breaking news
Kardashians
-
అంబానీ ఎవరో మాకు తెలీదు.. అయినా పెళ్లికి వచ్చాం: కిమ్ కర్దాషియన్
ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు ఎందరో వచ్చారు. వారిలో హాలీవుడ్ సెన్సేషన్ కర్దాషియన్స్ సిస్టర్స్ కూడా వచ్చారు. నటి, మోడల్ కిమ్ కర్దాషియన్ (Kim Kardashian)తో పాటు సోదరి ఖ్లోయె కర్దాషియన్ (Khloé Kardashian).. అనంత్-రాధిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో హాజరై సందడి చేశారు. తాజాగా ద కర్దాషియన్స్ ఎపిసోడ్లో కిమ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.నా ఫ్రెండ్ మాటల్లో తెలిసింది..ఆమె మాట్లాడుతూ.. ఈ అంబానీలెవరో నాకు తెలియదు. కాకపోతే మాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. జ్యువెలరీ డిజైనర్ లారైన్ స్క్వార్ట్జ్ నాకు మంచి స్నేహితురాలు. తనకు అంబానీ కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. ఆ కుటుంబంలోని వారికి పలురకాల ఆభరణాలు తయారు చేసిస్తూ ఉంటుంది. తను అంబానీ పెళ్లికి వెళ్తున్నట్లు నాతో చెప్పింది. అంతేకాకుండా అంబానీ కుటుంబం.. నన్ను, నా సోదరిని ఆ పెళ్లికి ఆహ్వానించాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. అది వినగానే తప్పకుండా వస్తామని చెప్పాను.అదిరిపోయిన ఆహ్వానం.. రాకుండా ఊరుకుంటామా?తను చెప్పినట్లుగానే ఆహ్వానం అందింది. వారు పంపించిన ఇన్విటేషన్ గిఫ్ట్ బాక్స్ బరువు దాదాపు 20 కిలోలుంటుంది. అందులోనుంచి ఒకరకమైన సంగీతం కూడా వచ్చింది. అది మాకు విపరీతంగా నచ్చేసింది. అది చూశాక ఇలాంటివాటికి నో చెప్పే ప్రసక్తే లేదనుకున్నాం.. కచ్చితంగా పెళ్లికి వెళ్లాల్సిందే అని నిర్ణయించుకున్నాం అని చెప్పుకొచ్చింది. కాగా అనంత్- రాధిక 2024 జూలై 12న పెళ్లి చేసుకున్నారు.చదవండి: అయోధ్యలో మళ్లీ భూమి కొన్న బిగ్‌బీ.. ఈసారి పెద్ద మొత్తంలో..! -
కుటుంబం పరువు తీస్తున్న అల్లుడు!
హాలీవుడ్ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ భర్త కెన్యే వెస్ట్ అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతుండటంతో ఇంటిపెద్ద క్రిస్ జెన్నర్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నదట. కర్దాషియన్ బ్రాండ్‌ను అల్లుడు ఘోరంగా దెబ్బతీస్తున్నాడని ఆమె మథనపడుతున్నది. రియాల్టీ టీవీ షోలు, ఫ్యాషన్ షోలతో క్రిస్ జెన్నర్ హాలీవుడ్లో తమ కుటుంబానికి ఒక బ్రాండ్ ఇమేజ్ను సృష్టించింది. తన కూతురు కిమ్ భర్త ఆ 'బ్రాండ్ ఇమేజ్'ను దెబ్బతీస్తుండటంతో.. అల్లుడి వ్యవహారాలను చూసేందుకు ఆమె ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌ను కూడా నియమించాలని భావిస్తున్నది. కిమ్ కర్దాషియన్, వెస్ట్ దంపతులకు రెండేళ్ల కొడుకు నార్త్, రెండు నెలల కూతురు సెయింట్ ఉన్నారు. అయితే ఇటీవల ట్విట్టర్లో ఇష్టమొచ్చినట్టు పేలుతూ వెస్ట్ రెచ్చిపోతున్నాడు. ఇటీవల తాను పాడిన కొత్త పాటల్లోనూ పాప్ సింగర్ టైలర్ స్విఫ్ట్‌ను తిడుతూ.. ఆమెను తానే ఫేమస్ చేశానని పేర్కొంటూ దుర్భాషలాడాడు. దీంతో అతని అసభ్య వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. అయినా అతను తీరు మార్చుకోకుండా అడ్డూ అదుపులేకుండా ప్రవర్తిస్తుండటంతో వెస్ట్ ను కట్టడి చేయాలని క్రిస్ జెన్నర్ భావిస్తున్నదని ఆమె సన్నిహితులు తెలిపారు. భార్య కిమ్ కర్దాషియన్ తో వెస్ట్..