breaking news
kishna reddy
-
‘ఇది తెలంగాణ ఆడబిడ్డలకు అత్యంత తీవ్రమైన అవమానం’
హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన విదేశీ వనితలకు తెలంగాణ ఆడబిడ్డల చేత కాళ్లు కడిగించడాన్ని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, మన ఆడబిడ్డల అభిమానాన్ని తాకట్టుపెట్టారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ వనితల కాళ్లు కడిగిస్తారా? అంటూ ప్రశ్నించారు కిషన్‌రెడ్డి. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు కిషన్‌రెడ్డి. ‘ప్రపంచదేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెంచాల్సింది పోయి.. వారి ముందు మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టేట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. 72వ మిస్‌వరల్డ్ పోటీల్లో భాగంగా.. కల్చరల్, స్పిరిచువల్ టూర్లో పాల్గొనేందుకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్ప దేవాలయానికి ప్రపంచ అందగత్తెలు వచ్చిన సందర్భంలో.. విదేశీ వనితల కాళ్లను తెలంగాణ మహిళలతో, దళిత, గిరిజన యువతులతో కడిగించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారానికి నిదర్శనం. మహిళా సాధికారతకు, మహిళల ధైర్యసాహసాలకు ప్రతీక అయిన రాణి రుద్రమదేవి ఏలిన గడ్డపై, చారిత్రక రామప్ప ఆలయ ప్రాంగణంలో తెలంగాణ మహిళలను అవమానించడం దురదృష్టకరం.సమ్మక్క, సారలమ్మ పుట్టిన గడ్డపై మహిళలకు అత్యంత తీవ్రమైన అవమానం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. భారతీయులను విదేశీయుల ముందు మోకరిల్లేలా చేయడమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఢిల్లీలోని ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలను సంతృప్తి పరిచేందుకే రాహుల్ గాంధీ.. భారతీయ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కాళ్లు కడిగించారు.‘అతిథి దేవో భవ’ మన విధానం.. కానీ అతిథిని గౌరవించే క్రమంలో మన మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం క్షమార్హం కాదు. విదేశీ అందగత్తెలముందు మన గౌరవాన్ని పెంచేలా వ్యవహరించి ఉంటే బాగుండేది. కానీ మన గౌరవాన్ని దిగజార్చింది. ప్రజల గౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత కానీ.. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఏమాత్రం సమర్థనీయం కాదు.ఇందుకుగానూ.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతోపాటుగా రేవంత్ రెడ్డి.. భారతీయ మహిళలకు, తెలంగాణ మహిళా సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి’ అని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
బీజేపీ విజయ సంకల్ప యాత్ర
-
విజయశాంతి కాంగ్రెస్‌లోనే ఉంటారు..
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి పార్టీ మారుతారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ తెలిపారు. ఆయన బుధవారం విజయశాంతితో భేటీ అనంతరం మాట్లాడుతూ... ‘విజయశాంతికి రాహుల్ గాంధీ, సోనియాగాంధీ అంటే ఎంతో గౌరవం. కరోనా కారణంగా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆమె పార్టీలోనే ఉంటారు. పార్టీ మారుతారనేది ప్రచారం మాత్రమే. విజయశాంతిని మేమంతా ఎంతో గౌరవిస్తాం. కరోనా కారణంగానే కొత్త ఇన్ఛార్జ్ను కలవలేకపోయినట్లు చెప్పారు’ అని అన్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో దాదాపు గంటపాటు భేటీ అయిన విషయం తెలిసిందే. (పాతగూటికి ‘రాములమ్మ’?) విజయశాంతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కుసుమ కుమార్ -
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు పెద్దమొత్తంలో బకాయి పడటంతో ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమవుతోందని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.600 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవటంతో చాలా ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందటం లేదని తెలిపారు. ఈనెల 22 నాటికల్లా బకాయిలు చెల్లించకపోతే సేవలు నిలిపేస్తామని ఆస్పత్రులు హెచ్చరించినట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ సేవలను సరిగ్గా అందేలా చూడాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రచారం కోసం రోజుకో కొత్త పథకాన్ని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీని మాత్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. -
పరిష్కరించకుంటే మేమూ ఆందోళనలోకి
హోంగార్డుల సమస్యలపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: హోంగార్డుల సమస్యలను వారంలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తామూ ఉద్యమంలో భాగస్వాములమై ఆందోళన తీవ్రం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారు. వారి డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని, రెండు రాష్ట్రాల సమస్య కాబట్టి ఈ విషయమై గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లకు లేఖలు రాస్తామన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో 9 వేలమంది హోంగార్డులకు కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలిచ్చారని, అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అర్హతగల వారిని పర్మినెంట్ చేయాలన్నారు. -
బీజేపీ కార్యాలయంలో ఘనంగా జాతీయ వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అగ్రగామిగా నిలబెడుతున్నారన్నారు. బీసీ ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, జాతీయ నేత మురళీధర్ రావు పాల్గొన్నారు.