కడప కార్పొరేషన్‌ నిబంధనలకు టీడీపీ నేతల తూట్లు.. మేయర్‌ సీరియస్‌ | Mayor Suresh Babu Issues Notice To Kadapa Municipal Commissioner Over Drama For Corporation Council Meeting | Sakshi
Sakshi News home page

కడప కార్పొరేషన్‌ నిబంధనలకు టీడీపీ నేతల తూట్లు.. మేయర్‌ సీరియస్‌

Jun 20 2025 11:25 AM | Updated on Jun 20 2025 1:06 PM

Mayor Suresh Babu Issues Notice To Kadapa Municipal Commissioner

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కార్పొరేషన్ అధికారుల తీరుకు నిరసనగా తాళం వేసిన కాన్ఫరెన్స్ హాల్ ముందు మేయర్ సురేష్ బాబు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీకి చెందిన 43 మంది సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు మీటింగ్‌ హాల్లోనే ఉండి పోయారు. చట్టప్రకారం కార్పొరేషన్ ప్రాంగణంలో సమావేశం జరుగుతోంది. సభ్యులు.. ఎజెండాను చర్చించి ఆమోదిస్తున్నారు.

కాగా, కడప కార్పొరేషన్‌ సమావేశ మందిరానికి తాళం వేయడంతో మున్సిపల్‌ కమిషనర్‌కి మేయర్‌ సురేష్‌బాబు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు తెరిస్తే సమావేశం ఎలా పెట్టాలంటూ సురేష్‌ బాబు ప్రశ్నించారు. సమావేశం మందిరం కాకుండా ఎక్కడ సమావేశం పెట్టాలో చెప్పాలన్న మేయర్‌.. అధికారులపై మండిపడ్డారు.

‘‘కడప మున్సిపల్‌ కమిషనర్‌ నిబంధనలు పాటించడం లేదు. సమావేశం హాల్‌ తెరవాలని కోరినా పట్టించుకోలేదు. నాకు తెలియకుండా వేదికపై ఎమ్మెల్యేకు కుర్చీ వేశారు. సమావేశంపై కమిషనర్‌  నాతో చర్చించలేదు’’ అని మేయర్‌ సురేష్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడప కార్పొరేషన్‌ నిబంధనలకు టీడీపీ నేతలు  తూట్లు
కడప కార్పొరేషన్‌ నిబంధనలకు టీడీపీ నేతలు  తూట్లు పొడిచారు. రెండు రోజుల కిత్రమే సమావేశంపై మేయర్‌ స్పష్టత ఇచ్చారు. కాన్ఫరెన్స్‌ హాల్‌లో సమావేశం ఉన్నట్టు కమిషనర్‌కు మేయర్‌ లేఖ రాశారు. మేయర్‌ ఆదేశాలను ఖాతరు చేయకుండా సమావేశ హాల్‌లో నిర్వహణకు ఏర్పాట్లు  చేశారు. మేయర్‌ సురేష్‌బాబు ఆదేశాలను కమిషనర్‌ పట్టించుకోలేదు. సమావేశం కోసం కాన్ఫరెన్స్‌హాల్‌ తెరవాలని మేయర్‌ కోరారు.

కాన్ఫరెన్స్‌ హాల్‌లో సమావేశం పెట్టాలని గతంలో హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ కాన్ఫరెన్స్‌ హాల్‌కు అధికారులు తాళం వేశారు. సమావేశ మందిరంలో మీటింగ్‌ నిర్వహించేదిలేదని మేయర్‌ సురేష్‌బాబు తేల్చి చెప్పారు. దీంతో కాన్ఫరెన్స్‌ హాలులో సమావేశం అనగానే అధికారులు తాళం వేశారు.



 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement