breaking news
junior badminton
-
క్వార్టర్ ఫైనల్లో భారత్
సాలో (ఇండోనేసియా): ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి పోరులో శ్రీలంకపై గెలుపొందిన భారత జట్టు... శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై విజయం సాధించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో భారత్ 110–83 పాయింట్ల తేడాతో యూఏఈని చిత్తుచేసింది. భారత్ తరఫున తొలి మ్యాచ్ మహిళల సింగిల్స్‌లో రుజులా 11–5తో మైసా ఖాన్‌పై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్‌లో లాల్‌రమ్‌సంగా–తరిణి జంట 11–6తో యూఏఈ జోడీపై నెగ్గింది. తన్వీ శర్మ, రిషిక కూడా విజయాలు సాధించడంతో భారత జట్టు సునాయాసంగా గెలుపొందింది. ఇదే గ్రూప్‌లో ఉన్న హాంకాంగ్ కూడా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి నాకౌట్ దశకు చేరింది. ఇక ఆదివారం జరగనున్న పోరులో హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలవనుంది. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ అత్యుత్తమంగా 2011లో కాంస్య పతకం నెగ్గింది. ఆ తర్వాత మరోసారి పతకం సాధించలేకపోయింది. గతేడాది క్వార్టర్ ఫైనల్లో మలేసియా చేతిలో ఓడి రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మొత్తం 17 జట్లు పాల్గొంటున్న ఈ టోరీ్నలో సెమీఫైనల్‌కు చేరితే పతకం ఖాయం కానుంది. -
తామిరి సూర్య చరిష్మాకు కాంస్య పతకం
జర్మన్ ఓపెన్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తామిరి సూర్య చరిష్మా కాంస్య పతకం గెలిచింది. బెర్లిన్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–19 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో చరిష్మా 21–15, 20–22, 17–21తో కిమ్ మిన్ జీ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు చరిష్మా క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సితి జులైఖా (మలేసియా)పై... రెండో రౌండ్ లో13వ సీడ్ పిచిత్ప్రిచాసెక్ (థాయ్‌లాండ్)పై సంచలన విజయాలు సాధించింది. -
ప్రపంచ నంబర్ వన్ షట్లర్‌గా భారత అమ్మాయి
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అండర్–19 మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో కొత్త నంబర్‌వన్‌గా భారత్‌కు చెందిన అనుపమ ఉపాధ్యాయ అవతరించింది. హరియాణాలోని పంచ్‌కులాకు చెందిన 17 ఏళ్ల అనుపమ ఈ ఏడాది ఉగాండా, పోలాండ్ ఇంటర్నేషనల్ టోర్నీలలో విజేతగా నిలిచింది. టాప్ ర్యాంక్‌లో ఉన్న భారత్‌కే చెందిన తస్నిమ్ మీర్‌ను రెండో స్థానానికి నెట్టి అనుపమ అగ్రస్థానానికి చేరింది. భారత్‌కే చెందిన అన్వేష గౌడ ఆరో ర్యాంక్‌లో, ఉన్నతి హుడా తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్నారు. బెంగళూరులోని ప్రకాశ్ పడుకోన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న అనుపమ జూనియర్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన ఆరో భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. గతంలో ఆదిత్య జోషి (2014), సిరిల్ వర్మ (2016), లక్ష్య సేన్ (2017), తస్నిమ్ (2022), శంకర్ సుబ్రమణియన్ (2022) ఈ ఘనత సాధించారు. -
సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మేఘన
సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మారుు మేఘన క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన అండర్-13 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో మేఘనారెడ్డి (తెలంగాణ) 22-20, 21-14తో శివంగి సింగ్ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో శ్రీయ (తెలంగాణ) 13-21, 9-21తో అనుపమ ఉపాధ్యాయ (ఉత్తరాఖండ్) చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మేఘన 21-11, 21-10తో ప్రియాంక పంత్ (మధ్యప్రదేశ్)పై, శ్రీయ (తెలంగాణ) 21-13, 21-19, 21-19తో జర్లిన్ అనికా (తమిళనాడు)పై నెగ్గారు. బాలుర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో సారుువిష్ణు పుల్లెల (తెలంగాణ) 21-19, 21-8తో జోమి సింగమ్ (మణిపూర్)పై, ప్రణవ్ రావు (తెలంగాణ) 21-8, 21-9తో హర్షిత్ సేతి (రాజస్థాన్)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. అండర్-15 బాలికల మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో సామియా ఇమాద్ ఫరూఖి (తెలంగాణ) 21-14, 21-8తో ముస్కాన్ రాథోడ్ (మధ్యప్రదేశ్)పై, భార్గవి (తెలంగాణ) 21-12, 21-16తో కోశా లిలె (గుజరాత్)పై, కేయూర (తెలంగాణ) 21-10, 21-9తో తస్నీమ్ మీర్ (గుజరాత్)పై గెలుపొందారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల విజేతలు అండర్-13 బాలుర డబుల్స్: ప్రణవ్ రావు- సాయి విష్ణు (తెలంగాణ) జంట 21-14, 21-5తో అయాన్- అయాద్ రషీద్ (అస్సాం) జోడీపై, ధర్మాజ్ఞ (తెలంగాణ)- రుషేంద్ర (ఏపీ) జంట 21-1, 21-8తో జోయ్ చటర్జీ- రోనక్ నేగి (జార్ఖండ్) జోడీపై, రవి ఉత్తేజ్- నిక్షిప్త్ (తెలంగాణ) జంట 21-9, 21-8తో ఖర్బూలి- లావన్బియాంగ్ వన్నింగ్ (మణిపూర్) జోడీపై, వంశీకృష్ణ (ఏపీ)- ఉనీత్కృష్ణ (తెలంగాణ) జంట 21-7, 21-5తో యశ్‌రాజ్ బిశ్వాల్- ప్రియాన్షు మెహంతి (ఓడిశా)పై గెలిచాయి. బాలికల డబుల్స్: మేఘన (తెలంగాణ)- తస్నీమ్ మీర్ (గుజరాత్) జంట 21-1, 21-3తో నుపుర్ (గుజరాాత్)- ఖామ్సెంగ్ రాజ్‌కుమారి (అస్సాం) జోడీపై, శ్రీయ (తెలంగాణ)- ప్రవీణ (తమిళనాడు) జంట 21-14, 21-11తో రియా- సహన్య కులకర్ణి (మహారాష్ట్ర) జోడీపై గెలుపొందాయి. అండర్-15 బాలికల డబుల్స్: భార్గవి- కైవల్య లక్ష్మి (తెలంగాణ) జంట 21-4, 21-7తో ప్రియా దేవి- సోనియా (మణిపూర్) జోడీపై, కేయూర (తెలంగాణ)- కవిప్రియ (పంజాబ్) జంట 21-7, 21-9తో మంద్రిత- ఉత్సవ (వెస్ట్ బెంగాల్) జోడీపై నెగ్గాయి.