breaking news
Kadapa Corporation elections
-
ఆ ఇద్దరు.. పోరాటయోధులు
సాక్షి ప్రతినిధి, కడప: కూటమి కుట్రలను చీల్చుకుంటూ.... అధికారుల ఆంక్షల సంకెళ్లను తెంచుకుంటూ ఆ ఇద్దరు బరిలో నిలిచారు.. పచ్చ నేతలు సాగిస్తున్న అరాచకాలను.. తమపై కక్షగట్టిన తీరును ప్రజల ముందుంచారు.. ఆశీర్వదించాలని ఓటరు దేవుళ్లను అభ్యర్థించారు. అంతకుముందు నిత్యం ప్రజా సేవలో తరించారు..ఇంకేముంది ప్రజా తీర్పు ముందు కూటమి కుట్ర ఓడిపోయింది. నిజమైన ప్రజా విజయం వారి ముంగిటకొచ్చి వాలింది. కడప కార్పొరేషన్ఎన్నికల్లో అన్ని అడ్డంకులు ఎదుర్కొని విజయం సాధించి పోరాటయోధులుగా నిలిచారు. వారే దేవి రెడ్డి ఆదిత్య, జమీల్. 33వ డివిజన్లో దేవిరెడ్డి ఆదిత్య భార్య సంధ్యారాణి, 46వ డివిజన్లో జమీల్‌ను స్థానిక డివిజన్ ప్రజలు కార్పొరేటర్లుగా ఆశీర్వదించారు. కాగా వీరి విజయం బాక్స్‌లో నిశ్చయమై ఉండగా, దాని సైతం తొక్కి పెట్టాలని టీడీపీ నేతలు కుయుక్తులు పన్నారు. కౌంటింగ్ ప్రక్రియను ఏకంగా మూడు గంటల పాటు నిలిపేయడం గమనార్హం. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ పెట్టినా.. వైఎస్సార్సీపీ నేతలైన జమీల్, ఆదిత్య ఎదుగుదలకు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అడుగడుగునా అడ్డుగా నిలిచింది. కూటమి అధికారంలోకి రాగానే కక్షగట్టి ఆదిత్య వాటర్ ప్లాంట్‌ను మూసే యించింది. అలాగే ఇటీవల నామినేషన్ల సందర్భంగా ఓ ఫోన్ సంభాషణలో ‘జమీల్‌ను వదిలిపెట్టొద్దు.., నేనున్నా టార్గెట్ చేయండి’ అంటూ నేరుగా మాట్లాడుతున్న విషయం బహిర్గతమైంది. ఆ ఇద్దరిని ఓడించేందుకు విశ్వప్రయత్నం చేశారు. పోలీస్ పవర్ ఉపయోగించుకున్నారు. ప్రజా తీర్పులో అవన్నీ దిగదుడుపేనని స్పష్టమైంది. రెండు డివిజన్లలో.. కడప కార్పొరేషన్ : కడప నగర పాలక సంస్థలోని 66 వార్డులకు ఇదివరకు 52 స్థానాలను కూటమి దౌర్జన్యాలతో ఏకగ్రీవం చేసుకున్న విషయం విది తమే. ఆపై 14 వార్డులకు ఎన్నికలు జరగ్గా 33, 46 డివిజన్లలో పోటీ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు సంధ్యారాణి, జమీల్ విజయం సాధించారు. ఇదీ చదవండి: ఇద్దరు ప్రత్యర్థులను ఢీకొట్టి.. 22 ఏళ్లకే కౌన్సిలర్! -
ఆమ్ ఆద్మీ తరపున స్వతంత్ర అభ్యర్థులు
కడప రూరల్, న్యూస్‌లైన్: కడప కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నగర కన్వీనర్, కో కన్వీనర్ సాజిద్ హుసేన్, సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కడప కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ తరుపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి సరైన సమయంలో బి.ఫారాలు అందించలేక పోయామన్నారు. స్వతంత్య్ర అభ్యర్థులుగా 10వ డివిజన్‌కు డాక్టర్ అశోక్‌కుమార్, 13వ డివిజన్‌కు జీవీ సుబ్రమణ్యం, 14వ డివిజన్‌కు ఎ.నారాయణ, 19వ డివిజన్‌కు ఎం.సుబ్బరాయుడు, 31వ డివిజన్‌కు జఫ్రరుల్లాఖాన్, 32వ డివిజ న్కు సయ్యద్ జావిద్‌బాష, 42వ డివిజన్‌కు మహబూబ్‌పీర్ ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున చీపురు గుర్తుపై పోటీ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు పి.శివారెడ్డి, ప్రమీలాదర్శన్ పాల్గొన్నారు.


