చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. గ్రూప్-సిలో భాగంగా కోల్కతాలో సోమవారం ఇటలీతో తలపడింది స్కాట్లాండ్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టాస్ గెలిచిన ఇటలీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.అదిరిపోయే ఆరంభంఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్కు ఓపెనర్లలో జార్జ్ మున్సే (54 బంతుల్లో 84) అదిరిపోయే ఆరంభం అందించగా.. మైకేల్ జోన్స్ (37) కూడా రాణించాడు. వన్డౌన్లో వచ్చిన బ్రెండన్ మెక్ముల్లన్ (18 బంతుల్లో 41 నాటౌట్) ధనాధన్ దంచికొట్టగా.. ఆఖర్లో మైకేల్ లీస్క్ (5 బంతుల్లో 22 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో స్కాట్లాండ్ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 207 పరుగులు సాధించింది. తద్వారా టీ20 వరల్డ్కప్ టోర్నీలో 200కు పైగా స్కోరు చేసిన తొలి అసోసియేట్ జట్టుగా స్కాట్లాండ్ చరిత్ర సృష్టించింది.McMullen charges out and pumps it clean over long-on for a glorious hit. 🙌Marching towards 200! 💪ICC Men’s #T20WorldCup | #SCOvITA | LIVE NOW 👉 https://t.co/iRy5VavUwZ pic.twitter.com/Ax7EvdDitH— Star Sports (@StarSportsIndia) February 9, 2026ఇక లక్ష్య ఛేదనలో ఇటలీ ఆది నుంచే తడబడింది. టాపార్డర్లో జస్టిన్ మోస్కా (0), ఆంటోనీ మోస్కా (13) విఫలం కాగా.. జేజే స్మట్స్ 22 పరుగులు చేశాడు. హ్యారీ మానెంటి (25 బంతుల్లో 37), బెన్ మానెంటి (31 బంతుల్లో 52) రాణించినా.. మిగతా వారి నుంచి సహకారం లభించలేదు.73 పరుగుల తేడాతో ఓటమిఆరో స్థానం నుంచి బ్యాటింగ్కు వచ్చిన ఆటగాళ్లు స్కాట్లాండ్ బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్కు క్యూ కట్టారు. 2, 0, 3*, 2, 0, 0, 0 స్కోర్లతో వెనుదిరిగారు. దీంతో 16.4 ఓవర్లలో కేవలం 134 పరుగులు చేసి ఇటలీ ఆలౌట్ అయింది.ఫలితంగా స్కాట్లాండ్ 73 పరుగుల తేడాతో గెలుపొందింది. స్కాటిష్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మైకేల్ లీస్క్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మార్క్ వాట్ రెండు, బ్రాడ్ క్యూరీ, బ్రాడ్ వీల్, ఒలివర్ డేవిడ్సన్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో అనూహ్య రీతిలో స్కాట్లాండ్ రేసులోకి వచ్చింది. తొలి మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో ఓడిన ఈ జట్టు.. తాజాగా ఇటలీని ఓడించి గెలుపు బోణీ కొట్టింది. ఇదిలా ఉంటే.. ఇటలీ ఐసీసీ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించడం ఇదే తొలిసారి.చదవండి: IND vs PAK: పాక్ బోర్డుతో ఐసీసీ కీలక సమావేశం.. స్పందించిన బీసీసీఐ