-
వాషింగ్‌పౌడర్ నిర్మా.. వెనుక పెను విషాదం
చనిపోయిన కూతురి జ్ఞాపకార్థం ఓ తండ్రి చేసిన ప్రయత్నం నలభై వేల కోట్ల విలువైన కంపెనీగా రూపుదిద్దుకుంది. ఇంతకీ ఆ పాప అసలు పేరు నిరుపమ.. ముద్దు పేరు నిర్మా... ఆమె తండ్రి పేరు కర్సన్భాయ్ పటేల్. సాక్షి, వెబ్‌డెస్క్: ప్రభుత్వ ఉద్యోగిగా మంచి జీతం, చదువుకు తగ్గట్టు ఓ చిన్న వ్యాపారం. చీకుచింత లేకుండా సాగిపోతున్న కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. కారు ప్రమాదం రూపంలో కన్న తండ్రికి కూతురిని దూరం చేసింది. అయితే కూతురి పేరు చిరస్థాయిగా నిలిచి పోయేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం ప్రపంచ రికార్డుకు కారణమైంది. నలభై వేల కోట్ల విలువైన కంపెనీ స్థాపనకు మూలమైంది. పద్నాలుగు వేలమందికి ఉపాధిని కల్పిస్తోంది. ఇంటి వెనుక షెడ్డులో రసాయన శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గుజరాత్ రాష్ట్ర మైనింగ్‌శాఖలో ఉద్యోగిగా కర్సన్భాయ్ పటేల్ చేరాడు. అయితే బుర్రంతా రసాయన శాస్త్రంతో నిండిపోవడంతో ఊరికే ఉండలేకపోయాడు. ఎప్పుడూ రసాయనాలతో కుస్తీ పడుతుండే వాడు. ఆ క్రమంలోనే 1969లో సోడా యాష్కి మరికొన్ని కెమికల్స్ కలిపితే మాసిన బట్టలను తళతళ మెరిసేలా చేయగలిగే పౌడర్ రూపుదిద్దుకుంది. ఇంటి వెనుకాల షెడ్డులోనే డిటర్జెంట్ పౌడర్ తయారీలో తలమునకలైపోయేవాడు కర్సన్భాయ్. ఎప్పుడైనా పని నుంచి విరామం దొరికితే కూతురు నిరుపమతో ఆటపాటలే అతని ప్రపంచం. ఊహించని విషాదం ఓవైపు గవర్నమెంటు ఉద్యోగం, మరోవైపు కెమికల్ ఇంజనీరుగా సరికొత్త డిటర్జెంట్ పౌడర్ ఆవిష్కరణ ... ముద్దులొలికే కూతురు... ఇలా సాఫీగా సాగిపోతున్న కర్సన్భాయ్ జీవితంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆయన ముద్దుల కూతురు నిరుపమ కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఒక్కసారిగా ఆయన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. నిర్మాకు శ్రీకారం ఓవైపు తనలోని ప్రతిభతో ఎంట్రప్యూనర్‌గా ఎదగాలన్న తపన, మరోవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు దూరమైందన్న వేదన కర్సన్‌భాయ్‌ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు తనను చుట్టుముట్టిన రెండు ఆలోచనలను ఏకం చేసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన డిటర్జెంట్ పౌడర్‌కి తన ముద్దుల కూతురు నిరుపమ ముద్దు పేరైన నిర్మా పేరు పెట్టాడు. ఉద్యోగానికి రాజీనామా నిర్మాను ఎలాగైనా వృద్ధిలోకి తేవాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి వరకు కార్లలో తిరిగిన వాడు ఒక్కసారిగా సైకిల్‌పైకి మారిపోయి ఇంటింటికి తిరుగుతూ నిర్మా డిటర్జెంట్‌ని పరిచయం చేశాడు. అప్పటి వరకు మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బహుళజాతి సంస్థకు చెందిన డిటర్జెంట్ పౌడర్‌లో మూడో వంతు ధరకే అంటే నిర్మా డిటర్జెంట్ పౌడర్‌ను కేజీ రూ.3 లకే అమ్మడం ప్రారంభించాడు. ధర తక్కువ, నాణ్యత ఎక్కువగా ఉండటంతో గుజరాత్లో నిర్మా బ్రాండ్ ఊహించని స్థాయికి ఎదిగింది. జింగిల్ మ్యాజిక్ ఎనభైవ దశకంలో దూరదర్శన్ ప్రసారాలు దేశమంతటా విస్తరించాయి. దీన్ని అనువుగా మార్చుకుని కర్సన్భాయ్ రూపొందించిన వాషింగ్ పౌడర్ నిర్మా.. వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ సాగే జింగిల్ (అడ్వర్టైజ్మెంట్) దేశాన్ని ఉప్పెనలా చుట్టేసింది. పాలలోని తెలుపు నిర్మాతో వస్తుందనే స్లోగన్ గృహిణిలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ జింగల్ ఎఫెక్ట్‌తో దేశంలోనే నంబర్ వన్ బ్రాండ్‌గా మారింది నిర్మా. మధ్య తరగతి ప్రజల ఇళ్లలో తప్పనిసరి ఐటమ్‌గా మారింది. కూతురిపై ప్రేమ నిర్మా అడ్వెర్టైజ్మెంట్ ఆ స్థాయిలో సక్సెస్ కావడానికి కారణం కూతురిపై కర్సన్‌భాయ్‌కి ఉన్న ప్రేమ. అప్పటికే నిర్మా పేరుతో జనం మధ్యన కనిపిస్తున్న తన కూతురు రూపం చిరస్థాయిగా నిలిచిపోయేలా యాడ్‌ను డిజైన్ చేశాడు. ముందుగా తెల్ల గౌనులో ఓ పాపను గుండ్రంగా తిప్పించి.. ఈ స్టిల్ ఫ్రీజ్ చేసే సమయంలో తన కూతురు చిత్రం వచ్చేలా ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ బాగా వర్క్అవుట్ అయ్యింది. ఓ దశలో నిర్మా పేరు తెలియని వారు, చదవడం రాని వారు కూడా పాప బొమ్మ ఉన్న డిటెర్జెంట్ పౌడర్ అడిగి మరీ కొనుక్కునేలా ఆ యాడ్ క్లిక్ అయ్యింది. నంబర్‌వన్ 2004 నాటికే దేశంలో నంబర్ వన్ బ్రాండ్‌గా కొనసాగుతూ సాలీనా 8 లక్షల టన్నుల డిటర్జెంట్ పౌడర్ తయారు చేస్తున్న సంస్థగా నిర్మా రికార్డు సృష్టించింది. నిర్మా కంపెనీ ప్రత్యక్షంగా 14 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా లక్ష మందికి పైగా జీవనాధారం అయ్యింది. విద్యారంగంలో నిర్మా నిర్మా బ్రాండ్‌ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చిన తర్వాత తన కూతురి జ్ఞాపకాలను మరింత సజీవంగా ఉంచుకునేందుకు విద్యారంగంలోకి కర్సన్భాయ్ పటేల్ ఎంట్రీ ఇచ్చారు. అహ్మదాబాద్‌లో 1995లో నిర్మా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో ఫార్మసీ కాలేజీ స్థాపించారు. దీన్నే 2003లో నిర్మా యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేశారు. 40 వేల కోట్లకు పైమాటే ఫోర్బ్స్ వివరాల ప్రకారం 2019లో రూ, 42,000 కోట్ల రూపాయల ఆస్తులతో అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో ఇండియా పరంగా 30వ స్థానంలో ప్రపంచ స్థాయిలో 775వ స్థానంలో కర్సన్భాయ్ నిలిచారు. 2010లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. ప్రస్తుతం నిర్మా వ్యవహారాలను ఆయన కొడుకులు, కోడల్లు చూసుకుంటున్నారు. -
'నిర్మ'ల విజయుడు!
మన దిగ్గజాలు విజయానికి కావల్సింది ఏమిటి? విజయం గురించి ఆలోచించడం. కె.కె.పటేల్ అదే చేశారు. అక్కడితో ఆగిపోలేదు. ఆలోచనను ఆచరణలోకి తెచ్చారు. ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ యజమానిగా అతి పెద్ద విజయాన్ని సాధించారు... బహుళజాతి కంపెనీలను చూసి మామూలుగానైతే చిన్న కంపెనీలు భయపడతాయి. వాటి నడక తడబడుతుంది. కొన్నిసార్లు వాటి ఉనికి కూడా లేకుండా పోతుంది. అన్ని సందర్భాల్లోనూ ఇదే నిజం కాకపోవచ్చు అని చెప్పుకోవడానికి ‘నిర్మా వాషింగ్ పౌడర్’ ఒక తిరుగు లేని ఉదాహరణ. డెబ్బైలలో డిటర్జెంట్ మార్కెట్లో ‘సర్ఫ్’... మొదలైనవి రాజ్యం ఏలుతున్న కాలం. బరిలోకి దిగడానికి కూడా ఇతరులు భయపడే కాలం. అలాంటి కాలంలో ఒకే ఒక్కడుగా డిటర్జెంట్ మార్కెట్లోకి అడుగుపెట్టి అపూర్వ విజయాన్ని సాధించారు కర్సన్ భాయ్ పటేల్. ఒకప్పుడు ఇంటింటికీ తిరిగి డిటర్జెంట్ పౌడర్ అమ్మిన కర్సన్ భాయ్... ఇంతింతై వటుడింతై అన్నట్లుగా... ఈరోజు 2,500 కోట్ల నిర్మా గ్రూప్ యాజమానిగా ఎదిగారు. ‘కె.కె.పటేల్’గా ప్రసిద్ధుడైన కర్సన్ భాయ్ ఖోడిదాస్ పటేల్ సంపన్న కుటుంబంలో జన్మించలేదు. ఆయన విజయం రాత్రికి రాత్రి వచ్చింది కాదు. ఆత్మ విశ్వాసమే అతనికి దారి చూపింది. విజయపథాన్ని చూపింది. గుజరాత్‌లోని రుపూర్లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు కె.కె.పటేల్. బీయస్సీ పూర్తయిన వెంటనే అహ్మదాబాద్‌లోని ఒక కాటన్ మిల్లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేశారు. ఆ తరువాత రాష్ట్రప్రభుత్వ ‘జియాలజీ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్’లో పని చేశారు. ఆఫీస్ పని పూర్తయిన తరువాత... డిటర్జెంట్ పౌడర్‌ను ప్యాక్ చేసి సైకిల్ మీద ఇంటింటికీ తిరిగి అమ్మేవారు. మార్కెట్లోని లీడింగ్ డిటర్జెంట్ పౌడర్ల కంటే పటేల్ హ్యాండ్‌మేడ్ డిటర్జెంట్ ప్యాకెట్లు తక్కువ ధరకు లభించడంతో తక్షణ విజయాన్ని సాధించాయి. ఇక అప్పుడు తన డిటర్జెంట్ పౌడర్‌కు ‘నిర్మా’ అని పేరు పెట్టారు. మూడు సంవత్సరాల తరువాత ఆయన ఆత్మవిశ్వాసం పెరిగింది. ఉద్యోగాన్ని వదిలేశారు. అహ్మదాబాద్ శివార్లలో చిన్న వర్క్‌షాప్ ఒకటి మొదలుపెట్టారు. తన టార్గెట్ గ్రూప్ ఏమిటి అనే దాని మీద మొదట ఒక అవగాహనకు వచ్చారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి... తన టార్గెట్ గ్రూప్. ఇప్పుడు వారికి చేరువ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ‘నిర్మా’ బ్రాండ్ అనతి కాలంలోనే గుజరాత్ నుంచి మహారాష్ట్రకు విస్తరించింది. ‘ఎక్కువ నాణ్యత... తక్కువ ధర’ సూత్రంతో డిటర్జెంట్ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సాధించారు కె.కె.పటేల్. వ్యాపార ప్రకటనలతో గృహిణులకు మరింత చేరువైంది నిర్మా. ఒక దశాబ్దకాలంలోనే దేశంలో ‘లార్జెస్ట్ సెల్లింగ్ డిటర్జెంట్’గా నిలిచింది. డిటర్జెంట్ పౌడర్‌తో పాటు టాయిలెట్ సోప్‌లు, బాత్, బ్యూటీ సోప్‌ల ఉత్పత్తి మొదలుపెట్టింది. ఇరుగు పొరుగు దేశాల్లో కూడా ‘నిర్మా’కు మంచి పేరు వచ్చింది. 1995లో విద్యారంగంలోకి కూడా ప్రవేశించారు కె.కె.పటేల్. అహ్మదాబాద్‌లో ‘నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ని, 2003లో ‘నిర్మా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ని స్థాపించారు. ఒక్కరితో ప్రారంభమైంది నిర్మా... ఇప్పుడు ఆ గ్రూప్ కంపెనీలలో 14,000 మంది పనిచేస్తున్నారు. అతడే ఒక సైన్యం అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం... కె.కె.పటేల్. కొందరు వెళుతున్న దారిలోనే వెళతారు. వారికి ఇంకేమీ పట్టదు. కొందరు వెళుతున్న దారిలో వెళుతూనే కొత్త దారుల గురించి ఆలోచిస్తారు. అన్వేషిస్తారు. కె.కె.పటేల్ ఈ కోవకు చెందిన వ్యక్తి. విజయానికి కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు అద్దంలా నిలిచిన వ్యక్తి. ‘నిర్మా’ వ్యాపార ప్రకటన ‘వాషింగ్ పౌడర్ నిర్మా... వాషింగ్ పౌడర్ నిర్మా’ అందరికీ సుపరిచితమే. ఇది 1975లో తొలిసారిగా రేడియోలో, 1982లో టీవిలో ప్రసారమైంది. ‘మనీ-బ్యాక్ గ్యారెంటీ’ అనేది అప్పుడు ఇప్పుడూ కంపెనీ విజయ సూత్రాల్లో ఒకటిగా నిలిచింది. 2010లో కె.కె.పటేల్‌కు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ‘రిచెస్ట్ పర్సన్స్’ జాబితాలో పటేల్ పేరు చోటుచేసుకుంది. లో ప్రొఫైల్‌లో ఉండడానికే పటేల్ ఎక్కువగా ఇష్టపడతారు. అరుదుగా మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్‌కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్‌సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement