breaking news
lease amount
-
ప్రభుత్వ భూములు లీజ్‌కు తీసుకుని అద్దె చెల్లించని 9 బడా కంపెనీలు
-
బడా కంపెనీల ఇష్టారాజ్యం.. కేసీఆర్ సర్కార్‌కు వందల కోట్లు లాస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ భూములు లీజ్‌కు తీసుకున్న 9 బడా కంపెనీలు అద్దె చెల్లించడంలేదు. జీహెచ్ఎంపీ పరిధిలో ఉన్న పెద్ద కంపెనీలు 2009 నుంచి ప్రభుత్వానికి లీజ్ చెల్లించడంలేదు. ఈ కంపెనీలు ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ. 272కోట్లు బకాయిపడ్డాయి. ఈ క్రమంలో లీజ్ చెల్లించని వారి లైసెన్స్ రద్దు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కాగా సదరు సంస్థలు పర్యాటక రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు లీజ్‌కు తీసుకోవడం గమనార్హం. 9 బడా కంపెనీలు ఇవే.. -ట్రైడెంట్ హోట్.. రూ. 87.86 కోట్లు. - అర్బన్దేవ్ సెంటర్ రూ. 62.77 కోట్లు. - త్రిస్టార్ హోటల్ రూ. 50.35 కోట్లు. - ప్రసాద్ ఐమాక్స్ రూ. 27. 45 కోట్లు. - ఎక్స్‌పోటెల్ హోటల్ రూ. 15.13 కోట్లు. - స్నో వరల్డ్ రూ. 15 కోట్లు. - జల విహార్ రూ. 6.51 కోట్లు. - గోల్ఫ్ కోర్స్(శామీర్‌పేట్) రూ. 5.58 కోట్లు. - దస్పల్లా హోటల్ రూ. 1.8 కోట్లు. ఇది కూడా చదవండి: ఉమ్మడి మెదక్‌లోనూ ‘చీకోటి’ కార్యకలాపాలు.. లిస్ట్‌లో డీసీసీబీ ఛైర్మన్! -
పారతో తల్లిపై దాడి
అక్కంపేట(జంగారెడ్డిగూడెం రూరల్) : పారతో తల్లిపై దాడి చేసిన ఓ కొడుకు ఉదంతమిది. ఈ ఘటన జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేటలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అక్కంపేటకు చెందిన పులపాకుల వెంకటలక్ష్మికి గ్రామంలో ఎకరం పొలం ఉంది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం వెంకటలక్ష్మి మండలంలోని వేగవరంలో ఉంటున్న కూతురు దుర్గ వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మి తన ఎకరం పొలాన్ని కొడుకు రామకృష్ణకు కౌలుకు ఇచ్చింది. ఆ పొలంలో రామకృష్ణ మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. దీంతో కౌలు సొమ్ము కోసమని శుక్రవారం వెంకటలక్ష్మి వేగవరం నుంచి అక్కంపేటలోని పొలం వద్దకు వచ్చింది. కొడుకును కౌలు సొమ్ము అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన రామకృష్ణ పొలం పనుల కోసం ఉపయోగించే పారతో తల్లి వెంకలక్ష్మిపై దాడి చేశాడు. ఫలితంగా వెంకటలక్ష్మి తీవ్రంగా గాయపడి అక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను స్థానికులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. ఇదిలా ఉంటే వెంకటలక్ష్మి పొలం ప్రస్తుతం చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ పరిధిలోకి వెళ్లింది. దీంతో ఈ పొలానికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం విషయంలో తల్లీకొడుకుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్టు గ్రామస్తులు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు.