breaking news
kathi narasimha reddy
-
ఎమ్మెల్సీ కత్తికి అభినందనలు
కడప ఎడ్యుకేషన్: పశ్చిమ రాయలసీమ శాసనమండలి సభ్యుడిగా విజయం సాధించిన ఉద్యమనేత, సంఘనాయకుడు కత్తి నరసింహారెడ్డికి యూటీఎఫ్ నేతలు అభినందనలు తెలిపారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా,అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్‌కుమార్, సుబ్బరాజు , ఎస్టీయూ జిల్లా నాయకులు రఘునాథరెడ్డి, రాష్ట్రనాయకులు జయరామయ్య ప్రసంగించారు. జిల్లా హెచ్ఎం సంఘం అధ్యక్షుడు రామసుబ్బరాజు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు జాబీర్, రవికుమార్, నరసింహారావు, గంగన్న ఎస్టీయూ రాష్ట్ర నాయకులు సురేష్‌బాబు, రామకృష్ణారెడ్డి, జిల్లా నాయకులు ఇలియాస్‌బాషా, బీవీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కత్తినరసింహారెడ్డి వారికి ధన్యవాదాలు తెలిపారు. -
తల్లిదండ్రులూ హెల్త్‌కార్డుకు అర్హులే: ఎస్టీయూ
సాక్షి, హైదరాబాద్: ప్రీమియం చెల్లించే మహిళా టీచర్లు, ఉద్యోగులపై ఆధాపడిన వారి తల్లి, తండ్రి హెల్త్ కార్డుల పరిధిలోకి వస్తారని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చినట్టు ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నర్సింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 5 నుంచి కుటుంబం మొత్తానికి కాకుండా సభ్యులకు విడివిడిగా కార్డులు ఇవ్వడానికి, నమోదు గడువు పొడిగించడానికి అంగీకరించారని పేర్కొన్నారు.