breaking news
kurlapadu toll gate
-
భారీగా ట్రాఫిక్ జామ్
-
భారీగా ట్రాఫిక్ జామ్
విజయవాడ, హైదరాబాద్ రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆదివారం సాయంత్రం నల్లగొండ జిల్లాలో పలు చోట్ల వేలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. కుర్లపాడు టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జాం కావడంతో చాలా వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగకి ఊళ్లకు వెళ్లిన వారు సెలవులు ముగియడంతో ఈ రోజు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో హైదరాబాద్ కు తిరుగుపయమయ్యారు. భారీ సంఖ్యలో రావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. ట్రాఫిక్ జాం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


