక్కువ భాగం టెన్నిస్ ఆడేందుకు కావాల్సిన కనీస అవసరాలు తీర్చుకునేందుకే సరిపోయింది.రోలండ్ గారోస్‌లో రెండో రౌండ్ నెగ్గిన తర్వాత కూడా ఆమె వద్ద ఆ రోజు హోటల్ గదిలో ఆగేందుకు తగినన్ని డబ్బులు లేకపోయాయి. తాజా ప్రదర్శనతో తన కెరీర్ మొత్తంలో సాధించిన ప్రైజ్మనీకంటే ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తం చావలిన్‌స్కా రన్నరప్‌గా అందుకుంది. 114 ర్యాంక్‌తో బరిలోకి దిగిన చావలిన్‌స్కా ఫైనల్ చేరడంతో ఏకంగా 21వ ర్యాంక్‌కు చేరుకోనుంది. జ్వెరెవ్ X కొబోలినేడు జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో 10వ సీడ్ ఫ్లావియో కొబోలి (ఇటలీ) తలపడతాడు. జ్వెరెవ్ గతంలో నాలుగు సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరినా...ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయాడు. ఈ టోర్నీకి ముందు గత ఏడాది వింబుల్డన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడమే కొబోలి అత్యుత్తమ ప్రదర్శన. గతంలో ఇద్దరి మధ్య ఒకే ఒక మ్యాచ్ జరగ్గా...అందులో జ్వెరెవ్ గెలిచాడు. సా.6.30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్ యాప్‌లలో ప్రసారం అవుతుంది. -
గెంటేస్తారన్న భయం.. కట్‌చేస్తే చరిత్రకు అడుగు దూరంలో!
రెండు వారాల క్రితం.. మాయ చావ్లిన్‌స్కా ఒక క్వాలిఫయర్‌గా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ఆడేందుకు పారిస్‌కు చేరుకుంది. స్పాన్సర్స్ ఎవరూ లేకపోవడంతో సొంత డబ్బులతోనే ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు వచ్చింది. అయితే ఎవరూ ఊహించని విధంగా క్వాలిఫయర్ రౌండ్లో విజయం సాధించింది. ఆ తర్వాత నాలుగో రౌండ్ వరకు చేరుకున్న ఆమె తన జీవితంలో ఇదే పెద్ద విజయం అని భావించింది. కానీ కట్‌చేస్తే ఇవాళ చరిత్రకు అడుగుదూరంలో నిలిచింది ఈ 24 ఏళ్ల పోలండ్ సంచలనం. శనివారం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మిరా ఆండ్రీవాతో ఫైనల్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో మాయ చావ్లిన్‌స్కా తన అనుభవాలను పంచుకుంది.ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో పోలండ్‌కు చెందిన క్వాలిఫయర్ 24 ఏళ్ల మాయ చావ్లిన్‌స్కా చరిత్రకు అడుగుదూరంలో ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో శనివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చావ్లిన్‌స్కా రష్యాకు చెందిన మిరా ఆండ్రీవాను ఎదుర్కోనుంది. ఫైనల్లో గెలిచి టైటిల్ సాధిస్తే మాత్రం బ్రిటన్ స్టార్ క్రీడాకారిణి ఎమ్మా రాడుకాను తర్వాత క్వాలిఫయర్ హోదాలో మహిళల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోనున్న క్రీడాకారిణిగా చావ్లిన్‌స్కా నిలవనుంది. ఈ నేపథ్యంలో టైటిల్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన చావ్లిన్‌స్కా టోర్నీ మధ్యలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. 'ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అడుగుపెట్టినప్పుడు స్పాన్సర్లు ఎవరు లేకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హోటల్ రూంలో దిగాను. తన దగ్గర చాలినన్ని డబ్బులు లేకపోవడంతో టోర్నీ మధ్యలోనే హోటల్ వాళ్లు బయటకు గెంటేస్తారేమోనని చాలా భయపడ్డాను. కానీ ఇవాళ అన్ని రౌండ్లను దాటుకొని ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. టైటిల్ గెలుస్తానో లేదో తెలియదు కానీ జీవితాన్ని మాత్రం గెలిచేశాను. టైటిల్ గెలిస్తే నా దేశానికి గొప్ప విజయమవుతుంది. ఈ టోర్నీ ద్వారా నాకు వచ్చే ప్రైజ్‌మనీతో కష్టాలు తీరిపోనున్నాయి' అని మాయ చావ్లిన్‌స్కా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌కు ముందు తన ప్రొఫెషనల్ కెరీర్ మొత్తం కలిపి చావ్లిన్‌స్కా సుమారు 864,000 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 8.22 కోట్లు) సంపాదించింది. అయితే ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిస్తే చావ్లిన్‌స్కా సుమారు మూడు రెట్లు అంటే రూ. 30 కోట్లకు పైగా అందుకోనుంది. అదే రన్నరప్‌గా నిలిస్తే రూ. 15 కోట్ల 41 లక్షలు తీసుకోనుంది.చేతిపై పచ్చబొట్టుఇక మాయ చావ్లిన్‌స్కా ఎడమచేతిపై 'ఫ్రీ' అనే అక్షరం పచ్చబొట్టుగా పొడిపించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఆ పచ్చబొట్టు వెనుక ఉన్న కారణాన్ని చెప్పడానికి చావ్లిన్‌స్కా ఇష్టపడలేదు. కానీ ఆమె చేతిపై ఉన్న ఫ్రీ అనే టాటూ పదం ఇవాళ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేర్చిందని అభిమానులు విశ్వసిస్తున్నారు.Jazda Maja 🇵🇱#RolandGarros pic.twitter.com/9daStziM7E— Roland-Garros (@rolandgarros) June 4, 2026What a way to qualify for your first Grand Slam final 🤩 #RolandGarros pic.twitter.com/QsZMwVWOGL— Roland-Garros (@rolandgarros) June 4, 2026చదవండి: అఫ్గానిస్తాన్‌కు షాక్.. గుడ్‌బై చెప్పనున్న రషీద్ ఖాన్!


