breaking news
K8 Plus
-
లెనోవో కె8ప్లస్ కొత్త వేరియంట్...డిస్కౌంట్
సాక్షి, ముంబై: చైనా మొబైల్ ఉత్పత్తిదారు లెనోవో కె 8 ప్లస్ లో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇటీవల లాంచ్ చేసిన లెనోవో కె 8 ప్లస్ లో 4 జీబీ వేరియంట్‌ను శుక్రవారం విడుదల చేసింది. దీని ధర రూ.11,999గా కంపెనీ ప్రకటించింది. ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా లభించనుంది. ఈ సందర్భంగా లాంచింగ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ లో వెయ్యి రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు రూ.10వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్కూడా అందుబాటులో ఉంచింది. లెనోవో కె8 ప్లస్ ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే మీడియా టెక్ డాక్ హెలియో పీ25 ఆక్టా కోర్ 2.6 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.1 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 13ఎంపీ+ 5ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
లెనోవో కె8ప్లస్ లాంచ్.. లాంచింగ్ ఆఫర్స్
సాక్షి,న్యూఢిల్లీ: మొబైల్ ఉత్పత్తిదారు లెనోవా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. లెనోవో కె 8, కె 8 ప్లస్ పేరుతో రెండు డివైస్‌లను ఇండియాలో బుధవారం విడుదల చేసింది. దీని ధర రూ.10,999గా కంపెనీ ప్రకటించింది. ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా లభించనుంది. ఈ విక్రయాలు రేపటిను నుంచి ప్రారంభంకానున్నాయని లెనోవా ట్విట్టర్‌ద్వారా ప్రకటించింది. కొన్ని వారాలలో ఇది ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సందర్భంగా లాంచింగ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. రూ.10వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్, జియో ఖాతాదారులకు 30జీబీ అదనపుడేటా, మోటోప్లస్ 2 హెడ్ ఫోన్స్ రూ. 599లకే అందిస్తోంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ బై ద్వారా 5 వా. బ్లూటూత్ స్పీకర్‌పై రూ.100 తగ్గింపు, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులపై 15శాతం తగ్గింపును ప్రకటించి. సెప్టెంబర్ 7-8 తేదీల మధ్య ఈ ఆఫర్లు వర్తిస్తాయి. లెనోవో కె8 ప్లస్ ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే మీడియా టెక్ డాక్ హెలియో పీ25 ఆక్టా కోర్ 2.6 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.1 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 13ఎంపీ+ 5ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, And that's a wrap from the #LenovoK8Launch! Hope you're ready for the sale tomorrow for the #LenovoK8Plus, exclusively on @Flipkart. pic.twitter.com/n1oclDVamD — Lenovo India (@Lenovo_in) September 6, 2017