breaking news
kannada superstar
-
జెఫ్ బెజోస్ ఈవెంట్లో పునీత్ రాజ్‌కుమార్ ఆ నటుడ్ని కలవాలనుకున్నారట!
కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన 46ఏళ్ల వయసులోనే కన్నుమూయడం అందర్నీ షాక్‌కి గురిచేస్తుంది. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో నటీనటులతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో పునీత్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈ నేపథ్యంలోప పునీత్ ప్రొడక్షన్ వెంచర్ ఫ్రెంచ్ బిరియానీలో నటించిన హాస్యనటుడు డానిష్ సైత్, ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంగా తన "గురువు" అయిన పునీత్ మరణానికి సంతాపం తెలిపారు. అంతేకాదు డానిష్ సైత్ ట్విట్టర్లో " నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ప్రపంచంలోనే అత్యత్తుమమైన వ్యక్తి పునీత్ అన్న ఇక లేరు. నేను ఒకసారి అడిగాను అన్న మీరే స్వంతంగా సినిమాలు తీయోచ్చు కదా ఎందుకు మా మీద డబ్బులు ఖర్చు పెట్టి రిస్క్ తీసుకుంటారు. మరో తరాన్ని తీసుకురావలంటే చాలా సమయం పడుతుంది అందువల్ల ఒక తరం ఇంకోతరం కోసం కాస్త రిస్క్ తీసుకోవడానికి ముందుకి రావాలి. అంతేకాదు మా ప్రేక్షక్షులు ఎల్లప్పుడూ వినోదభరితంగా ఉండాలి అని తన గురువు పునీత్ అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. పైగా పునీత్ అన్నఒకసారి అమెజాన్ ఈవెంట్‌కి జెఫ్ బెజోస్‌తో కలిసి హాజరయ్యారు. ఇది చలనచిత్ర తారల సమూహంతో జరిగిన ఈవెంట్. ఈ ఈవెంట్లో అందరూ జెఫ్ బెజోస్‌తో కలిసి ఫోటోలు తీసుకుంటుంటే అన్నమాత్రం అందరికంటే భిన్నంగా దూరంగా నిలుచుని ఉన్నాడు. దీంతో అమెజాన్ బృదం ఎందుకు మీరు దూరంగా ఉన్నారు రండి ఇలా, మీరు ఎవరినైనా కలవాలనుకుంటున్నారా అని అడిగారు. దానికి అన్న నేను పంకజ్ త్రిపాఠిని కలవాలనుకుంటున్నా అన్నారు. నిజానికి పంకజ్ త్రిపాఠి అనే పేరు ఇప్పుడు చిత్రపరిశ్రమలో సుపరిచితమైన పేరు గానీ 2012లో గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్‌లో అద్భుతమైన పాత్ర లభించడానికి ముందు చాలా సంవత్సరాలు నటుడిగా రాణించడానికి చాలా కష్టపడ్డాడు. నా అన్న ఎప్పుడూ ప్రతిభకే మొదటి ప్రాధాన్య త ఇస్తాడు." అని భావోద్వేగంగా ట్వీట్ చేశారు. (చదవండి: కొండచిలువతో సీతకోక చిలుక ఏం చెబుతుందో చూడండి!) -
ఒక్క హౌస్‌ఫుల్ చాలు అనుకున్నా
ఎక్కువ ఊహించుకుంటే.. తక్కువగా కోరుకోలేం. సుదీప్ ఊహలకు రెక్కలు కట్టుకునే మనిషి కాదు. అందుకే ఏనాడూ.. తక్కువైందని బాధపడే అవసరం రాలేదు. అవసరం ఎందుకు రాలేదంటే ఎక్కువగా కోరుకోలేదు! ఒక్క హౌస్ ఫుల్ ఉంటే చాలనుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. కన్నడలో ఇప్పుడు స్టార్ హీరో! స్టార్ కాకపోయుంటే? అసలు హీరోనే అవకపోయుంటే? కనీసం కాఫీ కప్పులైనా అందిస్తుండేవారట! అంతిష్టం.. సుదీప్‌కి సినిమా అంటే. ప్రస్తుతం ‘దబాంగ్ 3’లో యాక్ట్ చేస్తున్నారు. ఆ విశేషాలకేం గానీ.. సుదీప్‌లో ఇంకో సుదీప్‌ని కనిపెట్టింది ‘సాక్షి’! ఆ ఇంకో సుదీప్ ఎవరో చదివి మీరూ కనిపెట్టండి. మీరు జిమ్ చేయరని, యోగా మీద ఆసక్తి లేదని విన్నాం. కానీ ఈ మధ్య విడుదలైన ‘పహిల్వాన్’ కోసం జిమ్ చేశారట? ఫిట్నెస్ అంటే జిమ్, యోగా మాత్రమే కాదు. జాగింగ్, స్పోర్ట్స్ వల్ల కూడా ఫిట్‌గా ఉండొచ్చు. అలా నేనెప్పుడూ ఫిట్‌గా ఉన్నాను. నాకిష్టం లేకపోయినా ‘పహిల్వాన్’కు జిమ్ చేయాల్సి వచ్చింది. స్పోర్ట్స్ నాకు కొత్త కాదు కానీ జిమ్ కొత్తగా అనిపించింది. మరి జిమ్ వల్ల కొత్తగా అలవర్చుకున్న విషయాలేమైనా? మంచి ఆహారపు అలవాట్లు, సమయానికి నిద్రపోవడం వల్ల కోరుకున్నట్టుగా బాడీ మారిపోతుంది. బ్యాలెన్స్‌తో ఉంటాం. నేను 89 ఉండేవాణ్ణి. ఇప్పుడు 74 కేజీలు ఉన్నాను. చాలా తేలికగా అనిపిస్తుంది. నా డ్రెస్‌లన్నీ మారిపోయాయి. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అయితే నేను జిమ్‌కి ఎందుకు దూరంగా ఉంటానంటే.. రోజూ ఒకే టైమ్‌కి నిద్రలేవాలి. ఒక టైమింగ్ ప్రకారం జిమ్ చేయాలి. అది నాకు కష్టంగా ఉంటుంది (నవ్వుతూ). అదే స్పోర్ట్స్ అనుకోండి మన ఇష్టం వచ్చినప్పుడు ఆడుకోవచ్చు. బరువు తగ్గడం వల్ల ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అన్నారు. బరువుకి, కాన్ఫిడెన్స్‌కి సంబంధం ఏటి? స్లిమ్‌గా ఉంటే స్క్రీన్ మీద సన్నివేశం కోసం షర్ట్ తీయాల్సి వచ్చినప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉంటాం. ఒక ఆర్టిస్ట్‌గా ఇలాంటి సీన్స్‌లో కాన్ఫిడెంట్‌గా కనిపించాలంటే ఫిట్‌గా ఉండాల్సిందే. నా సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. నా బలం నా విజయాలు. దానికి మించిన ఆత్మవిశ్వాసం ఏం ఉంటుంది? ఆ సంగతి అలా ఉంచితే ఫిట్నెస్ అనేది అందరికీ చాలా ముఖ్యమైనది. మెదడు షార్ప్‌గా ఉన్నట్టే బాడీ కూడా ఫిట్‌గా ఉంటే ప్లస్. ‘స్లిమ్’గా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారు. లావుగా ఉన్నవాళ్లను కొందరు ‘బాడీ షేమింగ్’ చేస్తుంటారు. దాని గురించి? బాడీ షేమింగ్ తప్పు. అది ఆ మాటలు పడేవాళ్ల పర్సనాలిటీ కంటే షేమింగ్ చేసేవాళ్ల పర్సనాలిటీ ఏంటో చెబుతుంది. బరువుగా ఉన్నారే అనుకుందాం. వాళ్లకి ఏ ఇబ్బందీ లేకుండా ఉన్నప్పుడు మధ్యలో నీ సమస్య ఏంటి? అంత కఠినంగా ఎందుకు వాళ్లను హేళన చేయాలి. మనలోనే బోలెడు తప్పులు ఉంటాయి. బాడీ ఫిట్‌గా ఉండొచ్చు. కానీ బ్రెయిన్ సరిగ్గా లేకపోవచ్చుగా? మనం కామెంట్ చేసేవాళ్లకు ఫిట్ బాడీ లేదేమో. ప్రపంచంలోనే బెస్ట్ బ్రెయిన్ ఉంటే? అప్పుడు వాళ్లకన్నా మనం తక్కువే కదా. ప్రస్తుతం నా బాడీ ఫిట్‌గా ఉండటం నాకు నమ్మకాన్ని ఇచ్చింది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ సార్‌తో ‘దబాంగ్ 3’ సినిమా చేస్తున్నాను. ఇద్దరం షర్ట్ లేకుండా ఓ ఫైట్ సీన్ ఉంది. ‘పహిల్వాన్’ కోసం ఫిట్‌గా మారడం వల్ల ఆ ఫైట్ చేయగలి గాను. íసినిమా యాక్టర్‌ని కాబట్టి నేను స్లిమ్‌గా ఉండటం అవసరం. అదే బయటివాళ్లు లావుగా ఉండి, వాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకపోతే వాళ్లు కాన్ఫిడెన్స్‌గా ఉండొచ్చు. ఆరోగ్యానికి మించిన ఆత్మవిశ్వాసం ఏం ఉంటుంది? అయితే నా ఉద్దేశం ఏంటంటే.. మనిషిగా ఉన్నంతకాలం వేరేవాళ్లను కామెంట్ చేయకూడదు. ఎందుకంటే మనిషి అంటేనే ఏదో ఓ వీక్నెస్ ఉంటుంది. అందుకే మనం మనుషులం. దాన్ని కవర్ చేసుకు నేంత తెలివిని మనకు దేవుడు ఇచ్చాడు. ప్రతి దశను ఎంజాయ్ చేస్తూ, సూపర్ స్టార్ స్టేజ్‌ని చేరుకునే క్రమంలో మీరు ఎన్ని చేదు అనుభవాలను దాటారు? ఒక్క హౌస్‌ఫుల్ ఉంటే చాలు అని నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నా ఫస్ట్ సినిమా రిలీజ్ అప్పుడు థియేటర్లో 15 మంది ఉన్నారు సుమారుగా. ఆల్రెడీ రెండు మూడు సినిమాలు ఆగిపోయాయి కూడా. అయితే నిరాశపడలేదు. ఎందుకంటే లక్ష్యం అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండాలి. మనం కూడా ఎప్పటికప్పుడు ఎదుగుతూనే ఉండాలి. ఆలోచనల్ని ఎదగనిస్తూనే ఉండాలి. ప్రస్తుతం ఉన్న మూమెంట్లో ఉండటం నేర్చుకోవాలి. ప్రస్తుతంలో బతకలేనప్పుడు మన జీవితాల్లో గ్రోత్ ఎక్కడ ఉంటుంది? అందుకే అప్పటి ఆ చేదు అనుభవాలను నన్ను నేను ముందుకు పుష్ చేసుకోవడానికి ఉపయోగించుకున్నాను. సంతోషం ఎక్కడో లేదు. మనలోనే ఉంటుంది. వేరే వాళ్లలో వేరే వస్తువుల్లో వెతికితే ఫూల్స్ కిందే లెక్క. మీ మాటలన్నీ ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.. బహుశా అనుభవాలు నేర్పించిన పాఠాలేమో? అవును. టైమ్ ప్రతీది మనకు నేర్పిస్తుంది. అయితే ఆ టైమ్‌కి జరగాల్సినవి జరుగుతున్నప్పుడు ఆ మూమెంట్లో లేకపోవడం వల్ల గతంలో నేను చాలా విషయాలను మిస్ అయ్యాను. మా పాప ఎదగడాన్ని నేను గ్రహించే ముందే ఎదిగిపోయింది. సడెన్‌గా చూస్తే.. మన పాప ఇంత పెద్దది అయిపోయిందా అనిపిస్తుంది. నటుడిగా బిజీ అయిపోయి పాప ఎదిగే క్రమాన్ని ఆస్వా దించలేదు. మన మూమెంట్‌ని ఎంజాయ్ చేయడం ముఖ్యం అని ఆ తర్వాత తెలిసింది. హౌస్‌ఫుల్స్, వరుస బ్లాక్‌బస్టర్స్ చూస్తూనే ఉన్నారు. ఇంకా ఏం కోరుకుంటున్నారు? ఏదీ ఆశించడంలేదు. ప్రతి రోజూ ఉదయాన్నే లేవగానే ఇదే మన ఆఖరి రోజు అని ఫీల్ అయి పని చేయడమే. ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆఖరి రోజే అవుతుంది. నేను హీరో అవ్వాలనుకున్నాను. అసాధ్యం అన్నది చాలామంది అభిప్రాయం. కానీ అయ్యాను కదా (నవ్వుతూ). నన్ను నేను నమ్మాను. ప్రయత్నించాను. అయ్యాను. నాకు సినిమాలంటే ఇష్టం. సినిమాల్లో ఉండాలనుకున్నాను. యాక్సిడెంటల్‌గా హీరో అయ్యాను. ఒకవేళ హీరోక ఆకపోయి ఉంటే.. సినిమా స్టూడియోల్లో కాఫీలు ఇస్తూ అయినా ఉండేవాణ్ణి. సినిమా అంటే అంత ఇష్టం. టాలెంట్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లు ఇక్కడికి రాలేకపోయారు. నేను వచ్చాను కదా. ఇంకా ఏం కోరుకోవాలి? మనం వచ్చాం అని ఆనందం వేస్తుంది, భయం కూడా వేస్తుంది. సినిమాల్లో రఫ్‌గా కనిపించే సుదీప్‌కి భయమా? (నవ్వుతూ) భయమే ఒక మనిషిని కాన్ఫిడెంట్‌గా మార్చుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ భయాన్ని అధిగమించాలని కష్టపడుతుంటాం. నా ఇవాళ్టి భయాలు రేపటికి నా భయాలు కావు. ఎందుకంటే రేపు ఉదయానికల్లా దాన్ని అధిగమించేసి ఉంటాను కాబట్టి. అందరూ అలా ఆలోచించాలని కోరుకుంటాను. లేకపోతే జీవితాంతం పరిగెట్టడమే. ఎంతకాలం పరిగెడతావు? ప్రయత్నించు. ఒకటి అది నిన్ను ఓడించాలి లేదా నువ్వు దాన్ని ఓడించాలి. అంతేకానీ చేస్తే ఏమవుతుందో అనే ఆలోచనల్లో ఉండిపోకూడదు. కొన్ని టిని అంగీకరించాలి, కొన్నిటిని అధిగమించాలి. అవునూ.. మీరు పుట్టినరోజు (సెప్టెంబర్ 2)లు చేసుకోరట? కారణం ఏంటి? ఒకప్పుడు చేసుకునేవాడిని. ఆ తర్వాత అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని ఆపేశాను. నాక్కూడా మొదట్లో నా బర్త్‌డేను చాలామంది మధ్యలో జరుపుకోవాలని, పాపులర్ అవ్వాలి అని, పూలమాలలు, కటౌట్స్ ఏర్పాటు చేయాలనీ ఉండేది. అదంతా ఓ ఫేజ్. ఓ రోజు నా బర్త్‌డే హంగామా అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న పాప రోడ్డు మీద పడిపోయిన కేక్ ముక్కను ఏరుకొని తినడం కనిపించింది. ఆ దృశ్యం నన్ను చాలా బలంగా తాకింది. నాక్కూడా ఓ కూతురు ఉంది. నా లగ్జరీ ఒకరికి ఒక పూట తిండి. ఇక కేక్ కటింగులు, కటౌటులు వద్దనుకున్నా. ఫ్యాన్స్‌కి కూడా చెప్పాను. ఆ తర్వాతి సంవత్సరం ఇంట్లో లేకుండా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాను. చాలా మంది తిట్టారు. కోపగించుకున్నారు. అంత దూరం నుంచి నీ ఇంటికి వస్తే ఇంట్లో లేకుండా వెళ్లిపోతావా? అన్నారు. అవన్నీ తీసుకున్నాను. రెండు రోజులు వాళ్లను తిట్టనిచ్చాను. ఆ తర్వాత ఓ వీడియో నా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ‘నన్ను సంతోషపెట్టడానికే మీరు ఇక్కడికి వస్తే నా కోసం ఏదీ తేవద్దు. అవన్నీ తీసుకొస్తానంటే నేను కలవను. అంతగా ఇవ్వాలనుంటే ఓ కేక్ కొని మీ వీధిలో వాళ్లకు పంచండి. నన్ను ప్రేమిస్తే అలా చేయండి అన్నాను. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ తర్వాత అర్థమయింది. ఫ్యాన్స్ అందరూ మంచి పనులు చేయడం గమనించాను. ఒక్క రోజా పువ్వు కూడా తేలేదు. జీవితంలో ఒక స్టేజ్‌కి వచ్చాక పూలమాలలు, కటౌట్లు మనల్ని ఎగ్జయిట్ చేయవు. నేను అద్భుతాలు చేయలేకపోవచ్చు. కానీ నాకు ఉన్న దానిలో నాకు చేతనైనంత చేయగలను. నాకోసం వృథా ఖర్చు చేయడం మానేశాను. నా దగ్గర ఉండేవన్నీ 200, 300 ఖరీదు గల వస్తువులే. నా బట్టలు కూడా అంతే. 200, 300 టీషర్ట్స్ వేసుకుంటాను. మీ భార్య, మీ పాప ఏమీ అనరా? నా వైఫ్ చాలా స్వీట్. నా కూతురు కూడా సింపుల్‌గా బతకడానికే ఇష్టపడుతుంది. చిన్న చిన్న విషయాలకే సంతోషపడిపోతుంటుంది. లగ్జరీ లైఫ్ పట్ల ఆసక్తి చూపించదు. ఇద్దరూ సంప్రదాయాలకు విలువ ఇస్తారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై... ఇలా ఎక్కువ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు? ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఏదో ఒకరోజు ప్రతి ఒక్క హీరో ఆడియన్స్‌కి బోర్ కొడతారు. ఏదో ఒకరోజు ప్రతి హీరో వెనక్కి వెళ్లక తప్పదు. అలాంటప్పుడు మనకు పని ఉన్నప్పుడు వదులుకోకూడదు. నేను కష్టపడుతున్నాను అని అనుకోకూడదు. ఇష్టపడుతూ పని చేసినప్పుడే పనిని ఎంజాయ్ చేయగలం. వరుసగా పది ఫ్లాప్‌లు వచ్చినా ఓ హీరోకి ఏం కాదు. కానీ నీ కోసం ఎవరూ స్టోరీ రాయకపోతే మన పని అయిపోయినట్లే. మన కోసం ఎవరూ స్టోరీ రాయడం లేదని తెలిసినప్పుడు చాలా భయంగా ఉంటుంది. ఒకరు ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు యాక్టింగ్ విషయంలో నీ పేరు ఒక్కసారి అయినా వారి ఆలోచనల్లోకి వచ్చి పోవాలి. దాని అర్ధం ఏంటంటే ప్రతి పాత్రకు నువ్వు సూట్ అవుతావని. అయితే ఒక్క విషయం ఏంటంటే.. నేను ఇండస్ట్రీకి ఖాళీగా వచ్చాను. సో.. నేను దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. కన్నడంలో స్టార్ హీరో అనిపించుకుని, తెలుగు ‘ఈగ’లో విలన్‌గా చేసిన అనుభవం గురించి? ఆ సినిమా ప్రాసెస్‌ను ఎంజాయ్ చేయకుండా అయ్యో ఈ సినిమాలో మనం హీరో కాదు... వెంటనే తెలుగులో హీరోగా పెద్ద సినిమా చేయాలి అని ఆలోచిస్తే కుదరదు. టిఫిన్ తినడానికి కూర్చుని దాన్ని ఆస్వాదించకుండా లంచ్‌కి ఆలోచిస్తున్నట్టుంటుంది. ఇడ్లీలు వడ్డించగానే ‘ఆ లంచ్ ఏంటి? అంటే.. ఆ ఇడ్లీ తయారు చేయడానికి నీ భార్య, తల్లి లేక వేరే ఎవరో ఎంతో కష్టపడి ఉంటారు. దాన్ని తయారు చేయడానికి ఉదయాన్నే వాళ్లు నిద్రలేచి చేస్తే, దాన్ని ఆస్వాదించకుంటే వాళ్లను గౌరవించనట్టే లెక్క. మీరు మీ వీక్నెస్లను ఎలా కవర్ చేసుకుంటారు? నేను లుక్స్ పరంగా ది బెస్ట్ కాకపోవచ్చు. నా కంటే లుక్స్‌లో అద్భుతంగా ఉండేవాళ్లు ఉండొచ్చు. కానీ నేనెక్కడున్నా నా ప్రెజెన్స్ తెలిసేంత కాన్ఫిడెంట్‌గా ఉండగలను. మనకంటే బెస్ట్ వాళ్లతో పోల్చుకుని బాధపడటం ఎందుకు? బెటర్‌గా మారేందుకు కష్టపడదాం. అన్నీ అరచేతిలో ఉండి కూడా ఇంకా ఏదో కావాలని ఏడుస్తాం. అది పర్సనాలిటీ డిజార్డర్. ఆ వీక్నెస్ ఉంటే కష్టం. లక్కీగా నాకది లేదు. నాతో నన్ను పోల్చుకుని బెటర్ అవడానికి ట్రై చేస్తుంటాను. ఇతరులను పట్టించుకోను. – డి.జి. భవాని -
సూపర్‌స్టార్‌కి తప్పిన ప్రమాదం
సాక్షి, బెంగళూరు: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ‘నట సార్వభౌమ’ అనే సినిమా షూటింగ్ ముగించుకుని వెళ్తుండగా ఘటన జరిగింది. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు పునీత్ రాజ్‌కుమార్ కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ తనయుడు. -
సూపర్‌స్టార్‌ను జ్ఞాపకం చేసిన గూగుల్
బెంగళూరు: కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌కు గూగుల్ ఘన నివాళి అర్పించింది. ఆయన 88వ జయంతి సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో ఆకట్టుకుంది. ఓ తెరమీద బ్యాక్ గ్రౌండ్లో గూగుల్ అని ఉండి యువకుడిగా రాజ్‌కుమార్ చిరునవ్వు చిందిస్తుండగా ఎదురుగా ప్రేక్షకులు కూర్చొని ఆయనను చూస్తున్నట్లుగా ఆ డూడుల్ ఉంది. 1929లో అంబరీష్ సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజుగా జన్మించిన ఆయన వెండి తెర వెలుగుపైకి రాగానే రాజ్‌కుమార్‌గా మారిపోయారు. దాదాపు నాలుగు దశాబ్దాలు కన్నడ చిత్ర పరిశ్రమను ఏలారు. 1954 బేదారా కన్నప్పా అనే కన్నడ చిత్రం ద్వారా సినీలోకంలో అడుగుపెట్టిన ఆయన దాదాపు 200 చిత్రాల్లో నటించింది. ఆయన జీవితం మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమకే అంకితం చేశారు. ఆయన మంచి గాయకుడిగా కూడా పేరు సంపాధించుకున్నారు. 300వందల పాటలు కూడా పాడారు. పద్మభూషణ్, దాదా సాహేబ్ పాల్కే వంటి అవార్డులు కూడా పొందారు. ప్రస్తుతం ఆయన కుమారులు శివరాజ్‌కుమార్, పునీత్ రాజకుమార్ కూడా కన్నడ చిత్ర సీమలో ప్రముఖులుగా ఉన్నారు. -
సుదీప్ హీరోగా ముడింజా ఇవన్ పుడి
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ తమిళంలో కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ముడింజా ఇవన్ పుడి. కేఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాంబాబు ప్రొడక్షన్స్ పతాకంపై ఎంపీ.బాబు నిర్మిస్తున్నారు. నాన్ఈ చిత్రంలో విలనిజాన్ని పండించిన సుదీప్ ఆ తరువాత బ్రహ్మాండ చిత్రం బాహుబలిలో రాజుగా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం పులిలో మరోసారి విలన్‌గా సుదీప్ నట విజృంభణ చూడబోతున్నాం. అలాంటి విలక్షణ నటుడు కన్నడ సూపర్‌స్టార్ తమిళంలో హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ముడింజా ఇవన్ పుడి. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో పోకిరి, పూజై చిత్రాల ఫేమ్ ముఖేష్ తివారి విలన్‌గా నటిస్తున్నారు. ఎదుర్‌నీశ్చల్, పాండినాడు చిత్రాల్లో ప్రాచుర్యం పొందిన శరత్ లోహితేసువ మరో విలన్‌గా నటిస్తుండగా నాజర్, సాయిరవి, అవినాష్, అచ్చుత్‌కుమార్, లతారావు, సుకన్య, విసు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. రెండవ షెడ్యూల్ చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం కోసం అంబత్తూర్లో పోలీస్‌స్టేషన్ సెట్ వేసి 10 రోజుల పాటు ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. మరో 30 రోజుల పాటు చెన్నైలోనే ముడింజా ఇవన్ పుడి చిత్ర షూటింగ్‌ను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు. -
'నా కూతురు పెళ్లికి రండి'
బెంగళూరు: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తన కుమార్తె నిరుపమ వివాహానికి తమిళ రాజకీయ, సినీ ప్రముఖులను ఆహ్వానించారు. తమిళ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ లను స్వయంగా కలిసి తన కూతురికి పెళ్లికి రావాలని శివరాజ్ కుమార్ కోరారు. ధనుష్, ప్రభు, నాజర్, మురళి, ప్రకాశ్ రాజ్, శివకార్తీకేయన్, డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ తదితరులను కూడా ఆయన ఆహ్వానించారు. డాక్టర్ గా పనిచేస్తున్న నిరుపమ వివాహం దిలీప్ తో ఆగస్టు 31న జరగనుంది. గతేడాది ఆగస్టులో వీరికి నిశ్చితార్థం జరిగింది. శివరాజ్ కుమార్ ప్రస్తుతం శివలింగ, కిల్లింగ్ వీరప్పన్ సినిమాల్లో నటిస్తున్నారు.