breaking news
krishaastami
-
కృష్ణాష్టమి తెలిసిందే.. ‘రాధాష్టమి’ ఎంతమందికి తెలుసు?
శ్రీకృష్ణుడి జన్మాష్టమి గురించి మనందరికీ తెలిసిందే. అయితే శ్రీకృష్ణుడికి ప్రియమైన రాధారాణి ప్రకటిత దినమైన రాధా అష్టమి గురించి ఎంతమందికి తెలుసు? భాద్రపద మాసం శుక్లపక్ష అష్టమి తిథిన రాధా అష్టమిని జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని రాధారాణి ప్రకటిత ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది రాధా అష్టమిని నేడు (శనివారం) భక్తిశ్రద్ధలతో పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. రాధారాణి, శ్రీకృష్ణులను పూజించడంతో పాటు ఈ రోజున వ్రత కథను చదవడం లేదా వినడం విశేష ఫలితాలను అందిస్తుందని భక్తులు నమ్ముతారు.అసలు రాధారాణి భూమిపైకి ఎలా వచ్చారు?పౌరాణిక కథనం ప్రకారం.. రాధారాణి గోలోక ధామంలో శ్రీకృష్ణుడికి ప్రియమైన శక్తిగా, మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఒకసారి గోలోకంలో రాధారాణికి శ్రీదాముడనే రాక్షసునికి మధ్య యుద్ధం జరగడంతో.. శ్రీదాముడు ఆమెను భూమిపై జన్మించమని శపించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే దీనికి ప్రతిగా రాధాదేవి కూడా శ్రీదాముడిని శంఖచూడుడనే రాక్షసుడిగా జన్మించమని శపించినట్లు చెబుతారు. ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన సమయంలో మహాలక్ష్మి రాధారాణి రూపంలో భూమిపై ప్రకటితం కావాలని నిర్ణయించుకున్నట్లు పౌరాణిక కథ చెబుతోంది. బ్రజ్ రాజు వృషభాను యజ్ఞం కోసం స్థలాన్ని శుభ్రం చేస్తుండగా యమునా నది ఒడ్డున బంగారు కమలంపై ఓ బాలిక కనిపించిందని, ఆమెను ఇంటికి తీసుకెళ్లి తన కుమార్తెగా పెంచుకున్నారని కథనం. ఆమెనే రాధారాణిగా భావిస్తారు.రాధారాణి కళ్లు ఎప్పుడు తెరిచారు? పూజ ఎలా చేయాలి?రాధారాణి జన్మించినప్పుడు ఆమె కళ్లు మూసుకుని ఉన్నాయని పౌరాణిక కథనం చెబుతోంది. బాలకృష్ణుడు ఆమె ఊయల వద్దకు వచ్చి పాదాలను తాకినప్పుడు రాధారాణి కళ్లు తెరిచి తొలిసారిగా తన ఆరాధ్యుడైన శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారని నమ్ముతారు. రాధా అష్టమి రోజున ఉదయాన్నే స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి. పూజా పీఠంపై ఎరుపు లేదా పసుపు వస్త్రం పరిచి, రాధా–కృష్ణుల విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించాలి. రాధారాణికి పంచామృతంతో అభిషేకం చేసి కొత్త వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించాలి. అనంతరం రాధా అష్టమి వ్రత కథను చదవడం లేదా వినడం చేయాలి. చివరగా హారతిని అందించాలి. ఈ కథను వినడం వల్ల భక్తి భావం పెరిగి, ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని భక్తుల నమ్మకం.ఇదీ చదవండి: పరీక్షలో చాట్‌జీపీటీ వాడి?.. హాస్టల్ గదిలో విగతజీవిగా.. -
25, 26 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
డాబాగార్డెన్స్ : ఈ నెల 25, 26 తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభోవపేతంగా నిర్వహించనున్నట్టు హరేకృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి యదురాజ దాస తెలిపారు. వీజే ఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలు ఆయన వెల్లడించారు. ఎంవీపీ కాలనీ ఆళ్వార్‌దాస్ గ్రౌండ్ వేదికగా జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. భక్తులు హరేకృష్ణ మహామంత్రాన్ని 108 సార్లు ఉచ్ఛరించాలన్న సంకల్పంతో మండపంలోకి ప్రవేశిస్తారని, మండపం లోపల 108 పలకలు కింద అమర్చబడినట్టు తెలిపారు. భక్తులు 108 సార్లు హరే కృష్ణ హరే కృష్ణ మహామంత్రాన్ని 108 పలకల మీద జపించేలా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. 25న ఉదయం అభిషేకం, రాత్రి 10 గంటలకు మహాభిషేకం, 26 రాత్రి 7 గంటలకు 108 రకాల వంటకాలతో నైవేద్యం, రాత్రి 8 గంటలకు వ్యాస పూజ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆ రెండు రోజులు సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు భక్తులకు స్వామి దర్శనం కల్పిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఊయల సేవ, 4 గంటలకు ధూప హారతి, రాత్రి 7 గంటలకు సంధ్య హారతి, అర్ధరాత్రి 12 గంటలకు మహా మంగళ హారతి కార్యక్రమం ఉంటుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 25 సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రొఫెసర్ కె.సరస్వతి విద్యార్థి బృందంచే సంగీత సేవ, 6.15 నుంచి 7.15 గంటల వరకు ద్వారం వెంకట కష్ణ గణేశ త్యాగరాజ్ బృందంచే సంగీత సేవ, 7.30 నుంచి రాత్రి 9 గంటల వరకు బాలకొండలరావు బృందంచే కల్యాణ రాఘవం నత్య సేవ, 26 సాయంత్రం 5 నుంచి 6.45 గంటల వరకు డాక్టర్ మండపాక శారద బృందంచే సంగీత సేవ, 7 నుంచి 8 గంటల వరకు చైతన్యబ్రదర్స్చే సంగీత సేవ ఉంటుందన్నారు. సమావేశంలో చారుగోపాల దాస పాల్గొన్నారు.


