breaking news
Job Salaries
-
హెచ్–1బీ వీసాకు కొలువుతో లింకు!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షునిగా పాలించిన కాలంలో అమలై తర్వాత బైడెన్ హయాంలో బుట్టదాఖలైన ఒక విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ట్రంప్ తొలివిడత అమెరికా అధ్యక్షునిగా పరిపాలించిన కాలంలో హెచ్–1బీ వీసాల కోసం లాటరీ విధానాన్ని పక్కనబెట్టి ఆయా కంపెనీలు ఉద్యోగానికి ఇచ్చే జీతభత్యాల ఆధారంగా వీసాలను జారీచేయాలని నిర్ణయించారు. ఆ విధానాన్నే ఆనాడు అమలుచేశారు. దీంతో కంపెనీలు మరింత మంది ఉద్యోగులను ఉన్నత ఉద్యోగాలకు తీసుకుంటాయని, తక్కువ స్థాయి ఉద్యోగాలు అమెరికన్లకే దక్కుతాయని ట్రంప్ సర్కార్ భావించింది. అయితే విదేశాల నుంచి వచ్చే నిపుణులైన ఉద్యోగులకు అన్ని స్థాయిల ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో జో బైడెన్ సర్కార్ ఈ విధానాన్ని రద్దుచేసి మళ్లీ లాటరీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ లాటరీ విధానానికి స్వస్తిపలికి ఉద్యోగి జీతం, హోదా, పొజిషన్ ఆధారంగా హెచ్–1బీ వీసాలు ఇవ్వాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం భావిస్తోంది. ఇందులోభాగంగా సంబంధిత ప్రతిపాదనను సమీక్షించాలంటూ శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ విభాగానికి తన ప్రతిపాదనలను పంపింది.వాస్తవానికి ప్రతి సంవత్సరం ఎన్ని హెచ్–1బీ వీసాలు జారీ చేయాలనే పరిమితిని అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 85,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తున్నారు. వీటిలో 20,000 వీసాలను మాస్టర్స్ డిగ్రీ పట్టా ఉన్న ఉద్యోగులు ప్రత్యేకంగా కేటాయించారు. వీటిలో అత్యధికం అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే సాధిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసి తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి వీసా దక్కేలా చేస్తున్నాయి. ఇక ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం కేటాయించారు.2026 ఏడాదికి జారీచేయాల్సిన వీసాల కోసం స్వీకరించాల్సిన దరఖాస్తులు సరిపడా రావడంతో వాటి ప్రాసెస్‌ను నిలిపివేశారు. అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్ విభాగం శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ లెక్కన 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చని స్పష్టమైంది. పొజిషన్ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియలను అమెరికాలోని ఆర్థికరంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. అత్యధిక వృత్తి నైపుణ్యాలున్న వ్యక్తులకే అత్యధికంగా హెచ్–1బీ వీసాలు దక్కే అవకాశం ఉండటంతో వారి కృషి, పని ద్వారా అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారు ఆశిస్తున్నారు. -
కమీషన్ లేనిదే పనిచేయని ఎంపీడీఓ
► అవినీతిని ప్రశ్నిస్తే వేధింపులా.. ► ఎంపీపీ బాసని రమాదేవి శాయంపేట : గ్రామాల్లో ఏ పనిచేసిన, ఏ ఉద్యోగి వేతనా లు ఇవ్వాలన్నా పర్సంటే జీలేనిదే ఎంపీడీఓ బానోతు భద్రునాయక్ పని చేయరని శాయంపేట ఎంపీపీ బాసని రమాదేవి ఆరోపించారు. బుధవారం మండలకేంద్రం లోని ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దొంగ బిల్లులు సృష్టించి సంతకాలు పెట్టమని వేధిం చినట్లు చెప్తున్న ఎంపీడీవో భద్రునాయక్ దేనికి సంబంధించిన బిల్లులో పత్రికా ముఖంగా తెలియజేయాలని అన్నారు. సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ దైనంపల్లి కుమారస్వామికి పనిచేయని నెలల్లో సైతం వేతనాలు చెల్లించే విధంగా ఉన్నతాధికారులకు తన ప్రమేయం లేకుండానే సిఫారసు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రతినెల గ్రామ కోఆర్డినేటర్లకు వచ్చే వేతనాల్లో 50 శాతం పర్సంటేజ్ తీసుకుని ఎంపీడీఓ, ఎంసీఓ పంచుకోవడంలో నిజం లేదా అని అన్నారు. ఎమ్మె ల్యే సీడీఎఫ్ పనులకు వీడీసీ ఇచ్చేందుకు కారోబార్‌ను మధ్యవర్తిగా పంపించిన రోజులను మర్చిపోయారా అన్నారు. అంతేకాకుండా వీడీసీ కోసం తన భర్త మాజీ ఎంపీపీ బాసని చంద్రప్రకాశ్ వద్ద రూ.17 వేలు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక అధికారిగా ఉన్న సమయంలో మండలకేంద్రంలోని మార్కెట్ స్థలంలో చదను చేసే పేరు తో లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆసరా పింఛన్ల పంపిణీలో రూ.50వేల చెక్కును దొంగ బిల్లులు సృష్టించి కాజేసి పత్రిక విలేకరులకు ఇచ్చినం అని చెప్పలేదా అన్ని ప్రశ్నించారు. ఆసరా పేరుతో కాజేసీ బిల్లు ఉన్నతాధికారులకు అందిస్తామని ఎంపీపీ చెప్పా రు. ఇప్పటి వరకు మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే ఏ ఒక్క అధికారిని ఎంపీపీగా బెదిరింపులకు గురిచేయలేదన్నారు. ఎంపీడీఓ అవినీతిని ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేసినట్లా అని అన్నారు. గతంలో పనిచేసిన ఉద్యోగులపై అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు మండల పరిషత్ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి చెప్తాడని అన్నారు. ఇప్పటికైన ఎంపీడీఓ తన తీరు మార్చుకోవాలని సూచించారు. ఆమె వెంట శాయంపేట ఎంపీటీసీ కందగట్ల రవి ఉన్నారు.