breaking news
Jubilee Hills traffic police
-
డంకన్ డ్రైవ్లో చిక్కిన టీడీపీ ఎంపీ తనయుడు: విజయ్రాజు
సాక్షి,హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతూ టీడీపీ ఎంపీ సుధారాణి తనయుడు విజయ్రాజు పోలీసులకు పట్టుబడ్డాడు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు నెం.36లో డ్రైవ్ నిర్వహించారు. ఈ సమయంలో మాదాపూర్ వైపు నుంచి కుటుంబంతో కలిసి విజయరాజ్ ఫార్చునర్ (ఎపి36 ఏక్యూ 0777) కారులో వస్తుండగా పోలీసులు ఆపారు. వాహనం నడుపుతున్న విజయరాజ్ను పరీక్షించగా మోతాదుకు మించి మద్యం తాగినట్టు గుర్తించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన సినీ రచయిత
హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సినీ రచయిత బివిఎస్ రవి దొరికిపోయారు. ఆయన మద్యం సేవించి కారును డ్రైవ్ చేస్తూ వస్తుండగా అర్థరాత్రి పోలీసులు ఆపి సోదాలు చేశారు. దాంతో రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇదే కారులో సినీ నటుడు రవితేజ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. వారిని కూడా పోలీసులు తనిఖీలు చేశారు. అయితే వీరు మద్యం సేవించలేదని తేలింది.అనంతరం మరోకారులో రవితేజ, శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి వెళ్లి పోయారు. కాగా వాహదారులు పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను చెక్ చేస్తున్న పోలీసులు పలుకుబడి ఉన్నవారిని, ప్రజాప్రతినిధులను మాత్రం వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.