-
‘బికినీ కిల్లర్’కు ఓపెన్‌హార్ట్ సర్జరీ
ఖాట్మండూ: అంతర్జాతీయ నేరస్తుడు ఛార్లెస్ శోభరాజ్‌కు ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయించేందుకు నేపాల్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వివిధ నేరాల కింద గత పన్నెండేళ్లుగా అతడు ఖాట్మండూ శివారులో ఉన్న సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. శోభరాజ్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో వైద్యుల బృందం పరీక్షలు జరిపి ఆపరేషన్ అవసరమని స్పష్టం చేసింది. ఖాట్మండూలోని షాహిద్ గంగాలాల్ ఆస్పత్రిలో అతడికి సోమవారం చికిత్స చేయనున్నారు. ఇందుకు అయ్యే ఖర్చునంతా నేపాలీ ప్రభుత్వం భరించనుందని వైద్యులు తెలిపారు. భారత, వియత్నాం దంపతులకు పుట్టిన ఛార్లెస్ శోభరాజ్(73) ఫ్రెంచి పౌరుడు. బికినీ కిల్లర్‌గా గుర్తింపు పొందిన 1970 దశకంలో ఇతడు సుమారు 20 మందిని హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. 1975లో జరిగిన అమెరికా దేశస్థురాలు కోనీ జో బ్రొన్జిక్ హత్య కేసులో ఖాట్మండూ జైలులో 2003 నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు. నేపాల్ జీవిత ఖైదు 20 ఏళ్లు ఉంటుంది. ఇతడిపై మరిన్ని కేసులుండటంతో ఖైదు ముగిసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇతడికి స్వేచ్ఛ లభించే అవకాశాలు లేవు. ఇతడి చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువమంది విదేశీ యాత్రికులే కావటం గమనార్హం. -
చార్లెస్ శోభరాజ్ ఆందోళన
కట్మాండ్: ఉగ్రవాద సంస్థలకు తాను ఆయుధాలు సరఫరా చేశానని గతంలోనే ప్రకటించిన సీరియల్ బికినీ కిల్లర్, అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజ్ ఆందోళన చెందుతున్నాడు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శోభరాజ్‌కు ఇటీవల గుండెపోటు వచ్చింది. ఈ శనివారం శోభరాజ్‌కు కట్మాండులోని గంగాలాల్ హార్ట్ సెంటర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించనున్నారు. అయితే ఆపరేషన్ తర్వాత తాను బతికే ఉంటానన్న నమ్మకం లేదని.. ఇలాగా తాను కొందరికి ఫోన్ చేయాలని అందుకు పర్మిషన్ ఇవ్వాలని జైలు అధికారులను శోభరాజ్ కోరాడు. శోభరాజ్ గుండెలో ఓ వాల్వ్ పూర్తిగా దెబ్బతిందని త్వరగా వైద్యం చేయాలని డాక్టర్లు అతడికి సూచించారు. అయితే తన సొంత దేశమైన ఫ్రాన్స్ లోని ప్యారిస్‌లో సర్జరీకి పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా అవకాశం ఇవ్వలేదు. ఫ్రాన్స్‌లో అయితే ఆపరేషన్ రిస్క్ 1 శాతం ఉండగా, కట్మాండులో మాత్రం రిస్క్ 3-5శాతం ఉంటుంది. దీంతో తన ప్రాణాలు పోతాయన్న భయం శోభరాజ్‌కు పట్టుకుందని ఆయనకు గత ఐదేళ్లుగా ట్రీట్మెంట్ ఇస్తున్న సీనియర్ డాక్టర్ తెలిపారు. ఓ వాల్వ్ దెబ్బతిన్నది. జూన్ 10న సర్జరీ నిర్వహిస్తాం. అతడి పరిస్థితి నార్మల్‌గానే ఉంది కానీ అతడిలో ప్రాణభయం పెరిగిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు. '2016 చివరలో జైలు నుంచి విడుదలై ఫ్రాన్స్ వెళ్లి సర్జరీ చేయించుకోవాలి అనుకున్నాను. నేపాల్ సుప్రీంకోర్టులో ఇటీవల విచారణకు హాజరు కాగా.. నేపాల్ లోనే నువ్వు చావడం ఖాయమని నాపై కేసు వేసిన వ్యక్తి బెదిరించాడు. దీంతో ప్యారిస్‌లో సర్జరీ చేయించుకునేందుకు పర్మిషన్ ఇప్పించాలని ఫ్రాన్స్ ఎంబసీకి నేను రాశాను. ఆరోగ్యం బాగాలేని కారణంగా త్వరగా విడుదల చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తాను. కట్మాండు నుంచి ప్యారిస్ వెళ్లి నేను చేయాల్సిన పనులు పూర్తిచేయాలని భావిస్తున్నానని' చార్లెస్ శోభరాజ్ చెప్పినట్లు సమాచారం. ఆగ్నేయ ఆసియా కేంద్రంగా దాదాపు డజనుకు పైగా దేశాలకు చెందిన మహిళలను అతి క్రూరంగా హత్యచేయడంతోపాటు మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సరఫరా తదితర నేరాల్లో ఆరితేరిన శోభరాజ్.. న్యూఢిల్లీలోని తీహార్ జైల్లో సెక్యూరిటీ సిబ్బందికి మత్తు మందు ఇచ్చి 1986లో పరారయ్యాడు. ఆపై అమెరికా మహిళ కొనీ జో బ్రాజించ్ హత్య కేసులో కాట్మండు జైలులో సుమారు 20 ఏళ్లు శిక్ష అనుభవించాడు. 2003లో ఓ క్యాసినో నుంచి తప్పించుకునే క్రమంలో కట్మాండు పోలీసులకు చిక్కి ప్రస్తుతం అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement