breaking news
Jimmy Fallon
-
‘అందుకే తన పేరును కూడా కలిపేసుకున్నాను’
గతేడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్. ప్రస్తుతం కాలిఫోర్నియాలో అత్తారింట్లో ఎంజాయ్ చేస్తున్నారు ప్రియాంక చోప్రా. అయితే వివాహం అయ్యాక ప్రియాంక తన పేరు చివర జోనాస్ అని చేర్చుకున్నారు. జిమ్మీ ఫాలెన్ షోకు హాజరయిన ప్రియాంక తన పేరులో జోనాస్‌ను చేర్చుకోవడం గురించి వివరించారు. ఈ విషయం గురించి ప్రియాంక మాట్లాడుతూ.. ‘పెళ్లి తర్వాత నా పేరులో జోనాస్ పేరును కూడా చేర్చుకున్నాను. ఇలా చేయాలని ముందే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే.. పెళ్లి తర్వాత మేం ఒకే కుటుంబం అయ్యాము. అందుకే నా పేరులో తన పేరును కూడా కలుపుకున్నాను. కానీ నా ఐడెంటీని మాత్రం వదులుకోలేదు కదా ’అంటూ చెప్పుకొచ్చారు. -
ఒకసారి డ్రగ్స్ తీసుకున్నా: హీరోయిన్
లాస్ ఏంజెలెస్: ఆస్కార్ విన్నింగ్ నటి జెన్నిఫర్ లారెన్స్ తనకు సంబంధించిన రహస్యం వెల్లడించింది. ఒకసారి డ్రగ్స్ తీసుకున్నానని చెప్పింది. అయితే తాను కావాలని మత్తుపదార్థాలు తీసుకోలేదని తెలిపింది. 'హంగర్ గేమ్స్' సినిమా షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకున్నానని పేర్కొంది. జిమ్మీ ఫాలన్ గేమ్ షో 'ట్రు కన్ఫెసన్'లో ఆమె ఈ విషయాలు వెల్లడించింది. జాన్ అలీవర్ తో కలిసి ఈ షోలో ఆమె పాల్గొంది. ఆమె చెప్పిన షాకింగ్ విషయం నిజమా, కాదా అనేది తేల్చుకునేందుకు ఫాలన్ పలు ప్రశ్నలు సంధించాడు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత నిద్రపోయే సీన్ లో నటించారా అని అడగ్గా.. 'కాదు, డాన్స్ చేశాన'ని జెన్నిఫర్ జవాబిచ్చింది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల తేడా వస్తుందని అనుకున్నానని, మెలకువ వచ్చిన తర్వాత చూస్తే అంతా బాగానే ఉందని ఆమె వివరించింది. ఇలాంటి విషయాలు వెల్లడించడం వల్ల నిర్మాణ సంస్థల నుంచి ఇబ్బందులు వస్తాయోమోనని ప్రశ్నించగా.. 'హంగర్ గేమ్స్' గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పుడు 'స్టార్ వార్స్' సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారని తెలిపింది. ఇదంతా వాస్తవమేనా అని మరోసారి ఫాలన్, అలీవర్ ప్రశ్నించగా.. నిజంగా జరిగిందని జెన్నిఫర్ స్పష్టం చేసింది.