breaking news
kuna venkatesh goud
-
రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత కూన వెంకటేశ్‌కు గాయాలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కూన వెంకటేష్ గౌడ్ ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడ్డారు. షిర్డీకి కారులో బయలుదేరిన ఆయన.. తుల్జాపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. కారు బెలూన్లు తెరుచుకోవడంతో కూన వెంకటేష్ గౌడ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
'అగ్గిపెట్టిలాంటి ఆ పార్టీకి నిలకడలేదు'
హైదరాబాద్ : టీఆర్ఎస్ గూండాయిజాన్ని పెంచి పోషిస్తోందని, అగ్గిపెట్టె లాంటి ఆ పార్టీకి నిలకడలేనిదని టీడీపీ సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జి కూన వెంకటేశ్‌గౌడ్ ఎద్దేవా చేశారు. సనత్‌నగర్‌లోని శుక్రవారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలనా విధానం సరిగా లేదని ఆరోపించారు. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు గతంలో రూ.6 లకు యూనిట్ చొప్పున కరెంటు కొనుగోలు చేస్తే ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12లకు కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపుతోందని విమర్శించారు. కరెంట్ అధిక ధరకు కొనుగోలు చేస్తున్నా... విద్యుత్ కోతలు తప్పడం లేదని, రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం నిలువరించలేకపోతోందన్నారు. టీఆర్ఎస్ నాయకులు కిందిస్థాయి వారిని కూడా వదలకుండా బెదిరింపులకు పాల్పడుతూ గుండాగిరీకి పాల్పడుతున్నారని పరోక్షంగా తలసానిని ఉద్దేశించి అన్నారు. టీడీపీ పార్టీ గుర్తుపై గెలిచిన తలసాని దమ్ముంటే రాజీనామాను ఆమోదించుకుని ఎన్నికలకు రావాలని కూన వెంకటేశ్ గౌడ్ సవాల్ విసిరారు. -
అప్పుడు నా సీటును తలసాని దొంగిలించారు!
-
అప్పుడు నా సీటును తలసాని దొంగిలించారు!
హైదరాబాద్: గతంలో తనకు దక్కాల్సిన సనత్ నగర్ ఎమ్మెల్యే సీటును అప్పటి టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ దొంగిలించారని టీడీపీ నేత కూన వెంకటేశ్ గౌడ్ స్పష్టం చేశారు. నాలుగేళ్ల నుంచి ఆ సీటు కోసం కష్టపడితే తలసాని చాకచక్యంగా దక్కించుకున్నారన్నారు. ఈసారి మాత్రం ఆ సీటు తనదేనని వెంకటేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖేష్ గౌడ్ లేదా? మరెవరు పోటీకి వచ్చినా.. సనత్ నగర్ టికెట్ తనకే దక్కుతుందన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు తనకు సరిగ్గా మాట ఇవ్వలేదని.. అయితే ఈసారి ఆయన నుంచి తనకు హామీ లభించిదన్నారు. దేవేందర్ గౌడ్ కూడా తనకు మద్దతు ఇస్తామని తెలిపారన్నారు. ఇప్పుడు నడుస్తున్నదంతా తప్పుడు ప్రచారమేనన్నారు. ముఖేష్ గౌడ్ తనకు బంధువేనని ఒక ప్రశ్నకు సమాధానంగా వెంకటేశ్ గౌడ్ తెలిపారు.