breaking news
kolimikunta
-
సౌదీలో కొలిమికుంట వాసి మృతి
చొప్పదండి: పొట్ట చేతపట్టుకుని సౌదీ అరేబియా వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి డ్రైవర్ ఉద్యోగం కోసం యాభై రోజుల క్రితం విజిట్ వీసాపై సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. పది రోజుల కిందట జరిగిన ఈ సంఘటన కొలిమికుంటలో ఉన్న అతని కుటుంబీకులకు సోమవారం తెలిసింది. -
చెట్టును ఢీ కొన్న లారీ: ముగ్గురు మృతి
చొప్పదండి మండలం కొలిమికుంట వద్ద గత అర్థరాత్రి వేగంగా వెళ్తున్న లారీ చెట్టును ఢీ కొట్టింది. దాంతో లారీ డ్రైవర్, క్లీనర్తోపాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహానదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఆ మూడు మృతదేహలను పోస్ట్మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన ఆ ముగ్గురు వ్యక్తులు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, ఆసిఫాబాద్ ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు వివరించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం వద్ద లారీ - ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 ద్వారా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. అయితే ఆ ఘటనలో మరణించిన ఆ రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.