breaking news
junior chess tourny
-
వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న దివ్య
గుజరాత్‌లోని గాంధీ నగర్లో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ జూనియర్ (అండర్-20 అమ్మాయిల విభాగం) చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత నంబర్ 3 క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ విజేతగా నిలిచింది. 18 ఏళ్ల దివ్య.. ఫైనల్ రౌండ్లో బల్గేరియాకు చెందిన బెలొస్లావా క్రస్టేవాపై విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుంది. మొత్తం 11 పాయింట్లకు గానూ 10 పాయింట్లు సాధించిన దివ్వ టాప్ ప్లేస్‌లో నిలిచింది.ఈ పోటీలో దివ్య తెల్ల పావులతో బరిలోకి దిగింది. గత నెలలో షార్జా ఛాలెంజర్స్ టైటిల్ గెలిచిన తర్వాత దివ్యకు ఇది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో దివ్య తర్వాతి స్థానంలో 20 ఏళ్ల ఆర్మేనియా క్రీడాకారిణి మరియమ్ నిలిచింది. మరియమ్ 11 పాయింట్లకు గాను 9.5 పాయింట్లు సాధించింది. మూడో స్థానంలో అజర్ బైజాన్‌కు చెందిన అయాన్ అల్లావెర్దియేవా నిలిచింది. ఈమె ఖాతాలో 8.5 పాయింట్లు ఉన్నాయి. భారత్‌కు చెందిన షుబి గుప్తా, రక్షిత రవి 8, 7.5 పాయింట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన దివ్య రెండు డ్రాలు, తొమ్మిది విజయాలు సాధించి, తన ఎనిమిదో జూనియర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. -
3 నుంచి తెలంగాణ చెస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ వచ్చే నెల 3 నుంచి జరగనుంది. అండర్-19 కేటగిరీలో ఖమ్మంలో మూడు రోజుల పాటు ఈ టోర్నీ పోటీలు జరుగుతాయని టీఎస్‌సీఏ కార్యదర్శి వెంకటేశ్వర రావు తెలిపారు. ఇందులో టాప్-4 స్థానాల్లో నిలిచిన బాలబాలికలు జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌కు అర్హత పొందుతారని ఆయన చెప్పారు. ఈ టోర్నీ నేపథ్యంలో గురువారం రాష్ట్ర హోంమంత్రి నాయినర్సింహా రెడ్డి పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చెస్ సం ఘం (టీఎస్‌సీఏ) అధ్యక్షుడు ఎ. నరసింహా రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర రావు, టోర్నీ మీడియా ఇన్చార్జి రమేశ్ కుమార్‌లు పాల్గొన్నారు.