laxmipeta
-
లక్ష్మీపేట కేసులో పిటీషన్ డిస్మిస్
వంగర : లక్ష్మీపేట ఘటనకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులైన ఆరుగురు నిందితులు ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసుకున్న పిటీషన్‌ను లక్ష్మీపేట ప్రత్యేక న్యాయస్థానం డిస్మిస్ చేసిందని బాధితుల పక్ష న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐ.నాగమల్వేశ్వరరావు వెల్లడించారు. లక్ష్మీపేటలో దళితుల మారణకాండకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ శుక్రవారం జరిగింది. జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి వి.గోపాలకృష్ణ కేసును విచారించారు. ఈ సందర్భంగా కోర్టు బయట పీపీ విలేకరులతో కాసేపు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులైన ఆవు శ్రీనివాసరావు, రౌతు వాసునాయుడు, వాన నారాయణరావు, గంట్యాడ బలరాం, రౌతు బాలకృష్ణ, శాసపు సింహాచల వెంకట సత్యనారాయణనాయుడు సంఘటన సమయంలో తమ విధుల్లో ఉన్నారని నిందితుల పక్షాన న్యాయవాది వాన కృష్ణచంద్ పిటీషన్ దాఖలు చేశారని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి వీరికి ఎటువంటి సంబంధం లేదని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారని చెప్పారు. ఈ విషయమై పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా తమ విధులు నిర్వర్తించి అపీల్ చేశామని, వారంతా ఘటనలో పాల్గొన్నారని దళిత బాధితుల పక్షాన వాదించామని తెలిపారు. దీనిపై హైకోర్టు నియామవళి ప్రకారం జడ్జి గోపాలకృష్ణ మూడు వాయిదాల్లో సుదీర్ఘంగా విచారించి నిందితుల పిటీషన్‌ను డిస్మిస్ చేశారని వెల్లడించారు. వారిపై నేర అభియోగాలను మోపుతూ కోర్టు తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో విశాఖ సీఐడీ విభాగం డీఎస్పీ ఎం.మోహనరావు, పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ, ఎస్ఐ వై.మధుసూదనరావు పాల్గొన్నారు. 28కి కేసు వాయిదా.. లక్ష్మీపేట దళితుల మారణకాండ కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా వేశారు. శుక్రవారం జరిగిన విచారణకు మొత్తం 79 మంది నిందితులకు 68 మంది హాజరుకాగా, 11 మంది గైర్హాజరయ్యారు. ఒకరు మృతి చెందారు. విచారణ అనంతరం జడ్జి వి.గోపాలకృష్ణ కేసును వాయిదా వేసినట్లు వెల్లడించారు. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ, విశాఖ సీఐడీ విభాగం డీఎస్పీ ఎం.మోహనరావులు కోర్టును పరిశీలించారు. సీఐలు, ఎస్ఐలు , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
30కి లక్ష్మీపేట కేసు వాయిదా
వంగర : మండల పరిధిలోని లక్ష్మీపేట మారణకాండ కేసు విచారణ సెప్టెంబర్ 30కి వాయిదా వేశారు. శుక్రవారం లక్ష్మీపేట ప్రత్యేక న్యాయస్థానం జడ్జి వి.గోపాలకష్ణ ఆధ్వర్యంలో నిందితులను విచారించారు. తదుపరి కేసు విచారణ ఈ నెల 30కి వాయిదా వేసినట్లు తెలిపారు. శుక్రవారం నాటి విచారణకు 79 మంది నిందితులకు 75 మంది హాజరయ్యారు. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించారు. రాజాం సీఐ యు.శేఖర్‌బాబు, పలువురు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. -
30కి లక్ష్మీపేట కేసు వాయిదా
వంగర : మండల పరిధిలోని లక్ష్మీపేట మారణకాండ కేసు విచారణ సెప్టెంబర్ 30కి వాయిదా వేశారు. శుక్రవారం లక్ష్మీపేట ప్రత్యేక న్యాయస్థానం జడ్జి వి.గోపాలకష్ణ ఆధ్వర్యంలో నిందితులను విచారించారు. తదుపరి కేసు విచారణ ఈ నెల 30కి వాయిదా వేసినట్లు తెలిపారు. శుక్రవారం నాటి విచారణకు 79 మంది నిందితులకు 75 మంది హాజరయ్యారు. పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షించారు. రాజాం సీఐ యు.శేఖర్‌బాబు, పలువురు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. -
లక్ష్మీపేట ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం
వంగర : లక్ష్మీపేట మారణకాండపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీపేట గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. 2012 జూన్ 12న జరిగిన దళితుల మారణకాండ ఘటనలో మృతి చెందిన మృతుల సమాధుల వద్ద నివాళులర్పించారు. మడ్డువలస ప్రాజెక్టు పరిధిలో మిగులు భూములను పరిశీలించారు. వీధుల్లో పర్యటించి దళితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేవీపీఎస్, లక్ష్మీపేట దళిత పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఘటనలో దళితులను అతి కిరాతకంగా దాడి చేసి చంపారని, అటువంటి దోషులను కఠినంగా శిక్షించాల్సి ఉండగా కోర్టు కేసు విచారణలో తాత్సారం జరుగుతోందని తెలిపారు. ప్రత్యేక కోర్టుకు ఏక కాల న్యాయమూర్తిని నియమించకపోవడంతో కేసు విచారణ ఇష్టారాజ్యంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక కోర్టు విచారణలో జాప్యం జరుగుతోందని, గ్రామంలో పోలీసులు బీసీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే కోర్టు ద్వారా విచారణ వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని, మడ్డువలస ప్రాజెక్టులో మిగులు భూములు దళితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గ్రామంలో పర్యటించినా ఎటువంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. మూడు నెలల్లో దళితుల సమస్యలు పరిష్కరించకపోతే శ్రీకాకుళం పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత ఉద్యమ సంఘాలను సమీకరించి ఉద్యమం చేపడతామని తెలిపారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబునాయుడును కలిసి సమస్యను వివరిస్తామన్నారు. సీఎం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ప్రాజెక్టులో మిగులు భూమిపై నాగళితో దుక్కి చేస్తామని, ఆ తేదీ ఖరారు చేస్తామన్నారు. అనంతరం పలువురు నాయకులు దళితులకు జరిగిన అన్యాయంపై తూర్పారబట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ గొంతెత్తారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి డి.గణేష్, చిత్తిరి గంగులు, డర్రు రాంబాబు, కె.నాగమణి, సీపీఎం, కేవీపీఎస్ నాయకులు పాల్గొన్నారు.