breaking news
L and T mutual fund
-
హెచ్ఎస్బీసీ ఏఎంసీ చేతికి ఎల్అండ్టీ ఎంఎఫ్
ముంబై: మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎల్అండ్టీ మ్యుచువల్ ఫండ్‌ను (ఎల్అండ్టీ ఎంఎఫ్) హెచ్ఎస్బీసీ అసెట్ మేనేజ్మెంట్ (హెచ్ఎస్బీసీ ఏఎంసీ) కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 425 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,192 కోట్లు) వెచ్చించనుంది. ఎల్అండ్టీ ఎంఎఫ్‌లో ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ (ఎల్టీఎఫ్హెచ్) అనుబంధ సంస్థ ఎల్అండ్టీ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ (ఎల్టీఐఎం)కు 100 శాతం వాటాలు ఉన్నాయి. వీటిని విక్రయించేందుకు హెచ్ఎస్బీసీ ఏఎంసీతో ఎల్టీఎఫ్హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా పెంచుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడగలదని హెచ్ఎస్బీసీ ఇండియా సీఈవో హితేంద్ర దవే తెలిపారు. అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రుణ వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన నిధులను సమీకరించుకునే వ్యూహంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎల్టీఎఫ్హెచ్ ఎండీ దీనానాథ్ దుబాషి వివరించారు. హెచ్ఎస్బీసీకి ఇప్పటికే భారత్‌లో అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఉంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి దీని నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ సుమారు రూ. 11,700 కోట్లు. దీని పరిమాణం ఎల్టీఎంఎఫ్తో పోలిస్తే ఆరో వంతు ఉంటుంది. డీల్ అనంతరం హెచ్ఎస్బీసీ ఏఎంసీ దాదాపు రూ. 1 లక్ష కోట్ల ఏయూఎంతో దేశంలోనే 12వ అతి పెద్ద ఫండ్ హౌస్‌గా మారుతుంది. -
ఎల్అండ్టీ ఈక్విటీ ఫండ్‌కు పదేళ్లు...
ముంబై: ఎల్అండ్టీ మ్యూచువల్ ఫండ్‌లో ప్రముఖ ఎల్అండ్టీ ఈక్విటీ ఫండ్ ప్రారంభమై పదేళ్లయ్యింది. భారత్ మార్కెట్లో ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అత్యధిక రాబడిని అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో 2005మేలో ఈక్విటీ ఫండ్ ప్రారంభమయ్యింది. ఈ పదేళ్లలో ఫండ్ దాదాపు 7 లక్షల మంది ఇన్వెస్టర్ల పెట్టుబడులను నిర్వహించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 10 సంవత్సరాలు ఫండ్‌లో ఉన్న ఇన్వెస్టర్లు మంచి ఆర్థిక ఫలితాలు పొందినట్లు వివరించింది. ఉదాహరణకు 2005 మే నెలలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసినవారికి 2015 మే నాటికి ఈ మొత్తం రూ.6.28 లక్షలకు పెరిగినట్లు ఎల్అండ్టీ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కులకర్ణి వివరించారు. చక్రగతిన వార్షిక రిటర్న్ 20 శాతమని తెలిపారు.