breaking news
mayor suresh babu
-
కడప కార్పొరేషన్ నిబంధనలకు టీడీపీ నేతల తూట్లు.. మేయర్ సీరియస్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కార్పొరేషన్ అధికారుల తీరుకు నిరసనగా తాళం వేసిన కాన్ఫరెన్స్ హాల్ ముందు మేయర్ సురేష్ బాబు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీకి చెందిన 43 మంది సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ కార్పొరేటర్లు మీటింగ్ హాల్లోనే ఉండి పోయారు. చట్టప్రకారం కార్పొరేషన్ ప్రాంగణంలో సమావేశం జరుగుతోంది. సభ్యులు.. ఎజెండాను చర్చించి ఆమోదిస్తున్నారు.కాగా, కడప కార్పొరేషన్ సమావేశ మందిరానికి తాళం వేయడంతో మున్సిపల్ కమిషనర్‌కి మేయర్ సురేష్‌బాబు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు తెరిస్తే సమావేశం ఎలా పెట్టాలంటూ సురేష్ బాబు ప్రశ్నించారు. సమావేశం మందిరం కాకుండా ఎక్కడ సమావేశం పెట్టాలో చెప్పాలన్న మేయర్.. అధికారులపై మండిపడ్డారు.‘‘కడప మున్సిపల్ కమిషనర్ నిబంధనలు పాటించడం లేదు. సమావేశం హాల్ తెరవాలని కోరినా పట్టించుకోలేదు. నాకు తెలియకుండా వేదికపై ఎమ్మెల్యేకు కుర్చీ వేశారు. సమావేశంపై కమిషనర్ నాతో చర్చించలేదు’’ అని మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.కడప కార్పొరేషన్ నిబంధనలకు టీడీపీ నేతలు తూట్లుకడప కార్పొరేషన్ నిబంధనలకు టీడీపీ నేతలు తూట్లు పొడిచారు. రెండు రోజుల కిత్రమే సమావేశంపై మేయర్ స్పష్టత ఇచ్చారు. కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం ఉన్నట్టు కమిషనర్‌కు మేయర్ లేఖ రాశారు. మేయర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా సమావేశ హాల్లో నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మేయర్ సురేష్‌బాబు ఆదేశాలను కమిషనర్ పట్టించుకోలేదు. సమావేశం కోసం కాన్ఫరెన్స్‌హాల్ తెరవాలని మేయర్ కోరారు.కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం పెట్టాలని గతంలో హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ కాన్ఫరెన్స్ హాల్‌కు అధికారులు తాళం వేశారు. సమావేశ మందిరంలో మీటింగ్ నిర్వహించేదిలేదని మేయర్ సురేష్‌బాబు తేల్చి చెప్పారు. దీంతో కాన్ఫరెన్స్ హాలులో సమావేశం అనగానే అధికారులు తాళం వేశారు. -
కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్
-
Rajampeta : పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్న ప్రవాసాంధ్రుడు
కడప: దృష్టి.. జీవన ప్రయాణంలో అత్యంత కీలకం. కళ్లు సరిగా ఉంటే.. ఏ పనయినా చేసుకోవచ్చు. కానీ కొందరు కళ్లను సరిగా పట్టించుకోకపోవడం వల్ల అది దృష్టి లోపానికి దారి తీస్తోంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల కంట్లో శుక్లాలకు దారి తీస్తుంది. ఇలాంటి అభాగ్యులకు అండగా నిలిచారు అమెరికాలో స్థిరపడ్డ ప్రవాసాంధ్రుడు వల్లూరు రమేష్ రెడ్డి.ఆకేపాడు గ్రామంలోని అమర్నాథరెడ్డి నివాసంలో చెన్నై శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 రోజులపాటు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం రవాణా సదుపాయంతో పాటు ఉండేందుకు వసతి కల్పించారు. ఈ శిబిరం ద్వారా ఏకంగా 238 మంది కంటి శస్త్రచికిత్సలు చేయించుకోవడం నిజంగా గొప్ప విషయం. శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం ముగింపు సమావేశానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్నివేళలా అందుబాటులో ఉండి సేవలు అందించాలనే ఉద్దేశంతో పట్టణాన్ని సైతం వదిలి స్వగ్రామంలోనే నివాసం ఉంటూ నిత్యం వివిధ రకాల సేవలను పేదలకు అందిస్తున్న జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి సేవా తత్పరుడని కడప మేయర్ సురేష్ బాబు తెలిపారు. అలాగే వైఎస్సార్సిపి అమెరికా కన్వీనర్ వల్లూరు రమేష్ రెడ్డి తల్లి తండ్రుల జ్ఞాపకార్థం 30 లక్షల రూపాయలు వెచ్చించి ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహించి 238 మందికి కంటి చూపు తెప్పించడం చాలా అదృష్టమని అన్నారు. ఎక్కడో అమెరికాలో స్థిరపడి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పుట్టిన గడ్డను మరవకుండా బడుగులకు సేవలు అందిస్తోన్న వల్లూరు రమేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 12 రోజులు పాటు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 1032 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 238 మందిని ఆపరేషన్లు చేయించేందుకు నిర్ణయించారు. పూర్తిగా ఉచితంగా ఈ చికిత్స అందించడంతో పాటు అద్దాలు, మందులను కూడా పంపిణీ చేశారు. ఎప్పుడో ఓసారి ఎక్కడో ఓ చోట ఏవైనా కార్పొరేట్ ఆసుపత్రులు ఒక్కరోజు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారని కానీ 12 రోజులు పాటు ఏకతాటిగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి సేవ చేయాలనే ఆలోచన చాలా గొప్పదని సురేష్‌బాబు కొనియాడారు. రమేష్ రెడ్డి చేసిన సేవకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఈ ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారందరూ ఆకేపాటి అమర్నాథరెడ్డిని ఆదర్శంగా తీసుకొని వారి వారి స్వగ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తే గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పుట్టిపెరిగిన గడ్డ అమ్మకు సమానమని, ఆ మాతృభూమికి ఎంతో కొంత సేవ చేసే అవకాశం నిజంగా అదృష్టమన్నారు రమేష్ రెడ్డి వల్లూరు. వైఎస్సార్ కడప జిల్లా నుంచి మూడు దశాబ్దాల కింద అమెరికా వెళ్లిన రమేష్ రెడ్డి ప్రస్తుతం వాషింగ్టన్ డి.సి.లో స్థిరపడ్డారు. ఇటీవలే తన తల్లితండ్రుల స్మృతిలో భాగంగా శంకర నేత్రాలయ ద్వారా ఈ ఉచిత కంటి శిబిరానికి తన వంతుగా చేయూత నిచ్చారు. 👁️ Proud to share that I've made a my contribution to a health camp that provided free eye check-ups for 1000+ patients and free surgeries for 238 people. We’re making a difference in improving lives! 🙏 💪❤️ #HealthcareForAll #CommunityImpact #GivingBack #CMJagan #AndhraPradesh — Ramesh Valluru Reddy (@YSRDist_RameshR) September 7, 2023 ఈ శిబిరానికి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు గజేందర్ కుమార్ వర్మ, డాక్టర్ సురభి, డాక్టర్ శంకర్ హాజరై శిబిరానికి వచ్చిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేశారు. వీరికి శంకర నేత్రాలయ నుంచి అరుల్ కుమార్, రంజిత్ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చొప్ప ఎల్లారెడ్డి, వైసీపీ నాయకులు పోలి మురళి, దాసరి పెంచలయ్య, డీలర్ సుబ్బరామిరెడ్డి, మహర్షి, రమేష్ నాయుడు పాల్గొన్నారు. -
కార్పొరేషన్ స్కూళ్లలో కార్పొరేట్ విద్య
- వైఎస్సార్(కడప) కార్పొరేషన్లో సరికొత్త ప్రయోగం - రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మేయర్ సురేష్‌బాబు ప్రయత్నం - 25 స్కూళ్లలో పేదలకు ఆంగ్ల విద్య - వైఎస్సార్ సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ చేయూత హైదరాబాద్: పేదలకు సైతం కార్పొరేట్ విద్య అందించాలనే సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్సార్(కడప) కార్పొరేషన్ మేయర్, వైఎస్సార్ సీపీ నేత కె. సురేష్‌బాబు. కార్పొరేషన్ స్కూళ్లలోనూ కార్పొరేట్ తరహా ఆంగ్ల మాధ్యమ విద్యను అందించాలని ఆయన సంకల్పించారు. ఈ క్రమంలో సురేష్‌బాబు ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 45 స్కూళ్లు ఉన్నాయని, వాటిలో స్లమ్ ఏరియాలోని 25 స్కూళ్లల్లో జూన్ నుంచి ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆయా స్కూళ్లలో కార్పొరేట్ తరహా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ రూ. 2,50,116 చెక్కును వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో తమకు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. సురేష్ బాబు ఆలోచనలకు తోడ్పాటు అందించేందుకు తాము సిద్ధమని వైఎస్సార్ సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ కన్వీనర్ పండుకాయల రత్నాకర్ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, కార్యదర్శి చల్లా మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.