-
ఆ హిట్ సినిమాకు 50 ఏళ్లు.. ఘనంగా స్వర్ణోత్సవం!
ప్రముఖ నిర్మాత కాకర్ల కృష్ణ స్వర్ణోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ, అంజలీదేవి, చంద్రకళ ప్రధాన పాత్రల్లో కె. సత్యం దర్శకత్వంలో కాకర్ల కృష్ణ నిర్మించిన చిత్రం ‘ఇంటింటి కథ’ (1974). ఈ సినిమా విడుదలై 50 ఏళ్లయిన సందర్భంగా నిర్మాత కాకర్ల కృష్ణ స్వర్ణోత్సవం జరిగింది. కాకర్ల కృష్ణ మనవడు త్రికాంత్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత, నటుడు మురళీ మోహన్ హాజరయ్యారు. మురళి మోహన్ మాట్లాడుతూ– ‘‘వీబీ రాజేంద్ర ప్రసాద్‌గారి జగపతి సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా ప్రయాణం ప్రారంభించిన కృష్ణ ఆ తర్వాత ‘ఇంటింటి కథ’ సినిమాతో నిర్మాతగా మారారు’ అని అన్నారు. కాకర్ల కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇంతమంది ఆత్మీయల సమక్షంలో నా స్వర్ణోత్సవం జరగటం సంతోషంగా ఉంది. ఇది నా జీవితాంతం తీపి జ్ఞాపకంగా ఉంటుంది. కృష్ణ స్వర్ణోత్సవం జరగడం సముచితంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. నిర్మాతలు కె. దామోదర ప్రసాద్, జి. ఆదిశేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు. -
కన్నతండ్రి..కర్కశం
చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిందా చిన్నారి. తండ్రి మంచంలో ఉండటంతో కన్నతల్లిలా సపర్యలు చేసింది. కదలలేని స్థితిలో ఉన్న తండ్రిని కంటికి రెప్పలా కాచుకుంటున్నా..కనికరం లేని అతను నిత్యం కుమార్తెకు నరకం చూపాడు. కొడుతూ చిత్రహింసలు పెట్టాడు. తొమ్మిదేళ్ల బాలిక రోదన చూడలేక..చుట్టుపక్కల వారు చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు ఆ బాలికకు తండ్రి నుంచి విముక్తి కల్పించారు. ఒంగోలు టౌన్: కదలలేని స్థితిలో ఉన్న తనను కంటికి రెప్పలా చూసుకుంటున్న కుమార్తెను చిత్రహింసలు పెట్టాడో తండ్రి. ఒంగోలులోని పొనుగుపాటినగర్‌లో ఉంటున్న కాకర్ల కృష్ణ (40) భార్య లక్ష్మి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. బేల్దారి పని చేసుకుంటూ కుమార్తె రేణుకను పోషించేవాడు. రెండేళ్ల క్రితం బిల్డింగ్‌పై నుంచి పడటంతో వెన్నెముకకు బలమైన దెబ్బ తగిలి కృష్ణ కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. అప్పటి నుంచి రేణుక.. తండ్రికి అన్నీ తానై సపర్యలు చేస్తోంది. తండ్రి మంచంపైనే మలమూత్ర విసర్జన చేసినా చీదరించుకోకుండా శుభ్రం చే సేది. మంచంపైనే తండ్రికి స్నానం చేయించి దుస్తులు కూడా వేసేది. తల్లి తన బిడ్డని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అలా సేవలు చేసేది. అలాంటి కూతురిని ఏ తండ్రి అయినా అపురూపంగా చూసుకుంటాడు. ఆ చిన్న మనస్సుకు ఎలాంటి కష్టం రాకుండా చూస్తాడు. కానీ కృష్ణ మాత్రం మంచంపై నుండి లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ కుమార్తెను ప్రతిరోజూ రాచి రంపాన పెట్టేవాడు. కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ కుమార్తెను కొట్టేందుకు మంచం పక్కనే ఒక కర్రను కూడా సిద్ధంగా ఉంచుకునేవాడు. అయిన దానికి, కానిదానికి ఆగ్రహిస్తూ కర్రతో కొట్టడమే గాకుండా ఆ బాలిక శరీరంపై గోళ్లతో రక్కడం, తొడపాశం పెట్టడం నిత్యకృత్యమైంది. ప్రతిరోజూ తండ్రి చిత్రహింసలు భరించలేని ఆ బాలిక పెట్టే కేకలకు చుట్టుపక్కల వాళ్లు చలించిపోయేవారు. ఆ తండ్రి వద్దకు వెళ్లి పలుమార్లు చెప్పినప్పటికీ అతని తీరులో ఎలాంటి మార్పు కనిపించలేదు. దాంతో చుట్టుపక్కల వాళ్లు ఆ బాలిక స్థితిని చూసి తట్టుకోలేక చైల్డ్‌లైన్(1098)కు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ ప్రతినిధి బీవీ సాగర్ ఆ బాలికను బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ బీవీ శివప్రసాద్ ఎదుట హాజరు పరిచారు. ఆ బాలికను బాలసదన్‌లో చేర్పించి కష్టాలకు తాత్కాలిక చెక్ పెట్టారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్‌డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్
- ‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
- కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
- తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
- ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్‌లో నటించను: సత్యరాజ్
- భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
- Daily Horoscope: ఈ రాశి వారు ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం
- మరీ ఇంత ‘పచ్చ’పాతమా!
- రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి...
Advertisement