Kaavaalaa Song
-
నా డ్యాన్స్ నాకే నచ్చలేదు!
ఎంత బాగా పని చేసినా ఇంకా బెటర్‌గా చేసి ఉంటే బాగుండేది అనిపిస్తే కచ్చితంగా వాళ్లకి పని పట్ల శ్రద్ధ ఎక్కువ అని అర్థం. తమన్నా ఈ కోవకే చెందుతారు. అందుకు ఆమె తాజా మాటలు ఓ నిదర్శనం. బాలీవుడ్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరా ఖాన్ తన యూ ట్యూబ్ వ్లాగ్‌లో భాగంగా తమన్నా ఇంటికి వెళ్లారు. అప్పుడు ఈ ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ ముచ్చట్లలో ‘జైలర్’లోని ‘నువ్వు కావాలయ్యా... పాట గురించి తమన్నా ప్రస్తావించారు.‘‘ఈ పాటలో నేను చేసిన డ్యాన్స్ నా మనసుకి నచ్చలేదు. ఈ పాట షూట్ పూర్తయి, లొకేషన్ నుంచి వెళుతున్నప్పుడు నాకు అసంతృప్తిగా అనిపించేది. ఇంకా బెటర్‌గా చేసి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ కలిగేది’’ అని ఫరాతో తమన్నా అన్నారు. ఈ మాటలు విన్నవాళ్లు ఆశ్చర్య పోవడం ఖాయం. ఎందుకంటే ఈ స్పెషల్ సాంగ్‌లో తమన్నా డ్యాన్స్‌కి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ పాటలో తమన్నా చేసిన హుక్ స్టెప్ని అనుకరించి, చాలామంది రీల్స్ కూడా చేశారు. కానీ ఈ మిల్కీ బ్యూటీకి మాత్రం తన స్టెప్స్ నచ్చలేదు. తమన్నా ఇలా అనగానే... ‘‘నిజానికి నువ్వు ఏ పని చేసినా ఇంకా బాగా చేయాల్సింది అని ఆలోచిస్తావు’’ అన్నారు ఫరా ఖాన్. అంటే... తమన్నా అంత ప్రోఫెషనల్‌గా ఉంటారని అర్థం. ఇక ‘నువ్వు కావాలయ్యా.. పాట తర్వాత తమన్నాకి బోలెడన్ని స్పెషల్ సాంగ్స్‌కి చాన్స్ వచ్చింది. అలా వచ్చిన వాటిలో ఆమె చేసిన ‘ఆజ్ కీ రాత్’ సాంగ్ కూడా బాగా హిట్టయింది. హిందీ చిత్రం ‘స్త్రీ 2’లోని పాట ఇది. ‘‘ఈ పాట కోసం నేను 15 రోజులు శిక్షణ తీసుకుని, ఆ తర్వాత షూట్‌కి వెళ్లాను. ఎందుకంటే నేను ట్రైన్డ్ డ్యాన్సర్‌ని కాదు’’ అని పేర్కొన్నారు తమన్నా. -
తమన్నా మాస్ స్టెప్పులు.. అలా పోల్చిన విజయ్ వర్మ!
Tamannaah Vijay Varma: హీరోయిన్ తమన్నా ఈ మధ్య తెగ ట్రెండింగ్ అవుతోంది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్, ముద్దుల దగ్గర నుంచి మొదలుపెడితే వెబ్ సిరీసుల్లో వీరిద్దరూ రెచ్చిపోవడం వరకు ఒకటా, రెండా.. ఎక్కడ చూసినా మిల్కీ బ్యూటీనే. చేతిలో ఉన్న సినిమాలు తక్కువేమో గానీ వస్తున్న వార్తలు మాత్రం బోలెడు. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు విజయ్ వర్మ.. ఈమె డ్యాన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమన్నా ఊరమాస్ సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీగా ఉన్న తమన్నా.. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్'లో నటిస్తోంది. ఈ మూవీ నుంచి రీసెంట్ గా 'కావాలా..' లిరికల్ పాటని విడుదల చేశారు. ట్యూన్ క్యాచీగా ఉంది. ఇందులో తమన్నా డ్యాన్స్ సూపర్ గా ఉంది. ఊరమాస్ స్టెప్పులతో అదరగొట్టింది. యూట్యూబ్ లో ఈ సాంగ్ తెగ ట్రెండ్ అవుతోంది. (ఇదీ చదవండి: రెచ్చిపోతున్న తమన్నా.. ఆ విషయం అర్థమైపోవడం వల్లే!) సినిమా దేవత గతేడాది వరకు సింగిల్ గానే ఉన్న తమన్నా.. ప్రస్తుతం నటుడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ మెంటైన్ చేస్తోంది. వీళ్లిద్దరూ జంటగా నటించిన 'లస్ట్ స్టోరీస్ 2' ఈ మధ్యే రిలీజైంది. అందులో శృంగార సన్నివేశాలు, ముద్దులతో ఈ జోడీ రెచ్చిపోయింది. ఇక తమన్నా లేటెస్ట్ సాంగ్ చూసిన విజయ్ వర్మ ఫిదా అయిపోయాడు. 'పాట ఫైర్ పుట్టిస్తోంది. సినిమా దేవుడు, దేవత' అని విజయ్ రాసుకొచ్చాడు. లవర్ని ఓ రేంజులో అయితే ఈ క్యాప్షన్ లో రజినీకాంత్ ని సినిమా దేవుడు అని విజయ్ వర్మ చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ తమన్నాని ఏకంగా దేవత అని ఎలివేషన్ ఇవ్వడం మాత్రం ఆశ్చర్యపరిచింది. ఎంత లవర్ అయితే మాత్రం ఈ రేంజు ఎలివేషన్స్ ఎలా భయ్యా అని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిన సామ్.. ఆ ఆరు నెలలు!)


