మెడ విరిగినా వెనక్కి తగ్గలేదు.. ఒలింపిక్ గోల్డ్‌ను ముద్దాడాడు!
సంకల్పానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిపోయిన అథ్లెట్లలో అమెరికా రెజ్లర్ కర్ట్ ఆంగిల్ (Kurt Angle) ఒకరు. అయితే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజ్లర్‌గా విశేష ఆదరణ పొందిన కర్ట్ ఆంగిల్ జీవితం ఒక ఆదర్శం. డబ్ల్యూడబ్ల్యూఎఫ్(WWF/WWE)లో చీటింగ్ ప్లేయర్‌గా పేరు పొందిన కర్ట్ ఆంగిల్, రెజ్లింగ్‌లో మాత్రం నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు. అందుకే డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌లో కొనసాగినంత కాలం మెడలో అట్లాంటా ఒలింపిక్స్‌లో సాధించిన గోల్డ్ మెడల్‌ను వేసుకునే వచ్చేవాడు కర్ట్ ఆంగిల్.1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కర్ట్ ఆంగిల్ సాధించిన స్వర్ణ పతకం కేవలం విజయం మాత్రమే కాదు.. అసాధారణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం. తీవ్రమైన మెడ గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగి ప్రత్యర్థులను ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్న ఆయన కథ నేటికీ ప్రపంచ క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.అట్లాంటా ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు కర్ట్ ఆంగిల్కు మెడలో తీవ్ర గాయం అయింది. సర్వైకల్ వెన్నెముకలోని C6, C7 వెర్టీబ్రాల వద్ద గాయం కావడంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. సాధారణంగా ఇలాంటి గాయంతో అథ్లెట్ కెరీర్‌కే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ ఒలింపిక్ స్వర్ణమే తన జీవిత లక్ష్యమని భావించిన కర్ట్ ఆంగిల్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తీవ్ర నొప్పిని భరిస్తూనే ప్రత్యేకమైన చికిత్స, కఠిన సాధనతో తిరిగి పోటీలకు సిద్ధమయ్యాడు.1996 జూలై 31న జరిగిన పురుషుల 100 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్లో కర్ట్ ఆంగిల్ ఇరాన్‌కు చెందిన అబ్బాస్ జదిదిని ఎదుర్కొన్నాడు. గాయం ప్రభావం ఉన్నప్పటికీ అసాధారణ పట్టుదలతో పోరాడి 1-0 తేడాతో విజయం సాధించాడు. ఆ విజయంతో ఒలింపిక్ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఆ క్షణం ఆయన వ్యక్తిగత విజయమే కాదు.. పట్టుదల ముందు శారీరక బాధ కూడా ఓడిపోతుందనే సందేశంగా నిలిచిపోయింది.ఆ తర్వాత కర్ట్ ఆంగిల్ ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించాడు. WWEలో అనేక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు గెలుచుకుని అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. తన ప్రసంగాల్లో "I won an Olympic gold medal with a broken freaking neck" అనే వ్యాఖ్యతో ఆయన తన పోరాట గాథను ఎన్నోసార్లు గుర్తు చేశారు.కర్ట్ ఆంగిల్ సాధించిన ఈ ఘనతకు నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. మూడు దశాబ్దాలు గడిచినా ఆయన విజయం ఇప్పటికీ అథ్లెట్లకు స్ఫూర్తిదాయకంగానే నిలిచింది. శరీరం ఎంత బలహీనపడినా, మనసు బలంగా ఉంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చని కర్ట్ ఆంగిల్ తన జీవితంతో నిరూపించాడు. ఒలింపిక్ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం కేవలం గోల్డ్ మెడల్ కాదు.. ఆ స్వర్ణం వెనుక ఉన్న అచంచల సంకల్పం, అపారమైన ధైర్యమే. థాంక్యూ ఆల్ టైమ్ గ్రేట్.. కర్ట్ ఆంగిల్.#OnThisDayInWWE 30 years ago:Kurt Angle wins Olympic gold - with a broken freakin' neck! pic.twitter.com/tUTrYua4Zc— On This Day in WWE (@OTD_in_WWE) July 31, 2026 30 Years Ago Today🏅It’s hard to believe that it’s been three decades since I stood on that podium, proudly winning the Gold Medal against Abbas Jadidi. Coming from humble I grew up a laborer’s son from Dormont Pittsburgh, I never imagined my dreams would ever come true.This… pic.twitter.com/B6rC4of5pA— Kurt Angle (@RealKurtAngle) July 31, 2026On This Day 30 Years Ago:🚨Kurt Angle made his nation proud in the 1996 Summer Olympics by winning an Olympic gold medal in freestyle wrestling, WITH A BROKEN FREAKIN NECK🏆Kurt then went on to have a hall of fame career in the WWE & TNA👏 A true legend in the game. Thank… pic.twitter.com/1ztQ82CI7e— GP TALKS (@GPTALKLAFAMILIA) July 31, 2026 చదవండి: కొత్త లుక్‌లో రోహిత్ శర్మ.. వయసులో పదేళ్లు వెనక్కి!