'మగాళ్లకు దూరంగా ఉంటే శతాయుష్షట!'
లండన్: మగాళ్లకు దూరంగా అంటే శృంగారంలో పాల్గొనకుండా ఉంటే దీర్ఝాయుష్షు వస్తుందట. నిండు నూరేళ్లూ సుఖంగా జీవించవచ్చట. ఏ సర్వేలోనో, పరిశోధనలోనో ఈ విషయం తేలలేదు. 109 ఏళ్ల బామ్మ తన జీవిత రహస్యాన్ని వెల్లడించారు. తాను ఇన్నేళ్లు జీవించడానికి మగాళ్లకు దూరంగా ఉండటం, ప్రతి రోజూ ఉదయం జావ తాగడమే కారణమని చెప్పారు.
ఇంగ్లండ్‌లో అతిపెద్ద వయస్కురాలైన జెస్సీ గలాన్ ఇటీవల 109వ బర్త్ డే జరుపుకొన్నారు. పుట్టిన రోజున ఆమె కేక్ కట్ చేసి కడుపు నిండా భోజనం లాగించేశారు. మగాళ్లకు దూరంగా ఉండటం వల్ల వృద్దాప్యంలోనూ ఆరోగ్యంగా, చలాకీగా ఉంటున్నానని ఈ బామ్మ చెప్పింది. రోజూ కాసేపు ఎక్స్‌ర్‌సైజ్ చేస్తారట. పెళ్లి చేసుకోకుండా ఆవివాహితగానే జీవితం గడుపుతున్నానని జెస్సీ తెలిపింది. అబెర్డీన్‌షైర్‌లో జన్మించిన ఆమె 13వ ఏట ఇల్లు విడిచివెల్లిపోయి పాలు అమ్ముకుని జీవిస్తున్నారు.