breaking news
Kensington Palace
-
బుల్లి యువరాజు హత్యకు కుట్ర..
లండన్: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్డన్ ముద్దుల కొడుకు ప్రిన్స్ జార్జ్ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెంది రషీద్ అనే ఉగ్రవాది ఈ హత్యకు కుట్ర చేశాడు. దీంతో రషీదును అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తాను బుల్లి యువరాజు జార్జ్ హత్యకు కుట్ర చేసినట్టు రషీదు కోర్టులో అంగీకరించాడు. దీంతో అతనికి 25 ఏళ్ల శిక్షను విధించారు. లండన్‌లోని వూల్విచ్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పును వెలవరించారు. టెలిగ్రామ్ ద్వారా ప్రిన్స్ జార్జ్‌ను చంపేందుకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. తన ప్లాన్ విజయవంతం అయితే ఐఎస్ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు సిరియాకు పారిపోవాలనే ప్లాన్ తనకు ఉందని విచారణ సమయంలో రషీద్ కోర్టుకు తెలిపారు. కాగా, జార్జ్‌ను హత్య చేస్తామంటూ గత అక్టోబర్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సభ్యులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బ్రిటన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. జార్జ్ ఫొటోతో సహా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఉగ్రవాదులు, చంపేస్తామని హెచ్చరించారు. అరబిక్ భాషలో రాసిన ఈ పోస్టులో ‘యుద్ధమనేది వస్తే తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని తెలిపారు. యువరాజు వెళ్తున్న స్కూల్ వద్ద భద్రత అంత కట్టుదిట్టంగా లేదని నిఘా వర్గాలు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
మగ బిడ్డకు జన్మనిచ్చిన యువరాణి కేట్
లండన్: బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, యువరాణి కేట్ మిడిల్టన్ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో సోమవారం ఉదయం మగ బిడ్డ పుట్టినట్లు ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. తల్లీ, బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపాయి. ఇప్పటికే రాజ దంపతులకు నాలుగేళ్ల రాకుమారుడు జార్జ్, రెండేళ్ల రాకుమారి చార్లెట్లు ఉన్నారు. ఇప్పుడు పుట్టిన రాకుమారుడి పేరు ఇంకా ఖరారు చేయలేదు. బ్రిటిష్ సింహాసనం అధిష్టించే వారిలో నూతన రాకుమారుడు ఐదో వారసుడు. -
రాజకుటుంబంలో బాబు పుట్టాడోచ్!
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి మరో బుల్లి వారసుడు వచ్చాడు. ప్రిన్స్ విలియమ్ సతీమణి కేట్ మిడిల్టన్ సోమవారం పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. లండన్‌లోని సెయింట్ మెరీ ఆస్పత్రిలో కేట్ మూడో బిడ్డను ప్రసవించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని రాయల్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిన్స్, కేట్ దంపతులకు బాబు జార్జ్, పాప చార్లెట్.. ఉన్నారు. మూడో బిడ్డను ప్రసవించే సమయంలో కేట్ పక్కన ప్రిన్స్ కూడా ఉన్నారని మీడియా తెలిపింది. కేట్ తాజాగా జన్మనిచ్చిన శిశువు బ్రిటన్ రాణి క్విన్ ఎలిజబేత్ ఆరో మునిమనవడు కాగా.. బ్రిటన్ సింహాసనం అధిరోహించబోయేవారిలో ఐదో వ్యక్తిగా ఉండనున్నాడు. -
నలుపు.. తెలుపు.. నేను
మెఘన్ 2011లో టెలివిజన్ సిరీస్ నిర్మాత ట్రెవర్ ఇంజెల్సన్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే విడాకులతో ఆ ఇద్దరూ ఆ బంధం నుంచి బయటకు వచ్చారు. 1992 అనుకుంటా... ఎలిమెంటరీ స్కూల్ అమ్మాయి. పదకొండేళ్లుంటాయి. స్కూల్ ఇంటర్వెల్ బ్రేక్‌లో టీవీ చూస్తోంది. కమర్షియల్ వస్తోంది ఆ టైమ్‌కి. రకరకాల వర్గాల్లోని ఆడవాళ్లు అంట్లుతోమడానికి గిన్నెలతో కుస్తీ పడుతున్నారు. అదే ట్యాగ్‌లైన్ ఆ యాడ్ కింద.. ‘‘అమెరికాలోని ఆడవాళ్లంతా జిడ్డోడుతున్న పాత్రలతో ఫైటింగ్ చేస్తున్నారు’’ అని! ఆ యాడే చూస్తున్న ఆమె క్లాస్మేట్స్ అబ్బాయిలిద్దరూ ‘‘ఆడవాళ్లు అంట్లతో కాక దేనితో కుస్తీ పడ్తారు?’’ అంటూ నవ్వారు హేళనగా. అమ్మాయి షాక్ అయింది. కోపమొచ్చింది. బాధా కలిగింది. అంట్లు తోమడం ఆడవాళ్ల పనేనా? ప్రశ్న ఆ చిన్న మెదడులో. మధ్యాహ్నం ఇంటికెళ్లే సరికి అది రొదలా మారింది. ఇంట్లో... నాన్నతో చెప్పింది పొద్దున తను చూసిన టీవీ కమర్షియల్.. క్లాస్మేట్స్ పాస్ చేసిన కామెంట్స్ గురించి. అంట్లు ఆడవాళ్లు మాత్రమే ఎందుకు తోమాలి? ఆ కమర్షియల్‌ను ఎందుకలా తీశారు? అన్నం అందరం తింటున్నప్పుడు అంట్లు తోమే బాధ్యతను కూడా అందరూ షేర్ చేసుకోవాలి కదా.. అది కేవలం ఆడవాళ్ల పనే అన్నట్లుగా ఎందుకు చూపిస్తున్నారు? అలా ప్రమోట్ చేయబట్టే కదా నా క్లాస్మేట్స్ ఆడవాళ్లను అంత తేలికగా చూశారు? ఎందుకు నాన్నా ఇలా? దీన్ని మార్చాలి.. ఏదైనా చేయాలి?’’ అంది చిన్న పిడికిలిని అంతే చిన్న అరచేతిలో నూరుతూ! తన బుజ్జి కూతురి గొప్ప ఆలోచనకు, ఆరాటానికి ముచ్చటపడ్డాడు. గర్వపడ్డాడు తండ్రి. ‘‘ఏదైనా చెయ్ మరి! పెద్దవాళ్లకు ఉత్తరం రాయు’’అని సలహా ఇచ్చాడు. ‘‘ రాస్తాను డాడ్’’ అంటూ తండ్రి మెడను రెండుచేతులతో చుట్టేసింది. ఆ క్షణం నుంచే పెద్దవాళ్లు ఎవరా అని ఆలోచించసాగింది అమ్మాయి. ఆ సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్ బిల్‌క్లింటన్. వెంటనే ఆ పిల్లకు ఫస్ట్‌లేడీ హిల్లరీ క్లింటన్ గుర్తొచ్చింది. అప్పుడు కిడ్స్ న్యూస్ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్న లిండా ఎల్లర్బీ, పవర్‌హౌజ్ అటార్ని గ్లోరియా ఆల్రెడ్లూ మనసులో మెదిలారు. ఆ ముగ్గురితోపాటు ఆ కమర్షియల్‌లో కనిపించిన అంట్లుతోమే లిక్విడ్ తయారు చేసే కంపెనీకీ రాసింది. నెల తర్వాత.. మళ్లీ ఆ కమర్షియల్ ప్రసారం అయింది. అయితే ఈసారి.. ‘‘అమెరికా ప్రజలంతా జిడ్డు, జిగురోడుతున్న అంట్లగిన్నెలతో కుస్తీపడుతున్నారు’’ అనే ట్యాగ్‌లైన్‌తో! పదకొండేళ్ల అమ్మాయి మొహంలో నవ్వు! విజయంతో కూడిన నవ్వు! కిడ్స్ న్యూస్ ప్రోగ్రామ్ చానల్ యాంకర్ ఆ చిన్నారి ఇంటి తలుపు తట్టింది చేతిలో మైక్, కెమెరా క్య్రూతో. ఆ పిల్ల ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం! ఆ అమ్మాయి.. హిల్లరీ, లిండా, గ్లోరియా, అంట్లుతోమే లిక్విడ్ సోప్ తయారుదారు ప్రాక్టర్ అండ్ గ్రాంబుల్కి.. థాంక్స్ చెప్పుకుంది! సమానత్వం అంటే ఓ మాట కాదు. స్త్రీ,పురుషులు ఇద్దరూ కలిసి సాధించే చేత! ఇది చర్చలకే పరిమితం కాకూడదు. కార్యాచరణకు రావాలి. ఓ పదకొండేళ్ల అమ్మాయి చేయగలిగింది ప్రపంచంలోని ఇంతమంది ప్రజలు చేయలేరా? ఈ భూమ్మీద స్త్రీ, పురుషులిద్దరూ సమానమనే ఆలోచనాధోరణిని అలవర్చుకోలేరా? సమానత్వం మీద మాటలు ఆపి యాక్షన్‌లోకి దిగుదాం అని ప్రపంచాన్ని కోరుతోంది నాటి పదకొండేళ్ల పిల్ల.. నేటి 36 ఏళ్ల యువతిగా! ఆమె... టెలివిజన్ నటి.. బ్రిటిష్ యువరాజు హ్యారీకి కాబోయే సతీమణి.. మెఘన్ మార్కల్! మెఘన్ బయోగ్రఫీ.. మెఘన్ మార్కల్ పుట్టిపెరిగింది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, లాస్ఏంజెల్స్లో. తల్లి డోరియా.. ఆఫ్రికన్ అమెరికన్. క్లినికల్ థెరపిస్ట్, యోగా ఇన్స్ట్రక్టర్. తండ్రి టామ్..తెల్లజాతీయుడు. సినిమాటోగ్రాఫర్. టామ్ ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్లో ఉన్నప్పుడు డోరియాను చూసి ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరి ప్రతిరూపంగా ఉంటుంది మెఘన్. తన పదకొండేళ్ల వయసులోనే జెండర్ ఇన్ ఈక్వాలిటీ మీద స్పందించి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కంపెనీ కమర్షియల్ యాడ్‌ను, ట్యాగ్‌లైన్‌నూ మార్చేసి అమెరికా దృష్టిని ఆకర్షించింది. అలా బాల్యంనుంచే పోరాటస్ఫూర్తితో ఉన్న మెఘన్ నార్త్‌వెస్ట్రన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్లో థియేటర్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో గ్రాడ్యూయేషన్ చేసింది. టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. జనరల్ హాస్పిటల్ అనే షోలో గెస్ట్‌రోల్‌తో బుల్లితెరంగేట్రం చేసింది. కట్స్, ది వార్ ఎట్ హోమ్, ఎన్వై అండ్ 90210 వంటి సిరీస్‌లో నటించింది. సూట్స్ అనే సిరీస్‌లో రాచెల్ జేన్‌తో ప్రపచమంతా సుపరిచితమైంది. గెట్ హిమ్ టు ద గ్రీక్, హారిబుల్ బాసెస్, యాంటీ సోషల్ వంటి సినిమాల్లోనూ నటించింది. బ్లాక్ అండ్ వైట్.. తల్లి బ్లాక్, తండ్రి వైట్ కావడం, సంప్రదాయవాదులున్న చోట బాల్యం గడవడం వల్ల ఆ వివక్షను చాలానే ఎదుర్కొంది మెఘన్. అది నటనా రంగంలోకి అడుగుపెట్టాక కూడా వెంటాడింది. అయితే ఎక్కడా తన ఐడెంటీటీ కల్పోలేదు. దీనికి కారణం చిన్నప్పుడు తన తండ్రి ఇచ్చిన ధైర్యమే అంటుంది ఆమె. సెవెంత్గ్రేడ్లో ఉన్నప్పుడు ఒకసారి.. ఇంగ్లిష్ క్లాస్‌లో తప్పక జవాబు చెప్పాల్సిన సెషన్ జరుగుతోంది. టీచర్ ఓ కాగితం ఇచ్చింది. విద్యార్థుల వివరాలను ఆ కాగితంలోని కాలమ్స్‌ను అనుసరించి నింపాలి. అందులో నలుపు, తెలుపు, లాటిన్ అమెరికన్, ఏషియన్ అని విద్యార్థుల గుర్తింపును సూచించే గడి కూడా ఉంది. ఆ నాలిగింట్లో పిల్లలు తాము ఏ ఉనికికి చెందిన వారైతే ఆ గడి దగ్గర టిక్ పెట్టాలి. మెఘన్ అన్నీ వివరాలు నింపి ఆ కాలమ్ దగ్గర ఆగిపోయింది. తల్లిలాంటి ఉంగరాల జుత్తు, తండ్రిలాంటి పాలిపోయిన తెలుపు ఒంటి రంగుతో ఉన్న తను ఆ మిశ్రమాన్ని ఏ గడిలో పెట్టాలో తెలియక ఏమీరాయకుండా లాగే ఉండిపోయింది. మెఘన్ అవస్థ గమనించిన టీచర్.. తెల్లగా ఉన్నావు కాబట్టి వైట్ దగ్గర టిక్ పెట్టు అని సలహా ఇచ్చింది. మరి అమ్మ పోలికలూ ఉన్నాయి కదా! వైట్‌ను తన ఉనికిగా చెప్పుకోవడానికి ఆ పిల్ల మనసు అంగీకరించలేదు. దాంతో ఆ కాలమ్‌ను ఖాళీగా వదిలేసింది. దిగులు మొహంతో ఇంటికెళ్లింది. తండ్రి అడిగాడు ఏమైంది అని. చెప్పింది. ఈసారి అలాంటి సంకటం వస్తే.. సందేహపడకుండా.. నీ సొంత ఐడెంటీనే చెప్పు అన్నాడు దగ్గరకు తీసుకొని. ఆ మాటంటున్నప్పుడు తన కూతురి చిన్నమెదడు ఎంత అయోమయాన్ని అనుభవించిందో అర్థం చేసుకున్నాడు. అది సృష్టించిన వ్యవస్థ పట్ల కోపం అతని మొహాన్ని ఎర్రబర్చడం ఆ బిడ్డ దృష్టిలో పడకపోలేదు. సొంత ఐడెంటిటీ గురించి తండ్రి చెప్పిన మాట ఆ రోజు నుంచి మైండ్‌లో అచ్చేసుకుంది. జ్ఞానాన్ని మించిన శక్తి లేదు.. సాధికారతను మించిన ఐడెంటిటీ లేదని తెలుసుకుంది. తర్వాత సాధికారతనే తన గుర్తింపుగా మార్చుకుంది మెఘన్.అందుకే ‘నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే వివరం చెప్పాల్సి వస్తే... స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ మిక్స్డ్ రేస్ ఉమన్’’ అని గర్వంగా చెప్తాను అంటుంది. నటన నుంచి రచన దాకా.. మెఘన్.. తన తల్లిలా యోగానిపుణరాలు. మంచి కుక్. ఎల్లే యూకే మ్యాగజైన్‌కు వ్యాసాలూ రాస్తుంది. తన లైఫ్‌స్టయిల్ బ్రాండ్ అయిన ‘ది టిగ్’కు ఎడిటర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించింది. సంఘసేవిక. యూఎన్ విమెన్స్ అడ్వకేట్. వరల్డ్ విజన్ కెనడాకు గ్లోబల్ అంబాసిడర్. కాలీగ్రాఫర్ కూడా. నటనలోకి వచ్చేముందు కాలిగ్రఫే ఆమెకు ఆదాయమార్గం. వెడ్డింగ్ ఇన్విటేషన్స్ రాసేది. జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి యూఎన్ఓతో కలిసి జెండర్ ఈక్వాలిటీ మీద ఎంతో కృషి చేసింది. పని పట్ల ఆమెకున్న అంకితభావానికి, నిబద్ధతకు అదే ప్రతీక. 2015, ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు మెఘన్ ప్రసంగం ప్రేక్షకులతో సహా యూఎన్ సెక్రటరీ జెనరల్ బాన్ కీ మూన్నూ అమితంగా ఆకట్టుకుంది. ఆయనతో సహా ఆ సభంతా ఇచ్చిన స్టాడింగ్ ఒవేషనే అందుకు నిదర్శనం. ప్రిన్స్ హ్యారీతో.. కెనడాలోని టొరంటోలో.. ఇన్విక్టస్ గేమ్స్ జరుగుతున్నాయి. హాజరుకావడానికి వచ్చాడు ప్రిన్స్ హ్యారీ. మెఘన్ నటించిన ‘సూట్స్’ షూటింగ్ అయిందీ అక్కడే. అలా ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. డేటింగ్ స్టార్ట్ అయింది. ప్రేమ ఫిక్స్ అయింది. వీరి రొమాన్స్ ఆన్లైన్లో షికారూ చేసింది. 2017, నవంబర్ తొలినాళ్లలో తమ నిశ్చితార్థం జరిగిపోయినట్లు’ నవంబర్ నెల ఆఖరున ప్రకటించారు ప్రిన్స్ హ్యారీ, మెఘన్ మార్కల్. ఆ తర్వాత కొన్ని వారాలకు.. ‘‘2018, మే 19న ప్రిన్స్ హ్యారీకి, మెఘన్ మార్కల్‌కు వివాహం జరగనున్నట్టు కెన్సింగ్టన్ ప్యాలేస్ అనౌన్స్ చేసింది. విండ్సర్ కేసిల్లోని సెయింట్ జార్జెస్ చాపెల్ ఈ పెళ్లికి వేదికకానుంది. ‘‘రెఫ్యూజీ క్యాంప్స్ నుంచి రెడ్ కార్పెట్‌కి షిఫ్ట్ అయింది నా జీవితం. ఈ రెండు దశలనూ గౌరవిస్తాను. ఎందుకంటే ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. ఈ రెండూ నాకు ముఖ్యమే. నిజానికి అవసరం కూడా!’’ అంటుంది స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ మిక్స్డ్ రేస్ ఉమన్ మెఘన్ మార్కల్. – శరాది మేఘన్ మార్కల్ -
మళ్లీ తండ్రి కాబోతున్న ప్రిన్స్
లండన్: బ్రిటన్ యువరాజు విలియం మూడోసారి తండ్రి కాబోతున్నారు. విలియం, క్యాథరిన్ మిడిల్టన్ దంపతులకు ఇప్పటికే ప్రిన్స్ జార్జి(4), ప్రిన్సెస్ చార్లెట్(2) లనే ఇద్దరు సంతానం ఉన్నారు. డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి మూడో సారి తల్లి కాబోతున్నారని కెన్సింగ్టన్ ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. రాజకుటుంబమంతా ఈ వార్తతో చాలా ఆనందంతో ఉందని తెలిపింది. ప్రస్తుతం మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్న కేట్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నట్లు ప్యాలెస్ వర్గాలు వివరించాయి. కాగా కేట్ 2013 జూలైలో తొలి బిడ్డ ప్రిన్స్ జార్జికి జన్మనిచ్చారు. 2015 మే లో రెండవ సంతానంగా ప్రిన్సెస్ చార్లెట్ ఎలిజబెత్ డయానా పుట్టింది. -
'గే' మ్యాగజైన్ కవర్ పేజీపై యువరాజు
లండన్: బ్రిటన్ చరిత్రలో తొలిసారిగా 'గే' (స్వలింగ సంపర్కులు) మ్యాగజైన్ కవర్ పేజీపై యువరాజు ఫొటో దర్శనమివ్వనుంది. ఎల్జీబీటీ ప్రజలను వివక్షకు గురిచేయరాదని పేర్కొంటూ వారికి మద్ధతుగా నిలిచేందుకు ప్రిన్స్ విలియం ఈ నిర్ణయం తీసుకున్నారని మ్యాగజైన్ యాజమాన్యం వివరించింది. ఇటీవల అమెరికాలోని ఆర్లెండో ‘గే’ క్లబ్లో ఉన్మాది ఒమర్ మతీన్కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా మృతిచెందగా, మరో 53 మందికి గాయాలయ్యాయి. సెక్సువాలిటీ విషయంలో ఏ వ్యక్తిని తక్కువగా చేసి చూడరాదని మ్యాగజైన్ ఎడిటర్ మాథ్యూ అన్నారు. ఎల్జీబీటీ వ్యక్తులను కెన్సింగ్గటన్ ప్యాలెస్ లోకి ఆహ్వానించి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఏ వ్యక్తి కూడా ఉద్దేశపూర్వకంగా సెక్సువాలిటీని నిర్ణయించుకోరని, ఈ విషయంలో ఎవరినీ తప్పు చేసిన వారిగా చూడవద్దని ప్రిన్స్ విలియం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎల్జీబీటీ వ్యక్తులకు మద్ధుతు తెలిపేందుకు తాను గే మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించబోతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రిన్స్ విలియం ఫోజివ్వగా ఫొటోగ్రాఫర్ లీగ్ కీలీ కెమెరా క్లిక్ మనిపించారు. అన్ని వర్గాల వ్యక్తులను తాను కలిశానని, ప్రతి ఒక్కరూ ఎంతో ధైర్యంగా తమ పనిలో ముందుకెళ్లాలని ధృడ సంకల్పంతో ఉన్నారని విలియం అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తులను సమాజంలో గౌరవం ఇవ్వాలని, వారి అశావహ ధృక్పథాన్ని అందరూ గ్రహించాలని పేర్కొన్నారు. -
ఆకట్టుకుంటున్న బుజ్జీ యువరాణి ఫొటోలు!
లండన్: ఆరునెలల చిన్నారి బ్రిటన్ యువరాణి చార్లెట్ ఫొటోలు అందరినీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బ్రిటన్ రాజవంశ సిహాసనం అధిష్టించబోయే నాలుగోతరం యువరాణి అయిన చార్లెట్ ఫొటోలను ఆమె తల్లి కేట్ మిడిల్టన్ తీశారు. ఈ ఫొటోలను కేట్, ప్రిన్స్ విలియమ్ దంపతులు కెన్సింగ్టన్ ప్యాలెస్ ట్విట్టర్ పేజీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు ఈ ఫొటోలు ఆనందం కలిగిస్తాయని ఆకాంక్షించారు. నార్ఫోక్లోని అన్మెర్ రాజభవనంలో నవంబర్‌లో చార్లెట్ ఫొటోలను కేట్ స్వయంగా తీశారు. కేట్ పేరొందిన ఫొటోగ్రాఫర్. ఆమె గతంలో తన ఇద్దరు పిల్లలైన రెండేళ్ల ప్రిన్స్ జార్జ్, చార్లెట్ ఫొటోలను తీశారు. గత మే 2న కేట్, ప్రిన్స్ విలియమ్స్ దంపతులకు చార్లెట్ జన్మించింది. The Duke and Duchess hope everyone enjoys these new photos of Princess Charlotte as much as they do. pic.twitter.com/ylZ7VvOuIY — Kensington Palace (@KensingtonRoyal) November 29, 2015 -
సెప్టెంబర్ 6, 1997 ఆరని కన్నీటి బొట్టు!
ఆ నేడు డయానా అంటే.. సుందరరూపమే కాదు... చల్లటి దయాగుణం కూడా. ‘డయానా చనిపోయింది’ అనే వార్త ఒక దేశానికి సంబంధించిన విషాదం మాత్రమే కాలేకపోయింది... అది విశ్వవ్యాప్త విషాదంగా మారిపోయింది. బాగా తెలిసిన అమ్మాయి చనిపోయింది అనే భావనేగానీ, ‘అక్కడెక్కడో బ్రిటన్ యువరాణి చనిపోయిందట’ అని ఎవరూ అనుకోలేదు. ఈరోజు... లండన్‌లో డయానా అంత్యక్రియల వెంట నడిచింది ప్రపంచం. ఎక్కడికక్కడ కన్నీటి వర్షం. వెక్కిళ్ల శబ్దాలు వినబడొద్దు అన్నట్లుగా మోగుతున్న టెనోర్ గంట. ‘ఈ రాచరికపు ఆడంబరం వద్దు’ అన్నట్లుగా కెన్సింగ్టన్ ప్యాలెస్ వైపు చూస్తున్న డయాన నిర్జీవ నేత్రాలు! ‘అందరితో పాటు గుంపులో నడుస్తున్నాను నేను... కానీ ఒంటరిగా’ డయానాకు ఇష్టమై ఈ కవితావాక్యం వెస్ట్‌మినిస్టర్ ఎబెకు వెళ్లే అన్ని దారులలో కన్నీటి శబ్దాల మధ్య వినిపిస్తూనే ఉంది... ఇప్పటికీ!