breaking news
job regularisation
-
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. పూర్తి పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. అయితే, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అభ్యర్థుల దగ్గర నుంచి వసూళ్లు ప్రారంభించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యోగాలు ఇప్పించలేరని తేల్చిచెప్పాయి. సిఫార్సులకు ఆస్కారం లేకుండా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూలు పెట్టలేదని వెల్లడించాయి. -
మా సర్వీసులను క్రమబద్ధీకరించండి
► కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నేతల డిమాండ్ విజయనగర్ కాలనీ: కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు ముట్టడించారు. తెలంగాణ ఆల్ లెక్చరర్స్ కాంట్రాక్టు టీచర్స్ అసోసియేషన్ (టి–ఏయూసీటీఏ) అధ్యక్షుడు రామేశ్వర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అన్యాయాన్ని ప్రతిఘటించే ఎన్నో ఉద్యమాలకు వేదికలుగా నిలిచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్స్ యూనివర్సిటీలకు ఇవ్వక పోవడం వల్ల యూనివర్సిటీలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. దీంతో యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, కాంట్రాక్ట్ అధ్యాపక వ్యవస్థ ఆవిర్భవించిందన్నారు. రెగ్యులర్ పోస్టుల్లో కూడా నియామకాలు చేపట్టకపోవడంతో కాంట్రాక్ట్ అధ్యాపకుల నియామకం మొదలైందన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు చాలీచాలని జీతాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయిస్తూ యూజీసీ నిబంధనలను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ కుమార్, కాంట్రాక్టర్ లెక్చరర్లు పాల్గొన్నారు. -
చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
-
చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
-
చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
► సమస్యలు పరిష్కరించాలని హోంగార్డుల ధర్నా ► సచివాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం ► అడ్డుకున్న పోలీసులు.. రెండుసార్లు లాఠీచార్జి ► ఒంటిపై కిరోసిన్ పోసుకున్న ఓ హోంగార్డు ► పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ► హోంగార్డులపై ఐదు కేసులు నమోదు సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ గురువారం హోంగార్డులు చేపట్టిన చలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది హోంగార్డులు సచివాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీ సులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట, వాగ్వా దం జరిగాయి. హోంగార్డులను చెదరగొట్టేం దుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీనిపై ఆగ్రహించిన హోంగార్డులు సచివాలయం ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఓ హోంగార్డు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో దా దాపు 4గంటలపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు కొందరు హోంగార్డులను అదుపులోకి తీసుకుని, మరోసారి లాఠీ చార్జి చేసి ఆందోళన చేస్తున్నవారిని చెదరగొట్టారు. ఐదు రోజులుగా ఆందోళనలు తమ సమస్యల పరిష్కారం కోసం హోంగార్డులు ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. 2003లోపు హోంగార్డుగా ఐదేళ్లు పనిచేసిన వారిని రెగ్యులర్ చేయాలని, 2004 నుంచి హోంగార్డులుగా పనిచేస్తున్న వారికి కానిస్టేబుల్ స్థాయిలో బేసిక్ వేతనాన్ని వర్తింపచేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ ఆందోళనలో భాగంగా గురువారం కూడా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. వందలాది మంది హోంగార్డులు ఈ ధర్నాలో పాల్గొని రోడ్డుపై బైఠాయించారు. చర్చలకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి పిలుపురావడంతో.. హోంగార్డుల ప్రతినిధులు, బీసీ మహిళా సమాఖ్య నాయకురాలు శారదాగౌడ్ తదితరులు సచివాలయానికి వెళ్లారు. అయితే సాయంత్రం వరకు కూడా సీఎస్ నుంచి డిమాండ్లపై సానుకూలత రాకపోవడం, సీఎంతో మాట్లాడి రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పడంతో హోంగార్డులు ఆగ్రహించారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో సచివాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించుకుని ‘చలో సెక్రటేరియట్’ చేపట్టారు. అయితే ఇందిరాపార్కు వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు అప్రమత్తమై మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ రాక్‌గార్డెన్ వద్ద బారికేడ్లు, తాళ్లతో హోంగార్డులను నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ పెద్ద సంఖ్యలో ఉన్న హోంగార్డులు పోలీసులను, బారికేడ్లను తోసుకుని సచివాలయం వైపు వెళ్లారు. సచివాలయం వద్ద లాఠీచార్జి హోంగార్డుల చలో సెక్రటేరియట్ విషయం తెలుసుకున్న పోలీసులు సచివాలయం వద్ద భారీగా మోహరించారు. ర్యాలీగా అక్కడికి చేరుకున్న హోంగార్డులు సచివాలయంలోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీ సులు అడ్డుకోవడంతో తోపులాట, వాగ్వాదం జరిగాయి. హోంగార్డులను నిరోధించేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఆగ్రహించిన హోంగార్డులు దాదాపు నాలుగు గంటల పాటు సచివాలయం రోడ్డు వద్ద బైఠాయించారు. సెంట్రల్ జోన్ డీసీపీ హోంగార్డులను సముదాయించి, ఆందోళన విరమింప చేయడానికి ప్రయత్నించారు. కానీ వారు వెనక్కి తగ్గలేదు. రాత్రి 8 గంటల సమయంలో ఓ హోంగార్డు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. కొద్దిసేపటికే పలువురు హోంగార్డులను అదుపులోకి తీసుకున్నారు. మరోసారి లాఠీచార్జి చేసి మిగతా వారిని చెదరగొట్టారు. స్తంభించిన ట్రాఫిక్ హైదరాబాద్ నగరంలోని కూడళ్ల వద్ద విధులు నిర్వహించే హోంగార్డులు ఆందోళన బాట పట్టడం, సచివాలయం వద్ద బైఠాయింపుతో ట్రాఫిక్ స్తంభించింది. గురువారం ఉదయం నుంచి కూడా లక్డీకాపూల్, తెలుగుతల్లి చౌరస్తా, అసెంబ్లీ చౌరస్తాలన్నీ ట్రాఫిక్‌జామ్‌లతో దర్శనమిచ్చాయి. హోంగార్డుల ధర్నాకు తోడు మింట్‌కాంపౌండ్‌లో విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా, జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల అంశంపై బీజేపీ నాయకుల ధర్నాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరాయి. పలు చోట్ల రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లడానికి కూడా గంటకుపైగా సమయం పట్టింది. ఐదు కేసులు నమోదు హోంగార్డుల ఆందోళన పరిణామాలపై అంబర్పేట్, గాంధీనగర్, సైఫాబాద్, చిలకలగూడ, మారేడ్‌పల్లి పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు హోంగార్డ్స్ కమాండెంట్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్, ఇతర ఆధారాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ ఫోర్సెస్ చట్టం, పోలీస్ చట్టం, ఐపీసీలోని 143, 145, 146 (రెడ్‌విత్ 147), 149, 188, 186, 153, 341 సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా గుమిగూడడం, నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులను అడ్డుకోవడం తదితర ఆరోపణలను చేర్చారు. మా బాధలు తీర్చండి సీఎస్‌కు హోంగార్డుల అసోసియేషన్ విజ్ఞప్తి హోంగార్డుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు హోంగార్డుల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. నెలకు మూడు రోజుల సెలవులు, మహిళా హోంగార్డులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఆరోగ్య భద్రత, విధి నిర్వహణలో చనిపోయిన హోంగార్డుల కుటుంబానికి ఆర్థిక సాయం వంటి అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించింది. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు పాకాల రాజేశ్, చంద్రశేఖర్, రవీంద్రనాయక్, రవి తేజ, స్వాతి, రాజు విలేకరులతో మాట్లాడారు. కానిస్టేబుళ్లతో సమానంగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్న తమను నేటికీ తాత్కాలిక ఉద్యోగులుగానే గుర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు ఇంకా ఆర్డర్లీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ హోంగార్డులను ఇంటిపనులకు కూడా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటినీ భరిస్తూ పనిచేసినా.. అధికారులకు కోపమొస్తే అకారణంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. చాలీచాలని జీతాలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తమకు గుర్తింపు కార్డు కూడా లేని దుస్థితి ఉందని చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ తమను ‘మీరు హోంగార్డులు కాదు.. మినీ పోలీసులు’ అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తమిళనాడులో హోంగార్డుల పరిస్థితి మెరుగ్గా ఉందని, అటువంటి విధానాన్ని అనుసరించాలని సీఎస్ దృష్టికి తెచ్చామన్నారు. తమ విజ్ఞప్తిపట్ల సీఎస్ సానుకూలంగా స్పందించారని.. దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారని తెలిపారు. దీపావళిలోగా ముఖ్యమంత్రి నుంచి తమకు తీపి కబురు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం: డీజీపీ హోంగార్డులు తమ ఆందోళన విరమించి విధుల్లో చేరాలని డీజీపీ అనురాగ్‌శర్మ కోరారు. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోంగార్డుల సమస్యలు, ఇబ్బందులు తమ దృష్టిలో ఉన్నాయని.. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తామని ప్రకటించారు. దేశంలో హోంగార్డులకు అత్యధిక వేతనం చెల్లిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని.. రూ.5 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. యూనిఫాం సర్వీసుల్లో ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ఆందోళనలు, ఉద్యమాలు చేయడం సరికాదని.. వెంటనే ఆందోళన విరమించాలని సూచించారు.