breaking news
Kadapa Municipal Corporation
-
ఉద్దేశపూర్వకంగా మీటింగ్‌కు డుమ్మా! కడప కమిషనర్‌కు మళ్లీ నోటీసులు
సాక్షి, వైయస్సార్ జిల్లా: కడప మున్సిపల్ కార్పొరేషన్లో హైడ్రామా కొనసాగుతోంది. తాజాగా మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డికి మేయర్ సురేష్ బాబు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కావాలనే విధులకు గైర్హాజరయ్యారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆ నోటీసుల్లో మేయర్ పేర్కొన్నారు. శుక్రవారం మేయర్ సురేష్ బాబు అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అయితే ఆ టైంలో కార్యాలయంలో ఉండి కూడా కమిషనర్ మనోజ్ రెడ్డి గైర్హాజరు అయ్యారు. దీంతో ప్రజా సమస్యలపై చర్చించే కీలక మీటింగ్‌కు డుమ్మా కొట్టడం.. విధులను నిర్వర్తించనందుకుగానూ వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో మేయర్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు ఉద్యోగులకూ శనివారం షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కమిషనర్ ఆదేశాల మేరకే మిగతా ఉద్యోగులూ హాజరు కాలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ముందు.. కడప కార్పొరేషన్ సమావేశ మందిరానికి తాళం వేయడంతో మున్సిపల్ కమిషనర్‌కి మేయర్ సురేష్‌బాబు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
కడప కార్పొరేషన్ నిబంధనలకు టీడీపీ నేతల తూట్లు.. మేయర్ సీరియస్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కార్పొరేషన్ అధికారుల తీరుకు నిరసనగా తాళం వేసిన కాన్ఫరెన్స్ హాల్ ముందు మేయర్ సురేష్ బాబు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన 43 మంది సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు మీటింగ్ హాల్లోనే ఉండి పోయారు. చట్టప్రకారం కార్పొరేషన్ ప్రాంగణంలో సమావేశం జరుగుతోంది. సభ్యులు.. ఎజెండాను చర్చించి ఆమోదిస్తున్నారు.కాగా, కడప కార్పొరేషన్ సమావేశ మందిరానికి తాళం వేయడంతో మున్సిపల్ కమిషనర్‌కి మేయర్ సురేష్‌బాబు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు తెరిస్తే సమావేశం ఎలా పెట్టాలంటూ సురేష్ బాబు ప్రశ్నించారు. సమావేశం మందిరం కాకుండా ఎక్కడ సమావేశం పెట్టాలో చెప్పాలన్న మేయర్.. అధికారులపై మండిపడ్డారు.‘‘కడప మున్సిపల్ కమిషనర్ నిబంధనలు పాటించడం లేదు. సమావేశం హాల్ తెరవాలని కోరినా పట్టించుకోలేదు. నాకు తెలియకుండా వేదికపై ఎమ్మెల్యేకు కుర్చీ వేశారు. సమావేశంపై కమిషనర్ నాతో చర్చించలేదు’’ అని మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.కడప కార్పొరేషన్ నిబంధనలకు టీడీపీ నేతలు తూట్లుకడప కార్పొరేషన్ నిబంధనలకు టీడీపీ నేతలు తూట్లు పొడిచారు. రెండు రోజుల కిత్రమే సమావేశంపై మేయర్ స్పష్టత ఇచ్చారు. కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం ఉన్నట్టు కమిషనర్‌కు మేయర్ లేఖ రాశారు. మేయర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా సమావేశ హాల్లో నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మేయర్ సురేష్‌బాబు ఆదేశాలను కమిషనర్ పట్టించుకోలేదు. సమావేశం కోసం కాన్ఫరెన్స్‌హాల్ తెరవాలని మేయర్ కోరారు.కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం పెట్టాలని గతంలో హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ కాన్ఫరెన్స్ హాల్‌కు అధికారులు తాళం వేశారు. సమావేశ మందిరంలో మీటింగ్ నిర్వహించేదిలేదని మేయర్ సురేష్‌బాబు తేల్చి చెప్పారు. దీంతో కాన్ఫరెన్స్ హాలులో సమావేశం అనగానే అధికారులు తాళం వేశారు. -
‘లంచం లేనిదే పని కావడం లేదు’
సాక్షి, వైఎస్సార్ కడప : నగర పాలక సంస్థ అధికారులపై కడప ఎమ్మెల్యే అంజద్ బాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచం లేనిదే ఏ పని కావడం లేదని మండిపడ్డారు. ప్రతి పేద వాడి దగ్గర నుంచి చిన్న చిన్న పనులకు కూడా డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. అధికార టీడీపీ మహిళా కార్పొరేటర్ల భర్తలు చెప్పినట్టు అధికారులు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అందరికి ఒకేలా పని చేయాలని.. ఇలా వ్యవహరించటం తప్పని.. హితవు పలికారు. అధికారుల తీరు మారకుంటే చూస్తు ఊరుకునేది లేదని బాషా హెచ్చరించారు. -
కడపలో పోలింగ్ ప్రశాంతం
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: కడప నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడప నగరంలో 2,71,532 మంది ఓటర్లుండగా 1,70,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 62.67గా నమోదైంది. ఈ సారి కడపలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అలాగే ఈవీఎంలు మొరాయించడం, ఇతరత్రా సమస్యలు కూడా ఉత్పన్నం కాలేదు. పోలింగ్ సందర్భంగా ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం, సాయంత్రం బాగా జరిగిన పోలింగ్ మధ్యాహ్నం మందకొడిగా సాగింది. ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం పోలింగ్ కేంద్రాల్లో సందడి కనిపించలేదు. గతంలో ఓటు వేస్తున్న చోట కాకుండా వేరే పోలింగ్ కేంద్రాలను కేటాయించడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. అలాగే ఒక కుటుంబంలో ఉన్న భార్యాభర్తలకు కూడా వేర్వేరు పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. రెండు ఇళ్లకు ఒకే పోలింగ్ కేంద్రం రాలేదంటే ఎంత గంద రగోళంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓటర్లకు సాధ్యమైనంత వరకూ దగ్గరగా ఉండే పోలింగ్ కేంద్రాలను కేటాయించాలి. కానీ చాలా వార్డులలో పరిస్థితి ఇందుకు భిన్నంగా జరిగింది. 3వ డివిజన్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపించింది. స్లిప్పులున్నవారైతే దూరమైనా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటే శారు. కానీ స్లిప్పులు లేని వారైతే ప్రతి పోలింగ్ కేంద్రం చుట్టూ చక్కర్లు కొట్టారు. 32వ వార్డు పరిధిలోని బెల్లంమండి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ మిషన్ వద్ద వెలుతురు లేకపోవడంతో గుర్తులు కానరాక వృద్ధులు ఇబ్బంది పడ్డారు. పత్తాలేని బీఎల్ఓలు : స్లిప్పులు అందని వారికి పోలింగ్ కేంద్రం వద్ద బీఎల్ఓలు అందజేస్తారని ఎన్నికల అధికారులు తెలిపినా చాలా పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓల జాడ కానరాలేదు. ఓటర్లు తమ ఓటరు కార్డు పట్టుకుని స్లిప్పులు లేక, పోలింగ్ ఎక్కడో తెలియక సమస్యలు ఎదుర్కొన్నారు. మొత్తమ్మీద మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు.