డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన సినీ రచయిత | writer bvs ravi arrested in drunken and drive case | Sakshi
Sakshi News home page

డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన సినీ రచయిత

Apr 5 2014 9:03 AM | Updated on May 25 2018 2:06 PM

డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన సినీ రచయిత - Sakshi

డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన సినీ రచయిత

హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సినీ రచయిత బివివి రవి దొరికిపోయారు.

హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సినీ రచయిత బివిఎస్ రవి దొరికిపోయారు.  ఆయన మద్యం సేవించి కారును డ్రైవ్ చేస్తూ వస్తుండగా అర్థరాత్రి పోలీసులు ఆపి సోదాలు చేశారు. దాంతో రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇదే కారులో  సినీ నటుడు రవితేజ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. వారిని కూడా పోలీసులు తనిఖీలు చేశారు.

అయితే వీరు మద్యం సేవించలేదని తేలింది.అనంతరం మరోకారులో రవితేజ, శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి వెళ్లి పోయారు. కాగా వాహదారులు పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను చెక్ చేస్తున్న పోలీసులు పలుకుబడి ఉన్నవారిని, ప్రజాప్రతినిధులను మాత్రం వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement