-
రౌడీ బేబీ అంటున్న ధనుశ్
కోలీవుడ్ స్టార్ ధనుశ్ సింగర్‌గా ఎంత పేరు సంపాదించుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాను హీరోగా నటించిన ‘3’ సినిమాలో ధనుశ్ పాడిన ‘వై దిస్ కొలవెరి..’ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత కూడా కొన్నిసార్లు ధనుశ్ గొంతు సవరించుకున్నారు. తాజాగా డైరెక్టర్ వసంతబాలన్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలు’ సినిమా కోసం సాంగ్ పాడారు. ‘జైలు’ సినిమాలో హీరోగా నటించిన సంగీతదర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ ఈ విషయం తెలిపారు. అలాగే ధనుశ్ లే టెస్ట్ చిత్రం ‘మారీ 2’ ఈ నెల 21న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ కానుంది. బాలాజీ మోహన్ తెరకెక్కించిన ఈ చిత్రం ‘మారీ’ చిత్రానికి సీక్వెల్. ఈ చిత్రాన్ని తెలుగులో సాయి కృష్ణ పెండ్యాల రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ‘రౌడీ బేబీ..’ అనే సాంగ్‌ను తెలుగులో ధనుశ్ పాడారు. -
మారి–2లో మరో నాయకి
తమిళసినిమా: కోలీవుడ్ దాటి బాలీవుడ్, హాలీవుడ్ వరకూ వెళ్లి నటుడిగా తన సత్తా చాటుకుంటున్న నటుడు ధనుష్. చేతిలో చాలా చిత్రాలు ఉన్నా, వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రం తరువాత ఆయన నటించిన చిత్రం విడుదల కాలేదు. దీంతో ఆయన అభిమానులు తదుపరి చిత్రం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇంత వరకూ తన మామ, సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నిర్మించిన కాలా చిత్ర నిర్మాణం, విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కాలా విడుదల కావడంతో ధనుష్ తాజాగా వరుసగా తన చిత్రాలను విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన నటించిన వడచెన్నై, మారి–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. మధ్యలో ఆంగ్ల చిత్రం ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ విడుదలకు సిద్ధం అవుతోంది. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ఎన్నై నోకి పాయుం తూట్టా చిత్రం ఇంకా నిర్మాణంలోనే ఉంది. ఈయన తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై కథానాయకుడిగా నటించి నిర్మించిన మారి చిత్రం కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ను అందుకుంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం మారి–2. నటుడు ధనుష్‌నే నిర్మించి నటిస్తున్న ఇందులో నటి సాయిపల్లవి కథానాయకిగా నటిస్తోంది. నటి వరలక్ష్మీశరత్‌కుమార్ కీలక పాత్రను పోషిస్తున్న ఇందులో తాజాగా మరో కథానాయకిగా నటి విద్య వచ్చి చేరింది. ఇరవుక్కు ఆయిరం కన్గళ్, పంసంగ–2 చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి ధనుష్‌తో మారి–2 చిత్రంలో నటించే లక్కీచాన్స్ తలుపుతట్టింది. ఈ విషయాన్ని విద్య తన ట్విట్టర్లో పేర్కొంది. నటి సాయిపల్లవి ఈ చిత్రంలో ఆటోడ్రైవర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక వరలక్ష్మీశరత్‌కుమార్ కలెక్టర్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు టోవినో థామస్ విలన్‌గా, నటుడు కృష్ణ ముఖ్య పాత్రలోనూ నటిస్తున్నారు. ఈ చిత్రం తెన్కాశి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. దీనికి యువన్‌శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. -
మ్యాస్ట్రో సారథ్యంలో ధనుష్..!
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కోలీవుడ్ లో సత్తా చాటుతున్న ధనుష్ గాయకుడిగానూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా ధనుష్ స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న మారి 2 సినిమా కోసం మేస్ట్రో ఇళయరాజా ఓ పాట పాడారు. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. అందుకు ప్రతిగా ఇప్పుడు ఇళయరాజా సంగీతమందిస్తున్న ఓ సినిమాలో ధనుష్ పాట పాడనున్నాడు. ఇటీవల ఇళయరాజ సంగీత దర్శకుడిగా 1000 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ భారీ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇసైజ్ఞాని స్వరపరిచిన పలు సూపర్ హిట్ పాటలను ధనుష్ వేదిక మీద ఆలపించారు. ధనుష్ గానం నచ్చిన మేస్ట్రో తాను సంగీతమందిస్తున్న ఓ మరాఠి సినిమాలో ధనుష్ చేత పాట పాడిస్తున్నారు. -
తనయుడి కోసం ఇళయరాజా..!
దేశగర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఒకరు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా. ఎన్నో చిరస్మరణీయ గీతాలను అందించిన ఈ లెజెండ్, ఆయన సంగీత దర్శకత్వంలో పలు గీతాలను ఆలపించారు. అయితే ఇతర సంగీత దర్శకుల కోసం ఇళయరాజా పాటలు పాడిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటన ఇటీవల జరిగింది. ఓ యువ సంగీత దర్శకుడు స్వరపరిచిన పాటను ఇళయరాజా ఆలపించారు. అయితే ఆ యువ సంగీత దర్శకుడు ఇళయరాజా వారసుడు యువన్ శంకర్ రాజానే కావటం విశేషం. ధనుష్ హీరోగా ఘనవిజయం సాధించిన మారికి సీక్వల్గా అదే కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మారి 2’ కోసం ఇళయరాజా ఓ గీతాన్ని ఆలపించారు. ఇటీవల ఈ సాంగ్ రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని హీరో ధనుష్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించారు. So happy to announce that the maestro isaignani ilayaraja sir sang a song today for #maari2. What a delightful divine experience. We feel so blessed and super thrilled. @thisisysr @directormbalaji pic.twitter.com/6pNRj09aZ7 — Dhanush (@dhanushkraja) 16 January 2018 -
ధనుష్‌తో వరూ సై
సాక్షి, సినిమా: నటుడు ధనుష్‌తో నటించడానికి నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ సై అన్నారు. వరలక్ష్మీ ఒక పక్క కథానాయకిగా నటిస్తూనే మరో పక్క చాలెంజింగ్ పాత్రల్లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. అలా ధనుష్ కథానాయకుడిగా నటించినున్న తాజా చిత్రం మారి-2లో కీ రోల్‌ను పోషించడానికి ఓకే చెప్పేశారు. ఇంతకు ముందు ధనుష్ హీరో బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరపైకొచ్చిన మారి చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. నటి కాజల్ అగర్వాల్ నాయకిగా నటించిన ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చిత్ర వర్గాలు అప్పుడే ప్రకటించారు. దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరింది. ధనుష్ హీరోగా నటించి తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్న మారి-2లో సాయిపల్లవి కథానాయకిగా ఎంపికైంది. ఇందులో ముఖ్య పాత్రకు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత ధనుష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అందుకు ప్రతిగా ట్విట్ చేసిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మారి-2లో తనను ఒక భాగం చేసినందుకు ధనుష్, దర్శకుడు బాలాజీ మోహన్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఈ చిత్రంలో నటించడానికి ఆలస్యం చేయదలచుకోలేదు. ఎప్పుడెప్పుడు నటిస్తానా అని చాలా ఎగ్జైట్‌గా ఫీలౌతున్నాను అని పేర్కొన్నారు. ఇందులో మలయాళ నటుడు టోవినో థామస్ ప్రతినాయకుడిగా నటించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నారు. సుమారు 10 ఏళ్ల తరువాత ధనుష్, యువన్‌శంకర్‌రాజా కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం మారి-2 అన్నది గమనార్హం. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను కొత్త సంవత్సరం వెల్లడించే అవకాశం ఉంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్‌గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్‌లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement