-
కల్పతరు అప్- గాడ్ఫ్రే ఫిలిప్స్ డౌన్
విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీయంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తదుపరి మరికొంత బలపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 171 పాయింట్లు ఎగసి 35,087కు చేరగా.. నిఫ్టీ 51 పాయింట్లు పుంజుకుని 10,353 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఆర్డర్లను సంపాదించినట్లు వెల్లడించడంతో కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి కల్పతరు లాభాలతో సందడి చేస్తుంటే.. గాడ్ఫ్రే ఫిలిప్స్ కళ తప్పింది. వివరాలు చూద్దాం.. కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలతోపాటు దేశీ కంపెనీల నుంచి తాజాగా కాంట్రాక్టులు పొందినట్లు మౌలిక సదుపాయాల సంస్థ కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ పేర్కొంది. వీటితోపాటు అనుబంధ సంస్థ ద్వారా యూరోప్‌లోనూ విద్యుత్ ప్రసారం, పంపిణీ విభాగంలో ఆర్డర్లను దక్కించుకున్నట్లు తెలియజేసింది. వీటి సంయుక్త విలువను రూ. 956 కోట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో కల్పతరు పవర్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 3 శాతం పెరిగి రూ. 223 వద్ద ట్రేడవుతోంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పొగాకు ఉత్పత్తుల సంస్థ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 39 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 20 శాతం తక్కువకాగా.. మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం పుంజుకుని రూ. 622 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో గాడ్ఫ్రే ఫిలిప్స్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం పతనమై రూ. 987 వద్ద ట్రేడవుతోంది. -
సనత్‌నగర్ లో కల్పతరు రెసిడెన్సీ!
♦ 5.5 ఎకరాల్లో తొలి ప్రీమియం ప్రాజెక్ట్ షురూ ♦ 572 ఫ్లాట్లు; ధర చ.అ.కు రూ.4,176 నిర్మాణ రంగంలో సుమారు అర్ధ శతాబ్ధం అనుభవం.. 1.7 కోట్ల చ.అ.ల్లో ప్రీమియం నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణాలు.. ఆసియాలోనే తొలి ఎల్ఈఈడీ ప్లాటినం సర్టిఫై పొందిన భవనం, 70 అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మించిన ఘనత.. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి.. ఆధునిక వసతులతో కూడిన ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో పెట్టింది పేరు.. ఇదీ క్లుప్తంగా చెప్పాలంటే కల్పతరు సంస్థ గురించి! ముంబైకి చెందిన ఈ సంస్థ తొలిసారిగా భాగ్యనగరంలో ప్రీమియం ప్రాజెక్ట్‌తో రంగంలోకి దిగింది. సనత్‌నగర్‌లో రానున్న కల్పతరు రెసిడెన్సీ వివరాలను సంస్థ డెరైక్టర్ (సేల్స్) నరేంద్ర లోధా మాటల్లోనే.. ♦ ఎర్రగడ్డ బ్రిడ్జ్‌కు సమీపంలో ప్రధాన రహదారికి పక్కనే 5.5 ఎకరాల్లో ప్రీమియం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో రెండు భారీ టవర్స్‌లో మొత్తం 576 ఫ్లాట్లొస్తాయి. ఒక్కో ఫ్లాట్ 1,200-2,000 చ.అ. మధ్య విస్తీర్ణాలుంటాయి. చ.అ. ధర రూ. 4,176గా నిర్ణయించాం. మొత్తంగా చూస్తే 2 బీహెచ్‌కే రూ.71 లక్షలు, 3 బీహెచ్‌కే రూ.82 లక్షలు, 3 బెడ్ గ్రాండ్ ధర రూ.92 లక్షలుంటాయి. ఈ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలో పూర్తి చేస్తాం. సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 26 శాతం మాత్రమే నిర్మాణాలుంటాయి. మిగతాదంతా ఓపెన్ స్పేసే. హరిత భవనాల ప్రమాణాలకు అనుగుణంగానే ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నాం. నీరు, విద్యుత్ పున ర్వినియోగం, సౌర విద్యుత్ ఏర్పాట్ల వంటి వాటితో ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ కావటంతో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్లాటినం రేటెడ్ ప్రీ సర్టిఫైడ్ పొందింది కల్పతరు రెసిడెన్సీ. ♦ నగరానికి చెందిన ప్రముఖ ఆర్కిటెక్చర్ జెనిసిస్ ప్లానర్స్ ప్రై.లి. కల్పతరు రెసిడెన్సీ ఆర్కిటెక్చర్. ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్‌గా దుబాయ్‌కు చెందిన డబ్ల్యూఏహెచ్‌ఓ సంస్థ ఉంది. ప్రతీ ఫ్లాట్‌కు మూడు వైపులా ఖాళీ స్థలం ఉండేలా ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశాం. ♦ వసతుల విషయానికొస్తే.. సెంట్రల్ ల్యాండ్ స్కేప్, చెస్‌కోర్ట్, అత్యాధునిక జిమ్, మల్టీ ఫంక్షన్ క్లబ్, ఇండోర్, ఔట్‌డోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల అత్యాధునిక వసతులుంటాయి. ♦ మొత్తం 9.5 ఎకరాల స్థలాన్ని 2008 సంవత్సరంలో బ్రిటీష్ ఆక్సిజెన్ సంస్థ నుంచి రూ.80 కోట్లతో కొనుగోలు చేశాం. స్థానిక రాజకీయాంశం కారణంగా ఇన్నాళ్లు నిర్మాణ పనులను ప్రారంభించలేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వ అభివృద్ధి నిర్ణయాలు, ప్రోత్సాహకర పనితీరును చూసి దేశ, విదేశీ సంస్థలు ఇక్కడికొస్తున్నాయని అందుకే మేం కూడా ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ఇదే సరైన సమయమని నిర్ణయిం చుకున్నాం. ♦ 1969 నుంచి ఈ రంగంలో ఉన్నాం. ముంబై, థానే, లోనావాలా, పన్వేల్, ఇండోర్, చెన్నై వంటి ప్రాంతాల్లో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించాం. గతంలో హైదరాబాద్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, విప్రో ఐటీ క్యాంపస్ వంటి పలు సంస్థలకు కార్పొరేట్ ఆఫీసులను నిర్మించాం కూడా.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement