breaking news
LS Rathore
-
ఈ ఏడాది మంచి వర్షాలు
ఈశాన్య ప్రాంతాలు, తమిళనాడు, రాయలసీమ జిల్లాల్లో తక్కువ వర్షపాతం న్యూఢిల్లీ: సాధారణం కంటే మెరుగైన వర్షాలు ఈ ఏడాది దేశవ్యాప్తంగా కురియనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. ఈ ఏడాది సాధారణం, అంత కన్నా అధిక వర్షపాతం కురిసేందుకు 94 శాతం అవకాశాలున్నాయని ఐఎండీ డెరైక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ మంగళవారం చెప్పారు. ‘స్వల్ప వర్షపాతం కురుస్తుందని చెప్పేందుకు కేవలం ఒక శాతం అవకాశమే ఉంది. కరువు బాధిత ప్రాంతాలైన మరాఠ్వాడా, బుందేల్‌ఖండ్‌లలో ఏడాది అధికంగా వర్షాలు కురుస్తాయి. మొత్తంమీద దేశమంతా అన్ని చోట్లా దాదాపుగా ఒకేతీరుగా వర్షాలు కురుస్తాయి’ అని చెప్పారు. ఈశాన్య భారత ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. అలాగే ఆగ్నేయ ప్రాంతంలోని తమిళనాడు, అక్కడికి దగ్గర్లోని రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం కురుస్తుందన్నారు. నెలలవారీగా చూసుకున్నా సరిపడా వర్షపాతం కురిసే అవకాశాలున్నాయన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని.. దీనికి సన్నద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వర్షపాత నమూనాలు తదితర అంశాలపై మరిన్ని వివరాలు జూన్‌లో వెల్లడిస్తామన్నారు. ఐఎండీ శాస్త్రవేత్త డీఎస్ పాయ్ మాట్లాడుతూ కిందటేడాది రుతుపవనాలను దెబ్బతీసిన ఎల్ నినో పరిస్థితులు తగ్గుముఖం పడతాయన్నారు. ఈ రుతుపవన సీజన్ చివరి దశ (ఆగస్టు-సెప్టెంబర్)లో లా నినో ఏర్పడేందుకు అవకాశం ఉందని అన్నారు. ఇది రుతుపవనాలకు మంచిదని చె ప్పారు. -
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
-
వానమ్మా.. వెల్కమ్..
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు మరో 4 రోజుల్లో సీమాంధ్రకు, వారంలో తెలంగాణకు వచ్చే అవకాశం సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ/తిరువనంతపురం: దేశమంతా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు శుక్రవారం భారత ఉపఖండాన్ని తాకాయి. సాధారణ తేదీ కన్నా నాలుగు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు శుక్రవారం నాడు కేరళ తీరాన్ని దాటాయి. రెండు రోజులుగా కేరళలో రెండున్నర మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది రుతుపవనాల రాకకు సంకేతమని శుక్రవారం ఈ మేరకు భారత వాతావరణ విభాగం(ఐఎండీ) డెరైక్టర్ జనరల్ ఎల్.ఎస్. రాథోడ్ తెలిపారు. కేరళతోపాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు కూడా శుక్రవారం నైరుతి విస్తరించిందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం ఓ బులెటిన్‌లో పేర్కొంది. నాలుగు రోజుల్లో సీమాంధ్రకు, తర్వాత వారంలో తెలంగాణ అంతటికీ విస్తరించే అవకాశాలున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని, దీని ప్రభావంతో ఒకట్రెండుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. కాగా, దేశంలో గత నాలుగేళ్లుగా వర్షపాతం సాధారణం, సాధారణం కంటే ఎక్కువగా నమోదు అయింది. అయితే ఈ ఏడాది పసిఫిక్ మహా సముద్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా భారత్‌లో సాధారణం కంటే తక్కువగా 95 శాతమే వ ర్షపాతం ఉండవచ్చని నిపుణుల అంచనా. కొనసాగుతున్న వడగాడ్పులు: దక్షిణ కోస్తా, తెలంగాణ లో వడగాల్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు కొనసాగే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం గుంటూరులోని రెంటచింతలలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే రామగుండం, బాపట్లలో 44, ఒంగో లు, గన్నవరం, కావలి, నిజామాబాద్‌లలో 43, నంది గామ, నెల్లూరులో 42, హైదరాబాద్, కర్నూలులలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఉత్తరభారతాన్ని కూడా వడగాడ్పులు, విద్యుత్ కోతలు వణికిస్తున్నాయి. శుక్రవారం ఢిల్లీ, పంజాబ్, లక్నోతో సహా అనేక చోట్ల 45 నుంచి 48.4 డిగ్రీల సెల్షియస్ల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.