breaking news
Leela Palace Hotel
-
మళ్లీ ఐపీవోల హవా
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్లలో సందడి నెలకొంది. ఈ బాటలో మరో నాలుగు కంపెనీలు స్టాక్ మార్కెట్ల తలుపు తట్టనున్నాయి. ఈ వారం ఇష్యూలు ప్రారంభంకానున్న కంపెనీల జాబితాలో లీలా ప్యాలసెస్ హోటల్స్ ఏజిస్ వొప్యాక్ టెర్మినల్స్ చేరాయి. ఇతర చిన్న సంస్థలలో ప్రోస్టార్ ఇన్ఫో సిస్టమ్స్, స్కోడా ట్యూబ్స్ ఐపీవోకు రానున్నాయి. మరోపక్క గత వారం ఇష్యూలను పూర్తి చేసుకున్న బొరానా వీవ్స్(28న), బెల్రైజ్ ఇండస్ట్రీస్(29న) లిస్ట్‌కానున్నాయి. లీలా ప్యాలసెస్ ఆతిథ్య రంగ కంపెనీ ష్లాస్ బెంగళూరు షేరుకి రూ. 413–435 ధరల శ్రేణిలో ఈ నెల 26–28 మధ్య ఐపీవోకు వస్తోంది. తద్వారా రూ. 3,500 కోట్ల సమీకరణపై కన్నేసింది. లీలా ప్యాలసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బ్రాండుతో కంపెనీ ఆతిథ్య రంగ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రాజెక్ట్ బాలెట్ బెంగళూరు హోల్డింగ్స్ ఆఫర్ చేయనుంది. వెరసి దేశీయంగా ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏజిస్ వొప్యాక్ లాజిస్టిక్స్ రంగ సంస్థ ఏజిస్ వొప్యాక్ టెరి్మనల్స్ రూ. 223–235 ధరల శ్రేణిలో ఈ నెల 26–28 మధ్య పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ప్రయివేట్ రంగ దిగ్గజం ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఇది. ఇష్యూలో భాగంగా రూ. 2,800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. రూ. 3,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసినప్పటికీ రూ. 2,800 కోట్లకు కుదించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 63 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. స్కోడా ట్యూబ్స్స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబులు, పైపుల తయారీ కంపెనీ స్కోడా ట్యూబ్స్ రూ. 130–140 ధరల శ్రేణిలో ఈ నెల 28–30 మధ్య ఐపీవోకు వస్తోంది. తద్వారా రూ. 220 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ సమీకృత పవర్ సొల్యూషన్ కంపెనీ ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ ఐపీవోలో భాగంగా 1.6 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇందుకు షేరుకి రూ. 95–105 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 27న ప్రారంభమూ 29న ముగియనుంది. తద్వారా రూ.168 కోట్లు సమకూర్చుకోనుంది. -
ఇవిగో కొత్త ఐపీవోలు.. కొనుక్కుంటారా షేర్లు?
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ కంపెనీ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 413–435 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. లీలా ప్యాలసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ బ్రాండుతో కంపెనీ ఆతిథ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ ప్రాజెక్ట్ బాలెట్ బెంగళూరు హోల్డింగ్స్ ఆఫర్ చేయనుంది. తద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వెరసి దేశీయంగా ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2025 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 3,900 కోట్లుగా నమోదైంది. లీలా బ్రాండ్ సంస్థ 12 హోటళ్ల ద్వారా మొత్తం 3,382 గదుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఏజిస్ వొప్యాక్లాజిస్టిక్స్ రంగ సంస్థ ఏజిస్ వొప్యాక్ టెర్మినల్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 223–235 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. ప్రయివేట్ రంగ దిగ్గజం ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ సంస్థ ఇది. ఇష్యూలో భాగంగా రూ. 2,800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.తొలుత రూ. 3,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసినప్పటికీ రూ. 2,800 కోట్లకు కుదించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 63 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 2,016 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 671 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనుంది. ఈ నిధులతో మంగళూరులో క్రియోజెనిక్ ఎల్పీజీ టెర్మినల్‌ను కొనుగోలు చేయనుంది.కాగా.. కంపెనీ విలువను రూ. 26,000 కోట్లుగా బ్రోకరేజీలు మదింపు చేశాయి. 2024 జూన్‌కల్లా కంపెనీ రుణ భారం రూ. 2,584 కోట్లుగా నమోదైంది. కంపెనీ దేశవ్యాప్తంగా పెట్రోలియం, లూబ్రికెంట్స్, కెమికల్స్, ఎల్పీజీ, ప్రొపేన్ తదితర లిక్విడ్స్, గ్యాస్ సంబంధ స్టోరేజీ సౌకర్యాలను కలిగి ఉంది. కీలక పోర్టులకు సమీపంలో టెర్మినళ్లను ఏర్పాటు చేసింది.షిప్‌రాకెట్ ఐపీవో బాట Shiprocket IPO: ఈకామర్స్ సంస్థలకు సర్వీసులందించే షిప్‌రాకెట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా ప్రాస్పెక్టస్ వివరాలను తొలి దశలో రహస్యంగా ఉంచేందుకు వీలుంటుంది.కాగా.. టెమాసెక్, జొమాటో తదితర దిగ్గజాలకు పెట్టుబడులున్న కంపెనీ ఐపీవో ద్వారా రూ. 2,000–2,500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇష్యూ నిధులను ప్రొడక్ట్ డెవలప్మెంట్, వ్యూహాత్మక కొనుగోళ్లు, లాజిస్టిక్స్‌తోపాటు, వేర్‌హౌసింగ్ ఇన్ఫ్రా విస్తరణ తదితరాలకు వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాఆలు పేర్కొన్నాయి. -
ఐపీవోల హవా
రోజుకో కొత్త గరిష్టాన్ని తాకుతున్న సెకండరీ మార్కెట్ల బాటలో ప్రైమరీ మార్కెట్లు సైతం భారీ సంఖ్యలో ఇష్యూలతో కదం తొక్కుతున్నాయి. తాజాగా రెండు కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో రెండు కంపెనీలు ఐపీవో సన్నాహాల్లో ఉన్నాయి. వివరాలు ఇలా.. –సాక్షి, బిజినెస్డెస్క్ఐపీవో చేపట్టేందుకు సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ వారీ ఇంజినీర్స్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందింది. ఇదేవిధంగా డిజిటల్ పేమెంట్ల సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి సైతం సెబీ ఆమోదముద్ర వేసింది. వారీ సెబీకి 2023 డిసెంబర్లో, మొబిక్విక్ 2024 జనవరిలో దరఖాస్తు చేశాయి. వారీ ఇంజినీర్స్.. రూ. 3,000 కోట్లకుపైగా వారీ ఇంజినీర్స్ ఐపీవోలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 32 లక్షల షేర్లను ప్రమోటర్‌తోపాటు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను ఒడిషాలో 6 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్, సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ 2023 జూన్‌కల్లా 12 గిగావాట్ల పీవీ మాడ్యూల్ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మొబిక్విక్.. రూ. 700 కోట్లు తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా మొబిక్విక్ రూ. 700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు సై అంటోంది. ఐపీవో నిధుల్లో రూ. 250 కోట్లు ఫైనాన్షియల్ సర్వీసుల బిజినెస్ వృద్ధికి వినియోగించనుంది. రూ. 135 కోట్లు పేమెంట్ సరీ్వసుల బిజినెస్‌కు దన్నుగా వెచ్చించనుంది. మరో రూ. 135 కోట్లు డేటా, మెషీన్ లెర్నింగ్, ఏఐ, ప్రొడక్ట్ టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేయనుంది. ఈ బాటలో పేమెంట్ పరికరాలపై రూ. 70 కోట్లు పెట్టుబడి వ్యయాలుగా కేటాయించనుంది. రూ. 10,000 కోట్లపై కన్ను విద్యుత్ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ భారీ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు అనుగుణంగా గత వారమే సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా నవంబర్ తొలి వారంలో ఐపీవోకు వచ్చే వీలున్నట్లు తెలుస్తోంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ముంబైసహా.. సింగపూర్ తదితర దేశాలలో రోడ్‌షోలకు ప్రణాళికలు వేసింది.ఇష్యూ నిధుల్లో రూ. 7,500 కోట్లు అనుబంధ సంస్థ ఎన్టీపీసీ రెనెవబుల్ ఎనర్జీ రుణ చెల్లింపులతోపాటు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఈ మహారత్న కంపెనీ 2024 ఆగస్ట్‌కల్లా 3,071 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ ఏడాది ఇప్పటికే 60 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచి్చన నేపథ్యంలోనూ మరిన్ని కంపెనీలు ఇందుకు తెరతీస్తుండటం విశేషం! ఇదే బాటలో లీలా ప్యాలెస్ లీలా ప్యాలెస్ హోటళ్ల నిర్వాహక సంస్థ ష్లాస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. వెరసి దేశీ ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. కాగా.. ఇష్యూలో భాగంగా లీలా ప్యాలెస్ రూ. 3,000 కోట్ల తాజా ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్ సంస్థ డీఐఎఫ్సీ రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ దన్నుగల ష్లాస్ బెంగళూరు వెల్లడించింది. 2024 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 4,053 కోట్లుగా నమోదైంది. ద లీలా బ్రాండ్‌తో కంపెనీ విలాసవంత హోటళ్లను నిర్వహిస్తున్న విషయం విదితమే. మొత్తం 3,382 గదులను కలిగి ఉంది.రూ. 1,100 కోట్ల సమీకరణరియల్టీ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తెరతీసింది. ఇందుకు వీలుగా సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను కంపెనీతోపాటు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాసాగ్రాండ్ బ్రాండుతో కంపెనీ రియల్టీ అభివృద్ధి కార్యకలాపాలు చేపడుతోంది. 2023–24లో రూ. 2,614 కోట్ల ఆదాయం, రూ. 257 కోట్ల నికర లాభం ఆర్జించింది.14ఏళ్లలో సెప్టెంబర్ బిజీ..బిజీ ఐపీవోలకు 28 కంపెనీలు ఈ నెల(సెప్టెంబర్) 14 ఏళ్ల తదుపరి సరికొత్త రికార్డుకు వేదిక కానుంది. రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వివరాల ప్రకారం సెపె్టంబర్లో ఇప్పటివరకూ 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మెయిన్ బోర్డ్, ఎస్ఎంఈలు కలిపి ఇప్పటికే 28 కంపెనీలు లిస్టింగ్‌కు తెరతీశాయి. ఫైనాన్షియల్ మార్కెట్లు పరివర్తనలో ఉన్నట్లు ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన సెపె్టంబర్ బులెటిన్‌లో ఆర్బీఐ పేర్కొంది. ప్రైమరీ ఈక్విటీ మార్కెట్లో చిన్న, మధ్యతరహా సంస్థలు(ఎస్ఎంఈలు)సహా భారీ సందడి నెలకొన్నట్లు తెలియజేసింది. వెరసి 14 ఏళ్ల తరువాత ఈ సెప్టెంబర్ అత్యంత రద్దీగా మారినట్లు వ్యాఖ్యానించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ తదితర ఇన్వెస్టర్ల ద్వారా ఇష్యూలు భారీస్థాయిలో సబ్‌్రస్కయిబ్ అవుతున్నట్లు వివరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలన ప్రకారం ఐపీవోలలో లభించిన షేర్లలో 54 శాతాన్ని ఇన్వెస్టర్లు లిస్టయిన వారం రోజుల్లోనే విక్రయించారు. 2024లో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణ జోరు చూపుతున్నట్లు ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఈ బాటలో తొలి అర్ధభాగానికల్లా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఐపీవోలు వెలువడిన దేశంగా భారత్ నిలిచినట్లు తెలియజేసింది. ఇందుకు ఎస్ఎంఈలు ప్రధానంగా దోహదపడినట్లు వెల్లడించింది. -
లీలా ప్యాలెస్‌లో మనూ భాకర్‌కు అపూర్వ స్వాగతం
చెన్నైలోని సుప్రసిద్ధ ఫైవ్ స్టార్ హోటల్ లీలా ప్యాలెస్‌లో పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. మనూ గౌరవార్థం హోటల్ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సన్మానించింది. హోటల్ రూమ్స్‌లో టవల్స్, పిల్లోస్, న్యాప్కిన్స్ ఇతరత్రా వస్తువులపై మనూ పేరును ముద్రించారు హోటల్ నిర్వహకులు. హోటల్ సిబ్బంది మనూను సంప్రదాయ బద్ధంగా హోటల్లోకి ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. The Leela Palace Chennai welcomes Manu Bhaker, the Olympic Champion ! Just WoW pic.twitter.com/Dc2lhQpnE4— Megh Updates 🚨™ (@MeghUpdates) August 27, 2024హోటల్ నిర్వహకులు మనూ కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. లీలా ప్యాలెస్ ఆతిథ్యానికి మనూ పరవశించి పోయింది. మనూ లీలా ప్యాలెస్‌లో గడిపిన క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. కాగా, మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్ రెండు పతకాలు సాధించాక దేశవ్యాప్తంగా చాలామంది ఆమెను తమతమ స్థానాలకు ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే మనూ చెన్నైలోని ఓ కాలేజీలో పర్యటించింది. అక్కడ కూడా కాలేజీ యాజమాన్యం మనూను ఘనంగా సన్మానించింది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాక మనూకు దేశవ్యాప్తంగా పిచ్చి క్రేజ్ వచ్చింది. ఆమె ఎక్కడికి వెళ్లినా జనాలు సెల్ఫీలు, ఫోటోల కోసం ఎగబడుతున్నారు. మనూ పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లోని రెండు ఈవెంట్స్‌లో కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే. -
Top 10 Most Expensive Hotels In India: భారత్‌లో ఖరీదైన హోటల్స్ - చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి! (ఫొటోలు)
-
లీలా ప్యాలెస్.. శర్వానంద్ పెళ్లి జరిగేది ఇక్కడే (ఫోటోలు)
-
శర్వానంద్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వేదిక ఎక్కడంటే..
యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలోనే యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రక్షితారెడ్డితో శర్వా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకి రామ్ చరణ్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. నిశ్చితార్థం జరిగిన ఐదు నెలల తర్వాత పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంది ఈ జంట. వచ్చే నెలలో వీరి వివాహం జరగనుంది. జూన్ 2,3 తేదిలలో శర్వా- రక్షితల వివాహం గ్రాండ్‌గా చేయబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరి వివాహ వేడుకకి రాజస్తాన్‌లోని లీలా ప్యాలెస్ వేదిక కానుంది. జూన్ 2న మెహందీ ఫంక్షన్‌తో పాటు సాయంత్రం సంగీత్ నిర్వహించనున్నారు. ఇక జూన్ 3న రక్షిత మెడలో శర్వా మూడు ముళ్లు వేయనున్నాడు. ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించారట. టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరో హీరోయిన్లు పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేయనున్నారు. చదవండి: బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ? కీర్తి సురేశ్ కాబోయే భర్త ఎవరో తెలుసా?.. వైరలవుతున్న ఫోటో! -
27 నుంచి బయో బబుల్‌లోకి...
చెన్నై: కరోనా వైరస్ కారణంగా వచ్చిన సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై తొలి క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి జరిగే టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో ఇరు జట్ల ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా ‘బయో సెక్యూర్ బబుల్’ను ఏర్పాటు చేస్తున్నారు. భారత క్రికెటర్లంతా ఈ నెల 27న బయో బబుల్‌లోకి ప్రవేశిస్తారు. టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ న్యూజిలాండ్ నుంచి చెన్నై చేరుకొని ఇప్పటికే హోటల్లో ప్రత్యేక గదిలోకి వెళ్లిపోయారు. ఇంగ్లండ్ జట్టు ఆటగాళ్లు మాత్రం శ్రీలంకతో సిరీస్ తర్వాత కొలంబో నుంచి ఈ నెల 27న ఇక్కడికి వచ్చి నేరుగా హోటల్లోకి ప్రవేశిస్తారు. ఇప్పటికే బయో బబుల్‌లో ఉన్న వీరు చార్టెడ్ ఫ్లయిట్ ద్వారా రానున్నారు. అయితే శ్రీలంకతో సిరీస్‌లో ఆడని ముగ్గురు ఇంగ్లండ్ క్రికెటర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్ ఆదివారం ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. అక్కడే వారికి కోవిడ్–19 టెస్టులు నిర్వహిస్తారు. నెగెటివ్‌గా తేలితే వారు చెన్నైకి బయల్దేరతారు. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాత కూడా సహచరులతో కలవకుండా ఈ ముగ్గురు ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉండాల్సి ఉంది. ఫిబ్రవరి 5 నుంచి, 13 నుంచి ఇక్కడి చిదంబరం స్టేడియంలో తొలి రెండు టెస్టులు జరుగుతాయి. క్రికెటర్లకు సహకారం అందించేందుకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్న లైజన్ మేనేజర్లు, గ్రౌండ్స్‌మన్, డ్రైవర్ తదితరులు కలిసి సుమారు 15 మంది బయో బబుల్‌లో ఉంటారు. కొందరు అసోసియేషన్ అధికారులను కూడా బయో బబుల్‌లో ఉంచాలని ముందుగా భావించినా... నిర్వహణ ఏర్పాట్లకు సమస్య రావచ్చని భావించి ఆ ఆలోచనను పక్కన పెట్టారు. వీరెవరూ మ్యాచ్ రోజుల్లో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లకు సమీపంలోకి రాకూడదని గట్టి ఆంక్షలు విధించారు. -
శింబు చెల్లెలు పెళ్లి సందడి