breaking news
madhu arrest
-
తాతా మధు, నవీన్ రెడ్డి రిమాండును తిరస్కరించిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి రిమాండును నాంపల్లి కోర్టు తిరస్కరించింది. రూ.10 వేల పూచీకత్తులో 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. షూరిటీలు సమర్పించాక విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. మధు, నవీన్ రెడ్డి ఇద్దరిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ శాసన సభా స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని కూడా పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. అయితే అరెస్ట్ సమయంలో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హైడ్రామా నడిచింది. తెలంగాణ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా.. శాసనసభ ప్రాంగణంలో నిన్న తాతా మధు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే తానేం దూషించలేదని నిన్ననే మధు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో.. ఈ ఉదయం ఎమ్మెల్సీ తాతా మధు ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన్ని ఇంట్లోంచి బయటకు రావాలని పిలిచారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుని మధు అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అనంతరం అధికారులు వాళ్లతో మాట్లాడి ఆయన్ని తమ వెంట తీసుకెళ్లారు. మరోవైపు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డిపై సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బలవంతంగా ఆయన్ని తరలించారు. ఇదీ చదవండి: ఏటీఎంలలో ఫెవిక్విక్.. మన డబ్బులు స్వాహా చేస్తున్న ముఠా -
కీచకుడు మధు అరెస్ట్
హైదరాబాద్: అమాయక యువతులను వేధిస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటున్న ఎఫ్‌సీఐ మాజీ ఉద్యోగి, కీచకుడు మధును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధు వాడిన ఫోన్లు, ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అమ్మాయిలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగు చూసింది. ఇప్పటికి 300 మంది అమ్మాయిలను మోసం చేసిన మధు.. మరో 500 మంది అమ్మాయిలను వేధిస్తున్నట్టు సమాచారం. పోలీసులు సైకో మధును శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. హైదరాబాద్ డీసీపీ స్వాతి లక్రా కేసు వివరాలను వెల్లడించారు. అతనిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 'మధు అమ్మాయిల ఫోన్ నెంబర్లు సేకరించి వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఫేస్బుక్ ద్వారా అమ్మాయిలకు గాలం వేశాడు. మధు దగ్గర ఉన్న జాబితాలో ఐదు వేల మంది అమ్మాయిల ప్రొఫైల్స్ ఉన్నాయి. మధు వేర్వేరు పేర్లతో సిమ్ కార్డులు తీసుకున్నాడు. తండ్రి పేరును కూడా వేరుగా రాశాడు. అతని వద్ద 18 మొబైల్స్, 30 వరకు సిమ్ కార్డులు ఉన్నాయి' అని స్వాతి లక్రా చెప్పారు. ఈ కేసును విచారిస్తున్నామని చెప్పారు. మధు వల్ల మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న విషయం దర్యాప్తులో వెలుగు చూడాల్సి ఉందని తెలిపారు.


