లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన ఆహారం సురక్షితమేనా?
అసాధారణమైన ఘనీభవించిన డెజర్ట్‌ల తయారీ కోసం, అలాగే ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ద్రవ నైట్రోజన్‌ను చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో, ద్రవ నైట్రోజన్‌తో తయారుచేసిన ఆహారాలు, చూడటానికి ఆసక్తికలిగించే ఫ్యాషన్ ట్రెండ్‌గా మారాయి. సాధారణ ఫ్రీజింగ్ పద్ధతుల కంటే ద్రవ నైట్రోజన్ ఉష్ణోగ్రత ఆహారపదార్థాలను భిన్నంగా గడ్డకట్టేలా చేస్తుంది. దీనివల్ల వాటికి విభిన్నమైన చిక్కదనం, ఆకృతి రావడంతో పాటు, ఒక ప్రత్యేకమైన ఆవిరి కూడా వెలువడుతుంది. ఈ ఆవిరిని చెఫ్‌లు "డ్రాగన్ బ్రీత్" స్నాక్స్ కోసం ఉపయోగిస్తారు. ఎవరైనా డ్రాగన్ బ్రీత్ స్నాక్‌ను కొరికినప్పుడు, అది ఒక ఆవిరి మేఘాన్ని విడుదల చేస్తుంది. అంటే..ఇది వారి నోటి నుంచి పొగ వస్తున్నట్లుగా ఒక ప్రభావాన్ని సృష్టిస్తుంది. దీన్ని డ్రాగన్ శ్వాస లేదా స్వర్గపు శ్వాస వంటి ట్రెండ్‌లుగా పిలుస్తారు. అలాంటి ఆహారాలకు కేరాఫ్ బెంగళూరులోని వివి పురం ఫుడ్ స్ట్రీట్. పాపం ఓ పెళ్లైన కొంత జంట అక్కడకువెళ్లి ఆ ట్రెండ్ ఫుడ్‌ని సరదాగా ట్రైం చేయడంతో ఏం జరిగిందో తెలిస్తే విస్తుపోతారు. అంతేగాదు ఇలాంటి ఆహారం తినేటప్పుడు జాగురకతతో తినాలంటూ ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.అసలేం జరిగిందంటే..జస్ట్ పెళ్లై నాలుగురోజులైంది. ఆమె సరదాగా భర్తతో కలిసి ఈ స్మోకీ ట్రెండ్ ఫుడ్‌ని టేస్ట్ చేయాలని వి.వి.పురం ఫుడ్ స్ట్రీట్‌కు వెళ్లారు. అక్కడ ద్రవ నైట్రోజన్‌తో పూత పూసి.. పొగలు వెలువరించే బిస్కెట్లు తిన్నారు. అంతే ఆ నవవధువుకి నోటి నుంచి రక్తస్రావం, ఎండోస్కోపీలో అన్నవాహిక , జీర్ణాశయ శ్లేష్మ పొర గణనీయంగా క్షీణించినట్లు తేలింది. ఆ తర్వాత రెండు చేతులు, కాళ్లలో బలహీనత మొదలై..ఒక నెల వరకు మంచానికే పరిమితమైంది. వైద్య పరీక్షల్లో నరాల ప్రసరణ పరీక్షలలో అక్యూట్ మోటార్ ఆక్సోనల్ న్యూరోపతి ఉన్నట్లు నిర్ధారణ అయింది. సరదాగా తిన్న ఆహారం ఆటోఇమ్యూన్ న్యూరోపతికి దారితీసింది. తినేటప్పుడు తస్మాత్ జాగ్రత్త..ద్రవనైట్రోజన్తో కూడిన ఆహారాలు తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందట. అవి పూర్తిగా ఆవిరైకపోక ముందే తింటే నోరు, అన్న వాహిక, కడుపుకి తీవ్రమైన క్రయోజెనిక్ కాలిన గాయలు ఏర్పడి, కోతలు, రక్తస్రావం, చిల్లులు పడటానికి దారితీస్తుందట. ఆ నేపథ్యంలోనే ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) దీనిపై స్పష్టమైన హచ్చరికలు జారీ చేసింది. పైగా ఆహారాన్ని ప్లేట్లో వడ్డించేటప్పుడు లేదా కస్టమర్లకు నేరుగా అందించే ముందు ద్రవ నైట్రోజన్ ఉపయోగించడం పూర్తిగా నిషేధించింది. కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ సమయంలో లేదా ఐస్క్రీంల తయారీలో మాత్రమే దీనిని శీతలీకరణ (cooling) ఏజెంట్‌గా ఉపయోగించడానికి అనుమతి ఉంది. ఒకవేళ సరదాగా ఇలాంటి క్రయోజనిగ్ ఫుడ్‌ని ప్రయత్నించాలనుకుంటే..ఆ పొగ అంతా అయిపోయేదాక వెయిట్ చేసి అప్పుడు ఆరగించాలని అంటున్నారు. నేరుగా అలానే తింటే తీవ్ర ప్రమాదాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.(చదవండి: జస్ట్ ఒక్క గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు అనుకున్నా..! కానీ ఏకంగా 19..)